బార్బీకి భారతీయ రంగులద్దిన శైలజ

బిఇ ఎలక్ట్రానిక్స్ చేసి డిజైనర్ టాయ్స్‌ వైపు ప్రయాణం.. విజయవాడ అమ్మాయి శైలజ సక్సెస్ స్టోరీ..

బార్బీకి భారతీయ రంగులద్దిన శైలజ

Sunday April 19, 2015,

3 min Read


చిన్నప్పుడు బొమ్మలతో ఇళ్లు, ఇసుక గూళ్లు... ఇవన్నీ చిన్ననాటి గుర్తులు... బొమ్మలు పిల్లల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటినే ఆధారంగా చేసుకున్న శైలజ కియా ఇండియన్ డాల్ కు శ్రీకారం చుట్టారు. బొమ్మలతో భారత వారసత్వాన్ని పరిచయం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆమె ఏకైక ఆలోచన ...ప్రేరణలే పారిశ్రామికవేత్తగా ఎదగడానికి కారణమయ్యాయి.

ఈ అమ్మాయి పేరు తీర్ధాల హిమ శైలజ.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పుట్టింది. ప్రైమరీ ఎడ్యకేషన్ అక్కడే పూర్తి చేసిన శైలజ తర్వాత ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ డిప్లొమా పూర్తి చేశారు. ముంబై యూనివర్శిటీ పరిధిలోని LTCE కాలేజ్ నుంచి ఎలక్ట్రానిక్స్ బిఇ పూర్తి చేశారు. 1998 నుండి, ఆమె వివిధ కార్పొరేట్ కంపెనీల్లో VLSI డిజైన్ ఇంజనీర్‌గా పని చేసిన అనుభవం ఉంది. తర్వాత మరో తొమ్మిది సంవత్సరాలు అమెరికా, యూకే, మరియు సిలికాన్ వ్యాలీలో డిజైన్ ఇంజనీర్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు.

తీర్ధాల హిమ శైలజ

తీర్ధాల హిమ శైలజ


డిజైనింగ్ లో ఉన్న అనుభవంతో 2003 సంవత్సరంలో శైలజ దుబాయ్ ఎయిర్ పోర్ట్‌లో బార్బీ డ్రెస్ పోటీల్లో పాల్గొన్నారు. అంతే అప్పటి వరకు ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఉన్న బార్బీ ఒక్కసారిగా ఇండియన్ ట్రెడిషన్ డ్రెస్సులో మారిపోయింది. ఈ మార్పుతో శైలజ లైఫ్ స్టయిల్ మారిపోయింది. వివిధ కంపెనీల్లో పని చేసిన అనుభవం..ఆమెను ఓ పారిశ్రామికవేత్తగా మార్చేసింది. అప్పటి వరకు విదేశాలకు చెందిన సారా, బార్బీ, పుల్లిప్, పుల్లా లాంటి బొమ్మలకు ధీటుగా భారతీయతకు దర్పణం పట్టే కియా డాల్స్‌ ఆవిర్భవించడానికి కారణమైయింది.

2009 లో శైలజ కుటుంబం అమెరికా నుండి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి కొడుకుతో కలిసి హ్యామ్స్‌టెక్ ఫ్యాషన్‌లో కొత్త డిజైన్లకు రూపకల్పన చేశారు. అయితే తనకు వ్యాపార అనుభవం లేదని గ్రహించిన శైలజ తిరిగి ఏడాదిన్నర పాటు ఐటీ రంగంలో పనిచేశారు. తర్వాత 2012 లో షెల్ స్టూడియోతో పాటు కియా బొమ్మల ప్రాజెక్ట్ పని ప్రారంభించారు. పిల్లలుకు, మహిళల దుస్తులు కోసం ఫ్యాషన్ బోటిక్ ప్రారంభించారు.

image


కియా ప్రాజెక్టును పరిశీలించిన ఐఎస్‌బి బృందం హైద్రాబాద్‌లో WEDP కోర్సులో చేరేందుకు శైలజకు అవకాశం ఇచ్చారు. ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండి... మహిళా పారిశ్రామికవేత్తలకు గోల్డ్ మ్యాన్ సాక్స్ స్పాన్సర్ చేసింది. డిసెంబర్ 2014 లో, కియా బోమ్మల ప్రాజెక్టును విజయవంతంగా ప్రారంభించారు. ఇప్పుడు కియా డాల్స్ ఈ-కామర్స్ సైట్లతో పాటు కంపెనీ అధికారిక వెబ్ సైట్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కియా బొమ్మల ద్వారా శైలజ .. భారతీయ మహిళలు, యువతులు సంస్కృతి, సంప్రాదాయాలు ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు. బొమ్మలతో చేసిన ఈ ప్రయత్నం భారతీయతను ఉట్టిపడేలా చేసింది. ఈ బొమ్మలు తయారు చేయడం వెనుక భారతీయతను ప్రపంచానికి చాటి చెప్పడం...భవిష్యత్తు తరానికి చెప్పాలన్నది తన ఉద్దేశ్యమంటారు శైలజ. బొమ్మల ద్వారా భారతీయతను కాపాడడమే లక్ష్యమంటారు. భారతీయతను కాపాడుకుంటూ భవిష్యత్తులో గ్లోబల్ స్థాయికి ఎదగాలనేది ఆమె ఆశ. దీని వల్ల పిల్లలకు సరైన సంస్కృతిపై పూర్తి అవగాహన వస్తుందని ఆమె అభిప్రాయం.

