కలలను సాకారం చేసుకోవాలా.. ఐతే గోల్స్ మంత్రను స్ఫూర్తిగా తీసుకోండి..

కలలను సాకారం చేసుకోవాలా.. ఐతే గోల్స్ మంత్రను స్ఫూర్తిగా తీసుకోండి..

Tuesday March 22, 2016,

3 min Read


ప్రతి ఒక్కరికీ కలలుంటాయి. ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. కొందరు సాధిస్తారు.. మరొకొందరు విఫలమవుతుంటారు. ఇద్దరికీ ఒకరకమైన తెలివి తేటలున్నప్పటికీ, ఒకరు సాధించడానికి, మరొకరు విఫలమవడానికి కారణం కార్యాచరణ. కొందరు తమ కలలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. తాము సాధించాలనుకున్నదాన్ని పేపర్‌పై పెట్టి ప్రతి రోజు గుర్తు చేసుకుంటుంటారు. మరికొందరు తమ మదిలోనే లక్ష్యాలను పెట్టుకుని మర్చిపోతుంటారు. అలాంటి వారి కోసం బెంగళూరుకు చెందిన గివింగ్ ట్రీ నిర్వాహకులు వినూత్నమైన బహుమతిని రూపొందించారు. ‘గోల్స్ మంత్ర’ పేరిట 420 పేజీల పుస్తకాన్ని రూపొందించి నిద్రాణంగా ఉన్న కలలను గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ హ్యాంపర్లను రూపొందిస్తూ పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ది గీవింగ్ ట్రీ వ్యవస్థాపకులు మాలా సత్యనారాయణన్, లీనా మునోత్. 

లీనా మునోత్

లీనా మునోత్


బెంగళూరు డొమ్లూర్ లో ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఉంది. ఆర్డర్‌ చేసిన వారికి ఈ సంస్థ ఎకో ఫ్రెండ్లీ బహుతులను హ్యాండ్‌మేడ్ పేపర్లతో తయారు చేసి ఇస్తోంది. కార్పొరేట్ కంపెనీలకు హ్యాండీక్రాఫ్ట్ బహుమతులను కూడా అందజేస్తోంది. భారతీయ సంప్రదాయ కళలైన వార్లీ, మధుబని, కలంకారీ వంటి డిజైన్లతో పాటు ‘బ్లాక్ ప్రింట్’ గిఫ్ట్‌లను కూడా అందిస్తుంది.

భారతీయ సౌందర్యానికి ప్రతీకగా ఉండటం మాల, లీనాలకు ఎంతో ఇష్టం. అదికూడా పర్యావరణ అనుకూలంగా. ఇదే సంస్థను ఏర్పాటు చేసేందుకు పురికొల్పింది. ఇంక్ స్కెచెస్, వాటర్ కలర్ ఇమేజెస్‌కు ‘గివింగ్ ట్రీ’ కేరాఫ్‌గా మార్చేసింది.

గత 15 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న లీనా, మాలా- ప్రజలు వినూత్నమైన ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్‌లతో శాటిసిఫై అయ్యేలా చేస్తున్నారు. ఇటీవలే వీరి వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. గోల్స్ మంత్ర పేరుతో ఓ వినూత్న బహుమతికి శ్రీకారం చుట్టారు.

image


గోల్స్ మంత్ర..

‘గోల్స్ మంత్ర’ పేరుతో ఓ గిఫ్ట్‌ను వీరు రూపొందించారు. ఇదో గోల్ అచీవ్‌మెంట్ కిట్. ప్రజలు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, తమ జీవిత గమ్యాలను సాధించి, సెలబ్రేట్ చేసుకునేలా ఈ గిఫ్ట్‌ను రూపొందించారు. హార్వర్డ్ యూనివర్సిటీ సర్వే ప్రకారం ప్రపంచంలోని ప్రజలలో కేవలం 13% మంది మాత్రమే తమ లక్ష్యాలను కాగితంపై పెడతారు. మిగతావారందరికీ గోల్స్ ఉన్నప్పటికీ వాటిని వ్యక్తీకరించరు. అలాంటివారి కోసమే గివింగ్ ట్రీ నిర్వాహకులు గోల్స్ మంత్రను రూపొందించారు.

