మనం వేసే డ్రస్సే.. మన అసలైన అడ్రస్!!

మనం వేసే డ్రస్సే.. మన అసలైన అడ్రస్!!

Thursday February 04, 2016,

2 min Read

అప్పుడప్పుడు అంటుంటాం! కవర్ పేజీ చూసి పుస్తకాన్ని అంచనా వేయొద్దని! నిజమే. పుస్తకం అట్ట..హాసం చూసి ఫ్లాటై కొంటాం. తీరా చదివాక అదొక తలతిక్క బుక్ అని తెలుసుకుంటాం. ఒక్కోసారి కవర్ పేజీ అందంగా ఉండకపోవచ్చు. కానీ లోపల మనకు పనికొచ్చే విషయాలు ఎన్నో వుండొచ్చు.

అయితే మనుషుల విషయంలో మాత్రం ఆ సూత్రం అన్నివేళలా పనికిరాదు. మన డ్రస్సే మన అడ్రస్సు. నలుగురు మనవైపు చూడాలన్నా- పదిమంది మనతో మాట్లాడాలన్నా- మనం వేసుకునే బట్టలే డిసైడింగ్ ఫాక్టర్‌గా పనిచేస్తాయి. పర్సనల్‌గా అయినా ప్రొఫెషనల్‌గా అయినా- వేసుకునే బట్టలే మెయిన్ రోల్ పోషిస్తాయనడంలో సందేహం లేదు. మాటొక్కటే చాలదు. అప్పియరెన్స్ కూడా ప్రొఫెషనల్‌గా ఇంపార్టెంటే.

image


మంచి డ్రస్ గురించి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు- కేవలం ప్రొఫెషనల్ సందర్భం ఒక్కటే చూడొద్దు. పర్సనల్ గా కూడా చూడాలి. అవతలివాళ్లు మనల్ని ఎప్పుడు చూసినా ఫీల్ గుడ్ లుకింగ్ ఇంప్రెషన్ రావాలి. ఎదుటివాళ్లలో అలాంటి అభిప్రాయం కలిగినప్పుడే- ఇంటరాక్షనూ ఈక్వేషనూ రెండూ వర్కవుట్ అవుతాయి.

అదిరేటి డ్రస్సు మీరేస్తే..

సింప్లిసిటీ అనేది ఒక ఆర్టు. ఒకరకమైన ఇంటెలెక్చువల్ సింబాలిక్. అయితే అందరివల్లా కాదు. అది పక్కన పెడితే- కొందరి డ్రస్సింగ్ ఉంటుందీ.. అదే పాత స్టయిల్. అదే పాత టేస్ట్‌. అప్‌డేట్ అవరు. కార్పొరేట్ సెక్టార్లలో ఇలాంటి డ్రస్సింగ్ పెద్ద మైనస్ పాయింట్. మన బట్టలు చూసి అవతలివారికి జ్వరం రావొద్దు. డ్రస్సులో ఒకరకమైన మాగ్నటిక్ పవర్‌ ఉండాలి. చూపులు నిలిచిపోవాలి. మాట కలపాలని తాపత్రయ పడాలి. గట్టి షేక్ హాండ్‌లో ఎంత కాన్ఫిడెన్స్ ట్రాన్స్‌ ఫర్‌ అవుతుందో- వెల్ ఫిటెడ్ కంఫర్ట్‌ డ్రస్‌లో కూడా అంతే ఆత్మవిశ్వాసం బిల్డప్ అవుతుంది. మనలో మనకే తెలియని కొత్త ఉత్సాహం నరాల్లో ప్రవహిస్తుంది. సబ్టెక్టులోకి ఈజీగా సింక్ అవుతాం. మనుషులతో అవలీలగా కనెక్టవుతాం. డ్రస్సింగ్ సెన్స్ అనేది కెరీర్‌లో ఇంపార్టెంట్ స్టఫ్‌.

ఔనా నిజమా..!

నమ్మరుగానీ, ఇటీవల ఓ రీసెర్చిలో తేలిన విషయం ఏంటంటే- కార్పొరేట్ సెక్టార్‌లో 65 శాతం మంది మహిళలు తమ డ్రస్సింగ్ ఎలా వుందనే విషయాన్ని సబార్డినేట్స్ పెద్దగా పట్టించుకోరట. ఆశర్చంగా ఉందికదూ! అయితే, ఈ సినారియోని రాత్రికి రాత్రే మార్చడం కష్టం. కానీ మార్పు మొదలు కావడమన్నది శుభపరిణామం.

మనం వేసుకునే డ్రస్ మనమేంటో చెప్తుంది

మనం వేసుకునే డ్రస్ మనల్ని ప్రజెంట్ చేస్తుంది. అదొక్కటే కాదు. బిహేవియర్‌, బాడీలాంగ్వేజ్‌ అన్నీ అవతలివారికి ఇట్టే అర్ధమైపోతాయి. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆటోమేటిగ్గా అప్రోచ్‌ పెరుగుతుంది. చాలారకాల స్టడీల్లో తేలిన విషయం ఇదే. ఒక మంచి ఫార్మల్ వేసుకున్న ఉద్యోగి సెల్ఫ్‌ పర్సెప్షన్ ఆఫీస్ మొత్తం అట్రాక్ట్ చేస్తుంది. ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎదుటివారికి వారు ఇచ్చే ఆదేశాలు, మాటలు నచ్చుతాయి.

ఈ స్టోరీని కూడా చదవండి

ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్

ప్రపంచం వేగంగా పరుగులు పెడుతోంది! ఇంకా మనం క్రీస్తుపూర్వంలోనే ఉంటే కష్టం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార్యం, వాచకం, ఆంగికం మారాలి. అవతలివారిని ఆకట్టుకోవాలంటే మాటకారితనంతో పాటు, కట్టూబొట్టూ కూడా ఆకర్షణీయంగా ఉండాలి. నలుగురిలో నారాయణలా ఉండకుండా- లిప్తపాటు కాలంలోనే మనల్ని సమ్ థింగ్ స్పెషల్ గా గుర్తించాలి. అల్టిమేట్‌గా ఫస్ట్‌ ఇంప్రెషనే బెస్ట్ ఇంప్రెషన్‌.

సో, లేడీస్ లుక్ గుడ్‌.. ఫీల్ గుడ్‌. మీకంటూ ఒక స్టయిల్ క్రియేట్ చేసుకోండి. ప్రొఫెషనల్‌గానూ ఇటు పర్సనల్‌గానూ మంచిది.

రచయిత గురించి

నందిని అగర్వాల్. KAARYAH లైఫ్ స్టయిల్ సొల్యూషన్స్ ప్రై.లిమిటెడ్ ఫౌండర్‌ కమ్ సీఈవో. స్ట్రాటజీ కన్సల్టింగ్ అండ్ ఆడిటింగ్‌లో పదిహేనేళ్ల అనుభవం ఉంది. హానివెల్ ఇండియాలో స్ట్రాటజీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. బైన్‌ అండ్ కో లో స్ట్రాటజీ కన్సల్టంట్‌గా కొన్నాళ్లు వర్క్‌ చేశారు. ఎఫ్‌ఎమ్‌జీసీ కంపెనీస్‌, కేపీఎంజీ, భారతీ ఎయిర్ టెల్‌లో కూడా పనిచేసిన అనుభవం ఉంది.

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి

ఈ స్టోరీని కూడా చదవండి