సైకిల్ మే సాహసయాత్ర... అదే అన్‌వెంచర్డ్ మంత్ర!

హిమాలయాల్లో సైకిల్ యాత్రలుసాహసీకులకు కొత్త దారులు చూపిస్తోన్న అన్వెంచర్డ్బెంగళూరు సిటీ టూర్ మరింత ప్రత్యేకంవారంపాటు గోవాలో సైకిల్ పై సవారి

సైకిల్ మే సాహసయాత్ర... అదే అన్‌వెంచర్డ్ మంత్ర!

Saturday May 02, 2015,

3 min Read

పదేళ్లపాటు స్టార్టప్ కంపెనీల్లో మునిగి తేలిన అనుభవం నేర్పిన పాఠం ఓ గొప్ప సంస్థను నెలకొల్పడానికి సాయపడింది. గురుదీప్ రాధాక్రిష్ణ తన చిన్ననాటి స్నేహితుడితో హిమాలయ అందాలను చూడటానికి సైకిల్ టూర్ ప్రారంభించారు. ముందుగా మనాలి నుంచి లెహ్ దాకా సైకిల్ పై వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

“ఈ టూర్ మాకొక గొప్ప అనుభూతనిచ్చింది. దీనిగురించి చెప్పడానికి మాటలు సరిపోవు సుమా” అంటారు గురుదీప్. 

కొండా గుట్టా అనే తేడా లేకుండా సైకిల్ సవారీ..

కొండా గుట్టా అనే తేడా లేకుండా సైకిల్ సవారీ..


మా సైకిల్ యాత్ర ముగిసిన కొంతకాలానికి నాకొక కొత్త ఆలోచన వచ్చింది. ఇదే యాత్రని వేర్వేరు వ్యక్తులతో చేపడితే ఎలా ఉంటుందనేదే నా ఆలోచన అని వివరించారు గురుదీప్. మరో ఎనిమిది మందిని ఒప్పించడంతో టూర్ ప్లాన్ అంతా చకచక జరిగిపోయింది. వారందరిలో డిఎన్ఎ ఒకలాగ లేకపోచ్చు కానీ వారంత బయట యాత్రలను చేయడానికి ఇష్టపడిన వారే. మొత్తానికి ఒక్కొక్కరి మనస్థత్వాలకు ఒక్కో అనుభూతినిచ్చింది ఈ ట్రిప్. అక్కడితో మొదలైన ఈ యాత్ర తిరిగి వెనక్కి చూడలేదనే చెప్పాలి.

అన్‌వెంచర్డ్ మూలాధారం

అది 2012 సంవత్సరం ముగిసే సమయం. గురుదీప్ తన చిన్ననాటి స్నేహితురాలు తేజస్విని గోపాల స్వామిని భూటాన్ యాత్రలో కలిసారు. 2013 ప్రారంభంలో అన్వెంచర్డ్ పై ఆలోచనను మరింత ముందుకు తీసుకురాగలిగారు. మూడేళ్లనుంచి అన్వెంచర్డ్ అనేది ఓ ఆలోచనగానే ఉన్నప్పటికీ అది ఓ లిమిటెడ్ కంపెనీగా మారి ఏడాది మాత్రమే అయింది. చరిత్ర, సాంస్క్రతిక నేపధ్యం ఉన్న ప్రాంతాలకు యాత్ర చేయడం అనేది తేజస్వీ మదిలో మెదిలిన ఆలోచన. ఇది జనంలోకి అన్వెంచర్డ్ తీసుకుపోవడానికి కలసొచ్చిన విషయం. స్వతహాగా సంగీతాన్ని ఇష్టపడే తేజస్వికి గిటార్ నేర్పించడమే ప్రొఫెషన్. అన్వెంచర్డ్‌కి ఆమె ఒక అరుదైన కానుకంటారు ఇతర సభ్యులు. ఎందుకంటే ప్రతి ప్రయాణంలో ప్రయాస తెలియకుండా ఆమె సంగీతంతో అందరినీ కట్టి పడేస్తుంది.

image


ప్రస్తుతానికి అన్వెంచర్డ్ ట్రావెల్ స్టార్టప్ ఆదాయ వనరులు మాత్రం సాహసయాత్రకు వచ్చేవారి టికెట్ డబ్బులే. అయితే ప్రతి టూర్ ను ఓ సరికొత్త అనుభవంగా మార్చడానికి నిర్వాహకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఈ టూర్లంటే సాహసీకుల్లో యమ క్రేజ్. అన్ వెంచర్డ్ వ్యాపారం సైతం మంచి లాభాల్లోనే సాగుతోంది. దీనికి ప్రారంభ పెట్టుబడి అంతా వ్యవహారిక ఖర్చులు, సైకిళ్లకు వాడే గేర్ సామగ్రి కొనుగోలు మాత్రమే.

