మధుమేహం ఇక బాధించదు!! ఎందుకంటే.....

0

పూర్తిగా మేకిన్ ఇండియా కాన్సెప్ట్ తో ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేసి విడుదలైన బిజిఆర్ 34 అనే మెడిసిన్ ఇప్పుడు డయాబెటిక్ సెక్టార్ లో సరికొత్త చరిత్ర లిఖించబోతోంది . ఆయుర్వేదంలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉన్న సీఎస్ఐఆర్ ఈ ప్రాడక్టును తయారు చేసింది.

రూ.5 కే ట్యాబ్లెట్

కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) మార్కెట్ లో అందుబాటులోకి తెచ్చిన ఈ ట్యాబ్లెట్ ధర 5 రూపాయిలే. దీన్ని బీజీఆర్ 34 గా వ్యవహరిస్తారు.

“ఇది దేశంలోనే మొదటి యాంటీ డయాబేటిక్ ఆయుర్వేదిక్ డ్రగ్,” కెకె శర్మ

ఏఐఎమ్ఐఎల్ ఎండీ అయిన కేకే శర్మ ఈ మాత్రలను మార్కెట్ లో విడుదల చేశారు. బీజీఆర్ అంటే బ్లడ్ గ్లూకోజ్ రెగ్యులేటర్ అని.. దేశంలోని ఆరోగ్య విప్లవంలో తాము భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని శర్మఅన్నారు. ఆయుర్వేదానికి చాలా పొటెన్షియల్ ఉందనేది ఆయన అభిప్రాయం. జనానికి చవకైన మాత్రలను అందించడం ఆయుర్వేదం వల్లనే సాధ్యపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ సంస్థ ముప్పై ఏళ్లకు పైగా ఈ రంగంలో సేవలందిస్తుందన్నారు. ఇప్పుడు ఈ బీజీఆర్ ని ఐదు రూపాయిలకు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

ఆయుర్వేదం అంటే పంచమవేదమే!

సాంప్రదాయ వైద్యానికి దూరం కావడంతో సరికొత్త వైద్య సమస్యలకు భారతీయులు దగ్గరవుతున్నారని కేకే శర్మ అంటన్నారు.

“ఏఐఎమ్ఐఎల్ ముప్పై ఏళ్లు పూర్తి చేసుకుంది,” కెకెశర్మ

హిమాచల్ ప్రదేశ్ లో తయారీ కేంద్రం ఉందని.. ఇక్కడ ఉత్పత్తి ప్రారంభించి దాదాపు ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్నామని అంటున్నారు. ఆయుర్వేదం మన దేశానికి మరో వేదం లాంటిదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయుర్వేదంలో అన్ని రకాల రుగ్మతలకు మందులు దొరుకుతాయన్నారు. పాశ్చాత్య మందులతో సైడ్ ఎఫెక్ట్ ఉండటాన్ని మనం గుర్తించొచ్చు. కానీ ఆయుర్వేదంలో అలాంటి వాటికి ఆస్కారం లేదన్నారాయన. ఆయుర్వేదాన్ని మన భవిష్యత్ తరాలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందిపై ఉందన్నారు. అంత్యంత చవకైన మందులు ఆయుర్వేదంలోనే లభిస్తాయన్నారు. వాటి ప్రభావం ఇంగ్లీష్ మందులకంటే ఎక్కువగా ఉంటాయన్నారు.

డయాబెటిక్ ఫ్రీ కంట్రీ చేయాలనేదే లక్ష్యం

దేశంలో డయాబెటిక్ బారిన పడుతున్న వారి సంఖ్య ఏడాదికి 11.7 కోట్లుంది. రోజు రోజుకీ ఇది పెరుగుతుంది తప్పితే.. తగ్గడం లేదు. దీంతో పాటు కిడ్నీ సమస్యలుంటున్నాయి.

“డయాబెటిక్ తో బాధపడే ప్రతిఒక్కరీకి మా మందులను చేరవేయాడమే మా ముందున్న లక్ష్యం,” కెకె శర్మ

డయాబెటిక్ సమస్యకు షుగర్ మానేయడమే పరిష్కారం కాదు. దేశంలో షుగర్ బాధితులకు ట్రీట్మెంట్.. ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారుతోంది. దీన్ని తమ మందు బిజిఆర్ 34 తగ్గిస్తుందని ఆశిస్తున్నానని అంటున్నారాయన. ఆయుర్వేదం పై అవేర్ నెస్ తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారాయన. జనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యంగా ఉన్నట్లు. దీనికి ఆయుర్వేదమే సరైన పరిష్కారమన్నారాయన . తము విడుదల చేసిన ఈ ట్యాబ్లెట్స్ తో డయాబెటిక్ ఫ్రీ కంట్రీ సాధ్యపడేలా ప్రయత్నిస్తామన్నారు.

భవిష్యత్ ప్రణాలికలు

అత్యంత తక్కువ ధర గల తమ బిజిఆర్34 ని దేశం మొత్తం తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యం అన్నారు. తమ దగ్గర డయాబేటిక్ తోపాటు కిడ్నీ సంబంధ వ్యాధికి, ఇంకా ఎన్నో రుగ్మతలకు మందులున్నాయని అన్నారాయన. వీటిపై తమ సంస్థ నిరంతరాయంగా రీసెర్చి చేస్తుందని, భవిష్యత్ లో మరిన్ని మందులను జనం ముందుకు తీసుకొస్తామన్నారు. హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో ఉన్న తమ తయారీ కేంద్రాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. తమ సంస్థలో 1348 మంది ఉద్యోగులున్నారని, వారి సంఖ్య పెంచుతామన్నారు. పరోక్షంగా వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. దాదాపు 500 హెర్బల్ ప్రాడక్టులను అందుబాటులోకి తీసుకొచ్చామని.. మరిన్ని ప్రాడక్టులను జనం ముందకు తెస్తామన్నారు.

“ఎన్నేళ్లు జీవించామనేది ముఖ్యం కాదు, జీవితంలో ఎన్నేళ్లు ఆరోగ్యంగా జీవించామనేది ముఖ్యమని ముగిచారు శర్మ”
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik