అమెరికా టీవీ బ్రాడ్‌కాస్టింగ్ రంగాన్ని వణికిస్తున్న భారతీయ ఇంజినీర్

యూఎస్ టీవీ బ్రాడ్‌కాస్టింగ్ రంగంలో సంచలనంనెట్వర్కింగ్‌లో సత్తా చాటుతున్న చైతన్యఅవకాశాలను ఒడిసి పట్టుకోవడమే కాదు..సృష్టించుకోవడమూ తెలియాలి


అమెరికా టీవీ బ్రాడ్‌కాస్టింగ్ రంగాన్ని వణికిస్తున్న భారతీయ ఇంజినీర్

Tuesday June 30, 2015,

4 min Read

అమెరికా టెలివిజన్ ఇండస్ట్రీని వణికిస్తున్న 'ఏరియో' సంస్థను ప్రారంభించి, నిర్వహిస్తున్న వ్యక్తి చైతన్య చెత్ కనోజియా. టీవీసెట్లను కంట్రోలే చేసేందుకు అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయిపుడు. నెట్‌ఫ్లిక్స్ సొంతగా ప్రోగ్రామ్స్, షోస్ రూపొందిస్తోంది. మరోవైపు యాపిల్(యాపిల్ టీవీ), గూగుల్(క్రోమ్ టీవీ) సంస్థలు టెలివిజన్‌లకు అవసరమైన సాఫ్ట్‌వేర్ రూపొందించి, టీవీ వీక్షణంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పేరు మోసిన దిగ్గజాలే ఇలా తాపత్రయపడతుంటే... మార్కెట్ దక్కించుకునేందుకు ఏరియో సంస్థ వీటికి ప్రత్యామ్నాయంగా సింపుల్ సొల్యూషన్ కనిపెట్టేసింది.

image


ఏరియో ఏమిటి ? ఎలా పనిచేస్తుంది?

వేలు చివరన నిలబెట్టగలిగేటంత చిన్న యాంటెనాను కస్టమర్లకు అందిస్తుంది ఏరియో. ఇది బ్రాడ్‌కాస్ట్ సిగ్నల్స్‌ని కాప్చర్ చేసి.. యూజర్లు ఉపయోగిస్తున్న, కోరుకున్న కంటెంట్‌ను రిమోట్ ఏరియో సర్వర్లలో భద్రపరుస్తోంది. ఈ డేటాను కస్టమర్లు వారికి నచ్చిన డివైజ్‌లలో చూడొచ్చు. విండోస్, మ్యాక్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ఐఓఎఎస్, ఆండ్రాయిడ్‌లపై పని చేసే స్మార్ట్ ఫోన్స్‌లలో ఈ వివరాలను యాక్సెస్ చేయచ్చు. ఇందుకోసం నెలకు 8 డాలర్లను ఛార్జ్ చేస్తుంది ఏరియో. 20గంటల కంటెంట్‌ను రికార్డ్ చేసుకోవచ్చు. అదే 60గంటల కంటెంట్ రికార్డ్ చేసుకోవాలంటే 12 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వీరు ఒకేసారి రెండు ఛానళ్లకు సంబంధించిన కంటెంట్ ఒకేసారి రికార్డ్ చేసుకోవచ్చు.

సమస్యలేంటి ?

ఏరియోను లాంఛ్ చేసేందుకు ముందు... అనేక మంది నెట్వర్క్, బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీల వారితో చర్చలు జరిపారు కనోజియా. అందరూ కలిసి పని చేసే విధానాలపై మాట్లాడినా.. ఎలాంటి ప్రయోజనం లభించలేదు. అయితే ఏరియోను లాంఛ్ చేసేందుకు కొన్నివారాల ముందు బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ల కన్సార్టియం ఏరియోపై లాసూట్ ఫైల్ చేసింది. ఇదో క్లిష్టమైన కేసుగా చెప్పాలి. రెండు పక్షాలవైపు ఆసక్తికర వాదనలు ఇలా జరిగాయి.