స్థాపకులు

గురుదీప్ ఎంబియే మార్కెటింగ్ గ్రాడ్యుయేట్. పదేళ్లుగా టెక్నికల్, నాన్ టెక్నికల్ స్టార్టప్స్ కంపెనీ కో ఫండింగ్ టీముల్లో పనిచేశారు. తన కెరియర్ అంతా మార్కెటింగ్ పైనే ఫోకస్ చేయలేదు. ఇతర విషయాలను కూడా కూలంకుషంగా ఔపోసన పట్టాడు. ఈ క్రమంలోనే స్టార్టప్ వర్కింగ్ కల్చర్ పై పరిణతి సాధించారనే చెప్పాలి. ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, సేల్స్, కస్టమర్ సర్వీస్ లాంటి వాటిపైనే ప్రధానంగా స్టార్టప్‌లు పనిచేయాల్సి ఉంటుంది. వాటిపై గురుదీప్‌కు పూర్తి అవగాహన ఉంది. మై పరిచయ్ అనే సోషల్ రిక్రూట్‌మెంట్ అనేది తన చివరి కంపెనీ. గతంలో గురుదీప్ హోమ్ అనే కంపెనీని స్థాపించారు. దీంతో జనం నాడి తెలుసుకున్నారాయన. ఇప్పుడు అన్ వెంచర్డ్ ప్రారంభమై.. ఇలా దూసుకుపోతోందంటే.. అందుకు గురుదీప్ గత అనుభవాలే. 

అన్‌వెంచర్డ్ స్థాపకులు తేజస్విని,గురుదీప్ రామకృష్ణ

అన్‌వెంచర్డ్ స్థాపకులు తేజస్విని,గురుదీప్ రామకృష్ణ


తేజస్విని అడ్వర్టైసింగ్, మార్కెటింగ్,ఆర్ట్స్‌లో మాస్టర్ డిగ్రీ చదివారు. ఒక ఏజెన్సీలో కాపీ రైటర్‌గా పనిచేశారు. తేజస్వినికి ట్రావెలర్, రంగస్థల నటి, రచయిత, స్టోరీ టెల్లర్ లాంటి ఎన్నో కళల్లో ప్రావీణ్యం ఉంది. అన్వెంచర్డ్ యాత్రల్లో తారసపడిన వ్యక్తుల కథలను కూడా ఆమె సేకరిస్తూ ఉంటారు. రోడ్ పైన వెళ్లే కంటే సైకిల్ పై వెళ్తుంటే చారిత్రకనేపథ్యంతో పాటు ఇతర విషయాలను చక్కగా తెలుసుకోవచ్చనేది తేజస్విని అభిప్రాయం.

వెనుతిరిగి చూడని యాత్ర

మనాలి-లెహ్ మార్గంలో మొదటి సారి సైకిల్ యాత్ర ప్రారంభించిన వారికి ఊహించని స్పందన వచ్చింది. సాహస యాత్రికులకు గతంలో ఎవరూ చూపించని కొత్తదనాన్ని అన్వెంచర్డ్ చూపించింది. ఇందులో అతి ముఖ్యమైంది. బెంగళూరు సిటీ ట్రయల్స్. బెంగళూరిని చారిత్రాత్మక కోణంలో సైకిల్ యాత్రికులకు చూపించడం ఓ కొత్త ఆలోచన. సిటీలో ఉన్న కాలనీలను చుట్టేస్తూ సాగే సైకిల్ యాత్ర కొత్తవారికైతే కొత్త అనుభూతిని మిగిల్చిందన చెప్రాతు.. బెంగళూరును కలిపే విన్‌స్టన్ చర్చిలది ముమ్మాటికీ పర్ఫెక్ట్ ఔటింగ్ అని చెప్పొచ్చు. తర్వాతి వరుసలో ఉన్నది దేవాలయాల యాత్ర. నగరంలో ఉన్న 9వ శతాబ్దంనాటి పురాతన దేవాలయాలను చూపిస్తారు ఈ యాత్రలో. దీనిలో ఓ అద్భుత, దేవసంబంధ, రాచరికపు విషయాలను కొత్తగా చూపించడం కొత్త అనుభూతిని కలిగిస్తుంది. నమ్మ బెంగళూరు(మన బెంగుళూరు) అనిపించేలా బ్రేక్ ఫాస్ట్‌ను పాత క్వయింట్ జాయింట్స్ దగ్గర చేయడం ఈ యాత్రలో కొసమెరుపు. 

image


వారాంతపు యాత్రలో కూర్గ్,వయాంద్‌తోపాటూ ఊటీలున్నాయి. దూరప్రాంత యాత్ర చేయాలనుకునే సాహసికుల కోసం అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం తీసుకెళ్తారు. గోవా యాత్ర అయితే ఒక వారం పాటు చేయాల్సందే. అక్కడి కోలనీలు, చర్చిలతోపాటు కళలు కల్చర్ని తాకుతూ సాగుతుందీయాత్ర. ఇక్కడ ఎవరి అవసరాలను వారు యాత్రలను మలుచుకోవచ్చు. మే నెలలో మదర్స్ డే యాత్రను అన్ వెంచర్డ్ నిర్వహిస్తుంది. ఇందులో తల్లులు తమ పిల్లలతో పాటు సైకిల్ పై సవారి చేయొచ్చు. మనాలీ నుంచి లేహ్ , భూటాన్ ట్రిప్పుల్లో సైతం ఈ అవకాశం ఉంది.

image


రోజువారీ టూర్లు కచ్చితంగా ఆసక్తి కలిగించేవే. దేశంలో ఇతర ప్రాంతాల నుంచి బెంగళూరు వచ్చిన వారికి స్థానికంగా ఉన్న చరిత్ర తెలుస్తుంది. వారు కొత్త అనుభూతిని పొందుతారు. ముఖ్యంగా చాలా రకాల కమ్యునిటీలు ఇక్కడకి వచ్చి ఎలా సెటిలయ్యారు. బెంగుళూరును తమ సొంతూరుగా ఎలా మారిందనే విషయం తెలుస్తుందన్నారు తేజస్విని గోపాలస్వామి.