మహిళా ఆంట్రప్రెన్యూర్లు సవాళ్లను అధిగమించేదెలా..?!

మహిళా ఆంట్రప్రెన్యూర్లు సవాళ్లను అధిగమించేదెలా..?!

Friday April 22, 2016,

2 min Read


అమెరికా స్టేట్ డిపార్ట్ మెంటుకు చెందిన నిషా బిస్వాల్ హైదరాబాదులో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇక్కడున్న వాతావరణం, భౌగోళిక పరిస్థితులతో పాటు ఆంట్రప్రెన్యూర్షిప్ అంశాలు మెచ్చి పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయంపై ఐటీ మంత్రి కేటీఆర్ ని కూడా కలిశారు. టీ హబ్ వేదికగా విమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వివిధ స్టార్టప్ ఫౌండర్లు, కో ఫౌండర్లు, ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు ఇందులో పాల్గొన్నారు. ముఖ్యంగా ఆంట్రప్రెన్యూర్షిప్ లో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ప్రధానంగా చర్చించారు. 

image


విమెన్ ఆంట్రప్రెన్యూర్ పై జరిగే చాలా కార్యక్రమాల్లో టీ హబ్ భాగస్వామిగా ఉందని సీఓఓ శ్రీనివాస్ కొల్లిపర అన్నారు. మహిళా ఆంట్రప్రెన్యూర్షిప్ కు టీ హబ్ కట్టుబడి ఉందన్నారాయన. ప్రత్యేకంగా వారికోసం కార్యక్రమాలు చేపట్టకపోయినా, టీ హబ్ లో అందరికీ సమాన హక్కులు ఇచ్చామని చెప్పుకొచ్చారు.

సాధారణంగా అమ్మాయిలకు 25 ఏళ్లు రాగానే ఇంట్లో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెడతారు. అయితే ఈతరం అమ్మాయిలు అంత ఈజీగా పెళ్లికి ఒప్పుకోవడం లేదు. కెరీర్ ఒక మలుపు తిరిగాక గానీ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఇదే అభిప్రాయాన్ని తెలిపారు మోక్షీస్ స్టార్టప్ ఫౌండర్ విశాలి. తను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న అనుభవాలను వివరించే ప్రయత్నం చేశారు. పెళ్లి చేసుకుని సెటిల్ అవొచ్చుగా అని చాలామంది సలహా ఇచ్చారని అన్నారామె. ఇలా ప్రతి విషయానికి పెళ్లితో లింక్ చేస్తారని విశాలి చెప్పుకొచ్చారు. మహిళల కోసం ప్రత్యేకంగా ఇన్వెస్టర్స్, మెంటార్స్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తే కచ్చితంగా మహిళలు వ్యాపారం రాణిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు.

image


అయితే శానిటరీ స్టార్టప్ ను విజయవంతంగా నడిపిస్తున్న నమిత మాత్రం.. తన కెరీర్ పెళ్లి తర్వాతే మొదలైందని చెప్పారు. మద్దతిచ్చే లైఫ్ పార్ట్ నర్ దొరికాడని సంతోషం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే సంసారం బాధ్యలు మోయడం వల్ల, వ్యాపారంలో వచ్చిన సవాళ్లను ఈజీగా పరిష్కరించానని చెప్పుకొచ్చారు.

వ్యాపారానికి పెళ్లి అడ్డంకి కాదని మరో ఆంట్రప్రెన్యూర్ నిషాబిస్వాల్ అన్నారు. ఆ మాటకొస్తే పెళ్లయిన పదేళ్లకు తల్లిగా ప్రమోషన్ వచ్చిందని నవ్వారామె.  

స్టార్టప్ లో - సొల్యూషన్ ఎలా చూపించాలన్నది ముఖ్యమైన టాపిక్. దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. ఎఫెక్టివ్ గా వివరించగలగాలి. అలా చేస్తే ఫండింగ్ పెద్ద కష్టం కాదని బాలా అభిప్రాయపడ్డారు. మ్యానిఫ్యాక్చరింగ్ కు సంబంధించి ఇండస్ట్రియల్ ట్రయినింగ్ ఇచ్చే స్టార్టప్ ని బాలా రన్ చేస్తున్నారు. ఎంబీయే చదివినంత మాత్రాన అన్ని తెలిసిపోవు.. వ్యాపారం చేయడానికి కావల్సి స్కిల్స్ నేర్చుకోవాలనేది బాలా అభిప్రాయం. మగువలు వ్యాపారంలో రాణించాలంటే 3 అంశాలు తెలుసుకోవాలన్నారు.

1. వ్యాపార మార్గాన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లాలి. అవసరం అనుకుంటే ట్రయినింగ్ తీసుకోవాలి. అలాంటి కార్యక్రమాలు చేపడితే విమెన్ ఆంట్రప్రెన్యూర్షిప్ మరింత పెరుగుతుంది

2. మెంటారింగ్ అవసరం. మహిళలు స్టార్టప్ ప్రారంభిస్తే వారికి మెంటారింగ్ చేయాలి. అలా చేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండటానికి అవకాశం ఉంది.

3. మద్దతివ్వాలి. కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా ప్రారంభంలో మద్దతిస్తే ఆ తర్వాత తిరిగి చూడక్కర్లేదు. మొదట్లో మనం ఇచ్చే మోరల్ సపోర్టు ఎంతగానో పనికొస్తుందని అన్నారామె.

ప్రశ్నలకు సమాధానాలు

ప్యానెల్ డిస్కషన్ తర్వాత హాజరైన వారడిగిన ప్రశ్నల్లో సరికొత్త సమస్యలు కనిపించాయి. తన అబ్బాయికి ఆటిజం సమస్య రావడంతో.. ఆ సమస్య వచ్చే వారికోసం స్టార్టప్ ప్రారంభిచానని ఓ ఫౌండర్ అనడంతో నిషా బిస్వాల్ మైక్ అందుకున్నారు. ఇప్పుడు మన ముందు పెట్టిన లాంటి సమస్యలు మీ జీవితంలో చాలా వచ్చుంటాయి. వాటికి పరిష్కార మార్గం కనుక్కుంటే సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్ కాడానికి అవకాశాలున్నాయని అన్నారామె. 

ఈ ఈవెంట్ లో యూఎస్ కాన్సులేట్ జనరల్ ఇన్ మైకెల్ ముల్లిన్స్, ఢిల్లీ యూఎస్ ఎంబసీ పొలిటికల్ ఎఫైర్స్ డేవిడ్ పి అరులానంతమ్ కూడా పాల్గొన్నారు.