బ్రాడ్‌కాస్ట్ నెట్వర్క్‌ల వాదన ప్రకారం.. వారు ట్రాన్స్‌మిట్ చేసే టీవీషో సిగ్నల్స్ వారి ఆస్తి మాత్రమే. వాటిని కాప్చర్ చేయడం, కాపీరైట్ చట్టాలను ఉల్లంఘిస్తుందని వాదించారు వారు. అయితే ఏరియో మాత్రం... ఇలా సిగ్నల్స్‌ను కేప్చర్ చేయడం కేవలం రెంటల్ ప్రైవేట్ యాంటెనా మాత్రమే అని వివరించింది. ఇలా కాప్చర్ చేసిన సిగ్నల్స్‌ను కేవలం వ్యక్తిగత అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునే వీలుంటుందని, పబ్లిక్ ప్లేస్‌లలో ప్రదర్శనకు వీలు లేదని తెలిపింది. ఇది చట్టానికి లోబడే ఉంటుందని తెలియచేసింది. ఏరియోకు చెందిన డేటా సెంటర్లలోని రిమోట్ సర్వర్లలో... సిగ్నల్స్, కంటెంట్ సేవ్ కావడమే సమస్య అయితే... ఐక్లౌడ్, డ్రాప్‌బాక్స్ వంటి క్లౌడ్ సేవల సంస్థలు చేస్తున్నది కూడా చట్టబద్ధం కాదంటూ ఏరియో వాదించింది.

ఇరువర్గాల వాదనలూ ఆసక్తికరంగా సాగాయి. బ్రాడ్‌కాస్ట్ నెట్వర్క్ కంపెనీల ప్రధాన సమస్య వారు తమ ఆదాయాలు కోల్పోతామనే. లోకల్ కేబుల్ ఆపరేటర్లు.. ప్రతీ నెలా రీ-ట్రాన్స్‌మిషన్ ఫీజులు చెల్లిస్తారు. ఇది ఏటా 3-4 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఏరియో వంటి ఉత్పత్తులు తమ పరిశ్రమను, ఆదాయ మార్గాలను దెబ్బ తీస్తాయని వారు భావించారు. ప్రజలు ఛానల్ ప్యాక్‌ల కోసం భారీ మొత్తాలను చెల్లించేందుకు బదులుగా... ఈ డివైజ్‌కు చిన్న మొత్తం చెల్లించి తమకు అవసరమైన షోలకే పరిమితమవుతారని బ్రాడ్‌కాస్టింగ్ వర్గాలు భయపడ్డాయి.

ఏరియో వెనుక గట్స్ ఉన్న ఇండియన్

చైతన్య మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇతనికి 10ఏళ్ల వయసులో తండ్రికి వచ్చిన గుండెనొప్పి.. వారి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల్లోకి తోసేసింది. ప్రతీ అంశానికి ప్లాన్ బీ, ప్లాన్ సీ, అవసరమైతే ప్లాన్ డీ కూడా ఉండాలని అప్పుడే అర్ధమైంది చైతన్యకు. జీవితంలో పెను మార్పులు ఒక్కసారిగా సంభవించకుండా ఉండాలంటే.. ప్రతీ అంశానికి ప్రత్యామ్నాయం తప్పనిసరిగా ఉండాలని భావించారు చైతన్య. ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన తర్వాత 1991లో అమెరికా వెళ్లి, నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సిస్టమ్స్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. మిడల్ ఈస్ట్ ప్రాంతంలో 10నెలలపాటు తోటి వర్కర్కతో ఓ టెంట్‌ను చైతన్య షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత అమెరికాకు తిరిగొచ్చి పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేశారు.

కొంతకాలం తర్వాత నావిక్ సిస్టమ్స్ అనే కంపెనీని సహ భాగస్వామ్యంతో ప్రారంభించి... కేబుల్ కంపెనీలకు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ అందించారు. రెండేళ్లపాటు దీనిపై విపరీతంగా శ్రమించిన తర్వాత నావిక్‌ను 200-250మిలియన్ డాలర్లను చెల్లించి 2008లో మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. దీంతో కనోజియా శ్రమ వృథా అయిపోయింది.

టెలివిజన్ రంగంలో సంపాదించిన ఈ అనుభవంతో మార్కెట్‌లో ఏదైనా కీలకమార్పు అవసరమని గుర్తించారు చైతన్య. టీవీ చూడడాన్ని మరింత అనుకూలంగానూ, కస్టమర్ల ఛాయిస్‌కు అనుగుణంగా ఉండేదిగానూ చేయాలని భావించారు ఆయన. టాప్ క్లాస్ ఇంజినీరింగ్ టీంను ఎంపిక చేసుకుని, తన ఆలోచనను 18నెలల్లో ఓ ప్రోటోటైప్ కంపెనీ స్థాయికి చేర్చారు. పలువురు ఇన్వెస్టర్ల నుంచి 100మిలియన్ డాలర్ల మేర నిధులు కూడా సేకరించగలిగారు ఈ సమయంలో. ఏరియోకు నిధులు అందించినవారిలో ఎక్స్‌పీడియ్ అండ్ ఇంటరాక్టివ్ కార్ప్ ఛైర్మన్ బారీ డిల్లర్ కూడా ఉన్నారు. ఈయన గతంలో ఫాక్స్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ, యూఎస్ఏ బ్రాడ్‌కాస్టింగ్‌లకు హెడ్‌గా బాధ్యతలు నిర్వహించారు కూడా. ప్రస్తుతం లక్షల్లో కస్టమర్లు ఏరియో సేవలను వినియోగించుకుంటున్నారంటే.. దీని వేగం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.

image


కోర్టు కేసు సంగతేంటి ?

