ఆరోగ్యం, రుచి కలగలిపితే 'గ్రీన్ స్నాక్స్'

ఆరోగ్యం, రుచి కలగలిపితే 'గ్రీన్ స్నాక్స్'

Tuesday September 29, 2015,

4 min Read

డైటింగ్ చేసే వారికి వున్న పెద్ద స‌మస్య ఒక్క‌టే. స్నాక్స్ విష‌యంలో ఆరోగ్యాన్ని ఎలా పాటించాలనేది ఒక ప‌ట్టాన అంతు ప‌ట్ట‌దు. భోజ‌నం విష‌యంలో ప‌క్కాగా టైమింగ్ పాటించినా, ఎక్స‌ర్‌సైజ్ ల విష‌యంలో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా వున్నా.. భోజ‌నానికీ, భోజ‌నానికీ మ‌ధ్య వ‌చ్చే ఆక‌లి పెద్ద స‌మస్య‌. బ‌రువుకు సంబంధించిన స‌మ‌స్య‌లతో ప‌దిహేనేళ్ళు స‌త‌మ‌త‌మైన జ‌స్మీన్ కౌర్.. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంగానే 'ది గ్రీన్ స్నాక్ కో' ను నెల‌కొల్పారు.

నిజానికి ఓ రుచిక‌ర‌మైన‌, క‌ర‌క‌ర‌లాడే, ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్ తినాల‌నే కోరిక జస్మీన్‌కు ఎక్కువ‌గానే వుండేది. అలాంటి స్నాక్ కోసం చేసిన అన్వేష‌ణే చివ‌రికి ది గ్రీన్ స్నాక్ కో గా రూపు దిద్దుకుంది. “ అస‌లు అలాంటి స్నాక్స్ మార్కెట్ లోనే లేవు ” అని తాను కంపెనీ పెట్ట‌డానికి దారి తీసిన ప‌రిస్థితుల‌ను వివ‌రించారు. జ‌స్మీన్. సొంతంగా కంపెనీ పెట్టాల‌నుకున్న‌ప్పుడు, త‌న ఉద్యోగానికి రాజీనామా చేసేసి, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో వున్న ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ పై అధ్య‌య‌నం చేసారు. చూసిన అన్నిటిలోనూ ఒక ఆకుకూర ప్ర‌త్యేకంగా క‌నిపించింది. అదే కాలె..

అందుకే ఈ కాలె ఆకును క‌ర‌క‌ర‌లాడేలా చేసే ఓ స్నాక్ త‌యారు చేయాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్నారు. అయితే, ఇలాంటి స్నాక్ మ‌న‌వాళ్ళ‌కు న‌చ్చుతుందా ? ఎందుకంటే మ‌నవాళ్ల అభిరుచులు వేరు. ఈ సందేహాల‌న్నీ జ‌స్మీన్‌కు కూడా వున్నాయి.

అయితే, ఆశ్చ‌ర్య‌క‌రంగా జ‌స్మీన్ త‌యారు చేసిన ఈ స్నాక్స్ జ‌నానికి పిచ్చి పిచ్చిగా న‌చ్చింది. నిజానికి ఇండియాలో చాలా మందికి ఈ కాలె ఆకు గురించి తెలుసు. అయితే, దీనితో ఎవ‌రైనా స్నాక్ త‌యారు చేసి అమ్మితే బావుండు అని ఎదురు చూసే వారూ ఉన్నారు. అమ్మ‌కాల‌ కంటే ముందు ఈ స్నాక్ ను ఊరికే రుచి చూడ్డానికి ఓ స్టాల్‌లో పెట్టిన‌ప్పుడే జ‌నంలో దీనికి వున్న ఆద‌ర‌ణ అర్థ‌మైపోయింది. ఒక‌సారి తిన్న వాళ్ళు మ‌ళ్ళీ రుచి చూడ‌డానికి వ‌చ్చే వాళ్ళు. అప్పుడే ఇదేదో గిట్టుబాట‌య్యే బిజినెసేన‌ని జ‌స్మిన్‌కి అర్థ‌మైపోయింది.

మూడు ర‌కాల కాలే చిప్స్‌తో గ్రీన్ స్నాక్ కో మొద‌లైంది. వీటిని ముంబై లోని కొన్ని స్టాల్స్ లో ప్ర‌ద‌ర్శ‌న‌కు పెట్టి అక్క‌డే అమ్మారు. దీంతో రిటైల‌ర్లు, ఫుడ్ స్టోర్స్ .. ఆన్ లైన్ ఫుడ్ సైట్లు, ఫుడ్ క్రిటిక్స్, బ్లాగ‌ర్స్ ఇలా అంద‌రి దృష్టినీ ఈ స్నాక్ ఆక‌ర్షించింది. మేం ఈ సంస్థ‌ను ప్రారంభించిన రెండు నెల‌ల్లోనే ఫుడ్ హాల్ నుంచి కాల్ వ‌చ్చింది. ఈ ప్రోడ‌క్ట్ ని త‌మ స్టోర్ లో పెట్ట‌మ‌ని. ఆహార‌ ప‌దార్ధాల విష‌యంలో ఫుడ్ హాల్ కు ఎంత పేరుందో వేరే చెప్ప‌క్క‌ర్లేదు. అప్పుడే అర్థ‌మైపోయింది.. ఈ బిజినెస్‌కి తిరుగులేద‌ని.. అంటారు జస్మిన్.

The Green Snack Co

The Green Snack Co


ఎలా చేస్తారు

ఆరోగ్యం, ఆహారం.. పోష‌క విలువ‌ల విష‌యం చాలా మందికి చాలా తెలుసు. అలాగే, గ్రీన్ స్నాక్ కో లో ప‌నిచేసే బృందానికి కూడా ర‌క‌ర‌కాల అభిప్రాయాలున్నాయి. అయితే, వాట‌న్నిటినీ ప‌క్క‌న పెట్టి.. కొత్త‌గా ఆలోచిస్తూ.. వినూత్నంగా విశ్లేషించి కొత్త‌గా సంస్థ‌ను నిర్మించాల‌నుకున్నారు. అందుకే , ఆరోగ్యానికి మేలు చేసే సూప‌ర్ ఫుడ్స్‌తో పోష‌క విలువ‌లు క‌లిగిన ఆరోగ్య క‌ర‌మైన‌, రుచిక‌ర‌మైన స్నాక్స్ అందించ‌డ‌మే గ్రీన్ స్నాక్ ల‌క్ష్యంగా పెట్టుకుంది. స‌హ‌జ‌ ప‌ద్ధ‌తుల్లో త‌యార‌యిన తాజా ప‌దార్థాల‌నే ఈ స్నాక్స్ త‌యారీలో వాడ‌తారు. అద‌న‌పు చ‌క్కెర‌, ప్రిజర్వేటివ్స్, అడ్డిటివ్స్, ఎంఎస్‌జి లాంటివేవీ అస‌లు ఉప‌యోగించ‌రు.

ఈ చిప్స్ త‌యారు చేయ‌డానికి వాడే ప‌రిక‌రాల‌ను అమెరికా నుంచి దిగుమ‌తి చేసుకున్నారు. పూర్తిగా అంత‌ర్జాతీయ స్థాయి నాణ్య‌త‌తో త‌యారుచేస్తారు. మొద‌ట్లో ఒక్క జస్మీన్ తోనే మొద‌లైన ఈ సంస్థ‌లో ఇప్పుడు ఐదుగురు ప‌నిచేస్తున్నారు. ఈ స్టార్ట‌ప్ పెట్ట‌డంలో త‌న భ‌ర్త మొద‌టి నుంచి అండ‌గా నిలిచార‌ని జ‌స్మిన్ చెబుతున్నారు. టీమ్ లో మిగిలిన వారికి స్టార్టప్స్ అనుభవం వుంది. తిరుగులేని అంకిత భావంతో ఎలాగైనా ఈ బ్రాండ్‌ను స‌క్సె స్ చేయాలని టీమ్ అంతా అహర్నిశ‌లూ కృషి చేస్తోంది.

స‌మ‌స్య‌లూ, స‌వాళ్ళు..