వివిధ రూపాల్లో భారతీయ సంప్రదాయాలకు దర్పణం పట్టేలా తీర్చిదిద్దిన ఈ బొమ్మలు మహిళల గుర్తింపుకు దోహదపడుతున్నాయి. కియా డాల్స్ భారతీయ మూలాల్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఉంటాయంటారు హిమ. తగిన అనుభవం, అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెబుతున్న శైలజ పిల్లలకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే మనో నిబ్బరం ఇవ్వాలన్నారు. 

image


''పెళ్లైన తర్వాత వారి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయని చెబుతారు. ప్రపంచంలో ఎక్కడైనా ఎదురొడ్డి నిలబడే శక్తి వస్తుంది. దీని వల్ల స్వయంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. జీవితంలో తమ లక్ష్యాలను నిర్దేశించుకోగలుగుతారు. ఓ కుటుంబంలో మహిళలు ఆర్ధికంగా నిలదొక్కుకుంటే ఆ కుటుంబం అభివృధ్ది చెందుతుంది. సమాజంపై కూడా ప్రభావం ఉంటుంది. ఆర్ధికంగా బలంగా ఉంటే అమ్మాయిలు నిస్సంకోచంగా దేన్నైనా ఎదుర్కొనే ధైర్యం ఉంటుంది''. 

ప్రతి పనిలోనూ... మంచి నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఝాన్సీ రాణి లక్ష్మిబాయి వంటి ఆసక్తికరమైన చారిత్రక వ్యక్తులలో సహా భారతీయతను చాటి చెప్పే రూపాల్లో బొమ్మలను తయారు చేశారు. మనకథలు,పురాణాలు, ఇతిహాసాలు....సంప్రదాయాలకు అనుగుణంగా కియా రూపుందుతోంది. బొమ్మలను మార్కెటింగ్ చేయడానికి రకరకాల వర్క్ షాపులు నిర్వహించి... కధలు ప్రచురించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. శైలజా కియా బొమ్మల తయారీలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బొమ్మల తయారీలో ఏ అనుభవం లేకపోవడంతో పాటు.. దిగుమతి మరియు వ్యాపార నిర్వహణలో సమస్యలు వచ్చాయి. వాటిని సవాలుగా తీసుకున్నారు. బొమ్మలు దిగుమతి చేస్తున్న సమయంలో ఏజెంట్లు సమస్యలు వచ్చాయి. ప్రతికూలత నుంచే అనుభవ పాఠం నేర్చుకన్న హిమ తర్వాత పారిశ్రామిక వేత్తగా స్థిరపడ్డారు. మహిళగా శైలజ ఎన్నొ సవాళ్లను ఎదుర్కొన్నారు. అటువంటి వాటిని ధైర్యంగా తట్టుకొని నిలబడ్డారు. అటువంటి వ్యక్తులను దూరం చేసి.. మొళుకువులు నేర్చుకున్నారు. మహిళలకు వ్యాపారం గురించి ఏమి తెలియదనే భావన నుంచి బయటకు వచ్చి... అవకాశాలు కల్పించుకున్నారు. మరికొంత మంది సలహాలు ఇచ్చినా... ఆమెకు నచ్చిన సూచనలు స్వీకరించి వ్యాపారంలో నిలదొక్కుకున్నారు. అమెరికాలో అయితే కొత్త రంగంలో రాణిస్తున్న వారికి ప్రచారం ఎక్కువగా ఉంటుంది. 

"అమెరికన్లు చాలా ప్రొఫెషనల్ పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. వాటి వల్ల మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుస్తాయి. నాప్ కిన్స్ నుంచి బిల్ బోర్డుల వరకు ఎలా, మార్కెటింగ్ చేయాలనే అనే దానిపై అవగాహన ఉంటుంది. అక్కడ నేర్చుకున్న అనుభవంతో శైలజ సొంత బ్రాండింగ్ పెంచుకోనేందుకు అవకాశం దక్కింది. చాలా మంది కియా ప్రారంభించటానికి దమ్ము కావాలంటూ అనుమానించిన వారు చాలా ఉన్నారు. వాటన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. కోరిక లేదా కోరిక కృషితో పాటు నిజాయితీ ఉంటే చివరికి గోల్ చేరుకోవడం కష్టం కాదు అంటారు హిమ శైలజ. మంచి పనికి దేవుడు సహాయం చేస్తారని చెప్తారు నమ్మకం, ఓపికతో ఏ పనైనా సాధించవచ్చని శైలజ తన అనుభవాన్ని పంచుకున్నారు.

బొమ్మల ద్వారా భారతీయతను ప్రతిబింబించేటట్లు చేయాలనే కొత్త ఆలోచనకు నేనీ స్థాయిలో ఉండటానికి కారణం అంటారు శైలజ