ప్రారంభంలో న్యూయార్క్, బోస్టన్ ఏరియాల్లో మాత్రమే ఏరియోను లాంఛ్ చేశారు. 26 మార్కెట్లలోకి దశలవారీగా విస్తరించే లక్ష్యాలను ప్రారంభంలోనే నిర్ణయించుకున్నారు. అయితే.. ఇవన్నీ కోర్టు కేసులపై వచ్చే తీర్పుల ఆధారంగానే అనే విషయం గుర్తుంచుకోవాలి. కింది కోర్టులో ఏరియోకు అనుకూలంగానే తీర్పు వచ్చినా, వీరు ఎంటర్ కావాలని అనుకుంటున్న ప్రతి రాష్ట్రంలోనూ ఈ తరహా కేసులను ఎదుర్కోవాల్సిందే. అమెరికా సుప్రీంకోర్టు ఈ కేసును అంగీకరించడం వీరికి కొంత సానుకూల అంశంగా భావించారు. ఒకవేళ అత్యున్నత కోర్టు నుంచి అనుకూలమైన తీర్పు వస్తే మాత్రం.. ఒక్క కేసుతోనే మొత్తం మార్కెట్‌పై పట్టు సాధించే అవకాశముండేది. అయితే కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు... ఏరియోకు వ్యతిరేకమైన తీర్పునిచ్చింది.

మరి తర్వాతేంటి ?

ప్రస్తుతం ఏరియో హోమ్‌పేజ్ https://www.aereo.comలో చెత్ కనోజియా కస్టమర్లకు రాసిన ఒక లెటర్ మాత్రమే కనిపిస్తుంది. ప్రస్తుతానికి తమ కార్యకలాపాలను హోల్డ్‌లో ఉంచామని.. తమ లీగల్ విభాగం కింది కోర్టుల్లో పోరాడుతోందని అందులో తెలిపారు. ఎయిర్‌వేవ్స్ ఉపయోగించుకుంటున్న కంపెనీలకు వ్యతిరేకంగా అమెరికన్లు పోరాడాల్సిన అవసరముందని కూడా ఆ లేఖలో ఉంది. “కార్యక్రమాల ప్రసారాలకు బ్రాడ్‌కాస్టర్లు ఉపయోగించే స్పెక్ట్రం, ఎయిర్‌వేవ్స్ అన్నీ అమెరికా ప్రజలకు మాత్రమే చెందినవి” అంటారు కజోనియా. వాటిని రిసీవ్ చేసుకోవడానకి యాంటెనా, టీవీ, క్లౌడ్... ఇలా వేటినైనా ఉపయోగించుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉందంటారాయన. అలాగే ProtectMyAntenna.org పేరుతో ఒక ప్రజల తరఫున పోరాడుతున్నారు కూడా.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏరియో చరిత్ర అయిపోయిందంటారు కొందరు. అయితే బ్రాడ్‌కాస్టర్లకు రీట్రాన్స్‌మిషన్ ఫీజులు చెల్లించడం ద్వారా ఏరియోను తిరిగి లాంఛ్ చేసే అవకాశం లేకపోలేదు. అయితే ఈ భారాన్ని కస్టమర్లు మోయాల్సి ఉండడంతో... ఇంకా ఈ ఆలోచన చేయలేదు కనోజియా. అయితే... ఈయన దగ్గర ఉన్న ప్లాన్ బీ, ప్లాన్ సీ ఏమిటా అని మాత్రం... పరిశ్రమ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఏరియో టెక్నాలజీని ఉపయోగించుకుని, చట్టానికి అనుగుణంగా మరో భిన్నమైన బిజినెస్ మోడల్ లాంఛ్ చేస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని అధిగమించడానికి చెత్ కనోజియా దగ్గర ఉన్న మార్గాలపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఉన్నాయి. ఏరియో కస్టమర్లు కూడా ఇదే అంశంపై ఎదురు చూస్తున్నారు.