స‌వాళ్ళు దాట‌కుండా, ఏ స్టార్ట‌ప్ స‌క్సెస్ కాదు. గ్రీన్ స్నాక్ విష‌యానికొస్తే, స‌రైన సిబ్బందిని నియ‌మించుకోవ‌డ‌మే అతి పెద్ద స‌వాలైపోయింది. క‌స్ట‌మ‌ర్ల‌లో అవ‌గాహ‌న పెంచ‌డం, ఆరోగ్య‌క‌ర‌మైన తిండికి సంబంధించి వారిలో పేరుకుపోయిన న‌మ్మ‌కాల‌ను వ‌దిలించ‌డం మ‌రో పెద్ద ఛాలెంజ్. చాలా మంది క‌స్ట‌మ‌ర్లకు స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డ‌ం ఒక్కటే స‌మ‌స్య కాదు.

మార్కెట్ ఎలా వుంది..

కొద్ది నెల‌ల క్రితం ది గ్రీన్ స్నాక్ కో మార్కెట్ లోకి విడుద‌ల చేసిన కాలే చిప్స్ ప్ర‌స్తుతం ముంబై, పూణె, ఢిల్లీ న‌గ‌రాల్లోని 40 రిటైల్ షాప్స్ లో దొరుకుతున్నాయి. దీంతోపాటు, మ‌రో ప‌ది ఆహార ప‌ద‌ర్థాల వెబ్ సైట్ల‌లో కూడా అందుబాటులో వున్నాయి. కొన్ని కెఫేలు, రెస్టారెంట్ల‌తో కూడా టై అప్స్ వున్నాయి. మూడునెలల్లో అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి.

ఈరోజుల్లో క‌స్ట‌మ‌ర్ల‌కు ఫిట్నెస్ బాగా ముఖ్యం. ఇప్ప‌టికే మార్కెట్ లో యోగా బార్స్, వ్యాలెన్షియా డ్రింక్స్ లాంటి ఎన్నో హెల్త్ స్నాక్స్, హెల్త్ డ్రింక్స్ అందుబాటులో వున్నాయి. బిజినెస్ స్టాండ‌ర్డ్ రిపోర్ట్‌ని బ‌ట్టీ చూస్తే, హెల్త్ ఫుడ్ ఇండ‌స్ట్రీ కి 22,500 కోట్ల రూపాయ‌ల‌ మార్కెట్ వుంది. ఇది ఏడాదికి 20 శాతం పెరుగుతోంది. చికిత్స కంటే నివార‌ణే మంచిద‌నే భావన క‌స్ట‌మ‌ర్ల‌లో పెరుగుతోంది. అందుకే ఇలాంటి పోష‌కవిలువ‌లున్న హెల్త్ ఫుడ్ ఐట‌మ్స్‌కి మార్కెట్లో మ‌రింత ఆద‌ర‌ణ పెరుగుతుందని జస్మిన్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

జ‌స్మీన్ కౌర్

జ‌స్మీన్ కౌర్


ఈ హెల్తీ స్నాకింగ్ అనేది ఏదో కొంత మందికి సంబంధించిన వ్య‌వ‌హారంగా వుంటోంది. ఈ ధోర‌ణి మార్చి అంద‌రికీ అల‌వాటు చేయాల‌ని గ్రీన్ స్నాక్ కో ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగా,రుచిక‌ర‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన స్నాక్స్ మ‌రిన్నిటిని మార్కెట్ లోని తేవాల‌ని ఈ సంస్థ ప్ర‌య‌త్నిస్తోంది. దీంతో పాటు, భ‌విష్య‌త్తులో మెట్రో న‌గ‌రాల్లోని అన్ని మేజ‌ర్ ఫుడ్ రిటెయ‌ల‌ర్ల ద‌గ్గ‌రా త‌మ ఉత్ప‌త్తులు అందుబాటులో వుంచాల‌ని కూడా ఓ ప్ర‌య‌త్నం.

మ‌రింత మంది సిబ్బందితో బ‌ల‌మైన టీమ్ ని ఏర్ప‌రుచుకుని, స్నాక్ మార్కెట్ లో ఏ ఆరోగ్య‌క‌ర‌మైన విప్ల‌వం తేవాల‌న్న‌దే మా ల‌క్ష్యం అని చెప్తారు జ‌స్మిన్.