గోల్స్ మంత్ర మొత్తం 420 పేజీల టెంప్లెట్ జర్నల్. యూజర్ల జీవిత లక్ష్యాన్ని 52 వారాలపాటు నిర్దేశిచుకునేలా డెయిలీ, వీక్లీ ప్లానర్‌ను పొందుపరిచారు. అలాగే ప్రతి రోజు సాధించిన విజయాలను రాసుకునేందుకు కూడా వీలు కల్పించారు. ఇందులో విజన్ కార్డ్స్, వ్యాలెట్ కార్డ్స్, థాంక్యూ కార్డ్స్‌ ఉంటాయి. గోల్స్ మంత్రకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. గోల్ సెట్టింగ్ వర్క్ షాప్స్ గురించి వివరించాలంటూ లీనాకు ఎన్నో యూనివర్సిటీలు, కార్పొరేట్ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి.

image


వర్క్ కల్చర్ అండ్ వర్క్ స్టయిల్..

మాలా, లీనా ఇద్దరి పని విధానం చేతితో కూడిన అద్భుత నైపుణ్యమే. ఐదుగురు శిక్షణ పొందిన బృందం నోట్ బుక్స్, డైరీలు, క్యాలెండర్లు, జర్నల్స్, బ్యాగ్స్, గిఫ్ట్ హ్యాంపర్స్‌ వంటి మాస్టర్ పీస్‌లు రూపొందించేందుకు వీరికి సాయపడుతుంది.

గీవింగ్ ట్రీ 2002లో ప్రారంభమైంది. పదివేల మంది మహిళలతో పోటీపడి 2010లో ఐఎస్ బీ బెస్ట్ బిజినెస్ ప్లాన్ అవార్డ్ గెలుచుకుంది. ప్రపంచ అత్యంత పెద్దదైన రిఫరల్ ఆర్గనైజేషన్‌లో గత ఎనిమిదేళ్లుగా మాలా, లీనా క్రియాశీలక సభ్యులుగా ఉన్నారు.

image


గివింగ్ ట్రీ రూపొందించే ప్రాడక్ట్స్‌ లాంటివి మార్కెట్‌లో కూడా లభ్యమవుతున్నాయి. అవన్నీ కూడా తక్కువ ధరకు లభించే నాసిరకమైనవి. అందువల్లే తాము రిటైల్ మార్కెట్‌కు దూరంగా ఉంటున్నామని లీనా, మాలా చెప్తున్నారు. తమది విభిన్నమైన నైపుణ్యంతో కూడిన వృత్తి కావడంతో ధర కాస్త ఎక్కువే ఉంటుందని, అందువల్లే రీటైల్ మార్కెట్లో తమ ప్రాడక్ట్స్‌కు ధర కాస్త ఎక్కువేనని వారు వివరించారు. పెద్ద మొత్తంలో పర్యావరణ ప్రచారం నిర్వహిస్తూ కార్పొరేట్ కంపెనీలను తమ క్లయింట్లుగా చేసుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు.

పెద్ద స్థాయిలో కార్పొరేట్ కంపెనీలకు గిప్ట్‌లను అందజేస్తున్నప్పటికీ గివింగ్ ట్రీ సంస్థలో ఎలాంటి అవకతవకలు ఉండవు. మాలా, లీనా లేకపోయినా సంస్థ ఉద్యోగులు ఎవరిపని వారు చేసుకుంటూ ఉంటారు. ప్రొడక్షన్ ప్రాసెస్, ఆర్డర్స్, క్వాలిటీ కంట్రోల్ ఇలా అన్ని విభాగాలను వారు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. అకౌంటింగ్ డివిజన్ కూడా చాలా పటిష్ఠంగా ఉంటుంది. దీంతో ఎలాంటి అవకతవకలకు చోటు లేదు సంస్థలో. వర్కర్స్ అంతా ఎవరి పని వారు చేసుకుని పోతుంటారు.

image


ఎకో ఫ్రెండ్లీ హ్యాండ్ పేపర్ ప్రాడక్ట్స్ రూపొందించే కంపెనీలు మార్కెట్‌లో చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని ఉన్నప్పటికీ, అవి రూపొందించే గిఫ్ట్ హ్యాంపర్లకు, గివింగ్ ట్రీ గిఫ్ట్ హ్యాంపర్లకు ఎంతో తేడా ఉంటుంది.

ఫ్యూచర్ ప్లాన్..

ఇప్పటికైతే క్లయింట్ల ఆర్డర్ల ప్రకారమే ఉత్పత్తులను రూపొందిస్తున్నప్పటికీ భవిష్యత్ లో ఓ బ్రాండ్‌గా ఎదగాలన్నది వీరి ఆకాంక్ష. ‘‘పర్యావరణ అనుకూల, వినూత్న బహుమతులకు ఓ బ్రాండ్‌గా ఎదగాలన్నదే మా లక్ష్యం. వచ్చే రెండేళ్లలో ఐదు వేల కంపెనీలను మా క్లయింట్లుగా మార్చుకోవాలనుకుంటున్నాం’’ అని మాల, లీనా పేర్కొన్నారు.

image