చిన్నారులను అసాంఘిక సైట్ల నుంచి రక్షించే ‘ఈ కవచ్’

అశ్లీల సైట్ల బారినుంచి కాపాడే అప్లికేషన్

0

నాణేనికి బొమ్మాబొరుసూ ఉన్నట్టే- ఇంటర్నెట్ వాడకం వెనుక కూడా మంచీ చెడూ అనే రెండు కోణాలుంటాయి. రెండు వైపులా పదునున్న కత్తితో నిత్యం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో చూసీ చూడనట్టు వదిలేస్తే- దిద్దుకోలేని తప్పు చేసినట్టే.

ఇంటర్నెట్ వాడకం, దాని భద్రతపై ఒక సెక్షన్ ఆఫ్‌ గ్రూప్‌లో ఎందుకో టాపిక్‌ వచ్చింది. అందరి సమస్యా అదే. అందరి భయమూ అదే. పిల్లలు ఇంటర్నెట్‌కి అడిక్ట్ అయ్యారు. ఏం చూస్తున్నారో తెలియడం లేదు. అదేపనిగా బ్రౌజింగ్ చేస్తున్నారు. గంటలు గంటలు సిస్టం ముందు కూచుంటున్నారు. అసలేం జరుగుతోంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం వరకు ఓకే. కానీ అందులో విజ్ఞానం ఎంత.. వినాశనం ఎంత అన్నది తేలాలి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు. పేరెంట్స్ అందరిదీ ఇదే సమస్య. అష్టదరిద్రపు సైట్లకు అలవాటు పడి- ఒకరకమైన ఫోబియాలోకి జారుకుంటే ఎలా? దీనికి తరుణోపాయం ఏమీ లేదా? కంట్రోల్ చేసే బటన్‌ లాంటిది ఉందా? ఉంటే బావుండు. ఎంత రేటైనా పర్లేదు కొనేద్దాం. చర్చ ఇలా సాగీ సాగీ - ఏదో ఒకటి చేయాలన్న తీర్మానం దగ్గర ఆగింది.

ఇదే విషయం నూపూర్ రంగనాథ్‌ మైండ్‌లో అదేపనిగా మెదులుతూ ఉంది. పిల్లలు సైబర్ వలలో పడి ఎలా పాడవుతున్నారో వాళ్ళు చెప్తుంటే వింటూ వెన్నులో ఒకరకమైన భయం పుట్టింది . టైమంతా వృధా చేయడం పక్కన పెడితే- పిల్లల ఆరోగ్యం ఏమైపోతుందో అని కంగారు పడింది. ఎక్కువగా సిస్టం ముందు కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తే ఇంకేమైనా ఉందా?

ఏం చేయాలి?

ఇంటర్నెట్‌ కనెక్షన్ లేకుండా చేయాలా? లేక, లాప్‌టాప్స్, టాబ్లెట్లు తీసి అటక మీద పడేయాలా? ఏం చేయాలి? అలా అలోచించడం కంటే ఏదో చేయాలి? నూపూర్‌ రంగనాథ్‌ మైండ్‌లో తళుక్కున మెరిసిందో ఐడియా. ఒక పరిష్కారంతో ముందుకొచ్చింది . ఈకవచ్. పిల్లలు ఇంటర్నెట్‌లో ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారో కనిపెట్టి హెచ్చరికలు, సందేశాలు పంపే టూల్. అలా అని- తమపై నిఘా ఏదో పెట్టారని పిల్లలకు అనుమానం కలగొద్దు. తెలిస్తే అమ్మ,నాన్నల మీద గౌరవం పోతుంది. అలా తెలియకుండా మానిటర్ చేయడమే దీని టాస్క్‌.

కవచంలా కాపాడుతుంది

నేటివిటీకి తగ్గట్టు ఇండియన్ పేరు పెట్టాలని అనుకున్నారు. దుర్మార్గమైన సైట్ల నుంచి పిల్లలను కాపాడే టూల్ కాబట్టి కవచ్‌ అని టెంటెవీగా అనుకున్నారు. తర్వాత దానికి ఈ తగిలించారు. ఫైనల్‌గా ఈ కవచ్‌ అని ఫిక్సయ్యారు.

ది యాప్

ఇది ప్రోయాక్టివ్ పరిష్కారాలను అందిస్తూనే పిల్లలకు టెక్నాలజీ పరంగా కూడా సాయం చేస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో భయాన్ని పోగొడుతుంది. ఈ అప్లికేషన్ రియల్ టైం ప్రాతిపదికన రిమోట్‌ కంట్రోల్‌గా పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు తల్లి తండ్రులకు నోటిఫికేషన్స్ పంపిస్తూ అలర్ట్ చేస్తుంది . దాంతోపాటు ఏవైనా చూడకూడని సైట్స్ ఉంటే వాటినీ బాన్ చేయవచ్చు. గంటలు గంటలు నెట్ ముందు కూర్చోకుండా- కొంత టైమ్‌ తర్వాత బ్రౌజింగ్ ఆగిపోయేలా అప్లికేషన్ సెట్‌ చేయొచ్చు. అశ్లీల సైట్లలాంటివి ఉంటే బ్లాక్ చేయడానికి సేఫ్ సెర్చ్ ను వాడుకోవచ్చు. ఇప్పుడు v1.0 రిలీజ్ చేశారు . తరువాత విడుదల చేయబోయే v2.0 వెర్షన్- సోషల్ మీడియాను కూడా మానిటర్ చేసే విధంగా ఉండబోతోంది. అది సక్సెస్ అయితే, v3.0. దాని స్పెషాలిటీ ఏంటంటే.. ప్రాంతాన్ని బట్టి పిల్లలకు భద్రత కల్పిస్తుంది.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik