ఆన్ లైన్ మార్కెటింగ్ దున్నేయాలంటే ఈ వీడియోలే బెటర్

పండంటి వ్యాపారానికి ఆరు సూత్రాలు

ఆన్ లైన్ మార్కెటింగ్ దున్నేయాలంటే ఈ వీడియోలే బెటర్

Tuesday December 27, 2016,

2 min Read

మార్కెట్ వ్యూహాలు నేర్చుకోవడం రాకెట్ సైన్స్ కోర్స్ లాంటి బ్రహ్మవిద్య కాదు. ముఖ్యంగా అడ్వర్టయిజ్ విషయంలో వినూత్న ప్రయోగాలు చేయకపోతే క్రీస్తుపూర్వం బ్యాచ్ అనుకుంటారు. అదే కొత్త కొత్త ప్రయోగాలు చేసుకుంటూపోతే ఆడియెన్స్ మనతో ప్రేమలో పడతారు. ఫిదా అయిపోయి వాళ్లంతట వాళ్లే వచ్చి యాడ్ అవుతారు. గత ఐదేళ్లుగా ఎక్స్ ప్లయినర్ వీడియోస్ చేసిన ప్రయోగమే అందుకు ఉదాహరణ. సాంప్రదాయ టెక్స్ట్ యాడ్స్ ని ఎలా బద్దలు కొట్టిందో అది రుజువు చేసింది. అయినా కొందరు మార్కెటింగ్ కిటుకులు తెలుసుకోడానికి ఇంకా పాతచింతకాయ పచ్చడినే ఫాలో అవుతున్నారు. కొత్తవి అడాప్ట్ చేసుకోడానికి వారు ఎందుకు సంశయిస్తున్నారో అర్ధంకాదు.

1. హయ్యర్ ఎంగేజ్మెంట్

గమనించారో లేదో సోషల్ మీడియాలో పోస్టు చేసే టెక్స్ట్ ఆర్టికల్స్ కంటే జనం వీడియోలనే ఎక్కువ చూస్తున్నారు. ప్రాడక్ట్ గురించి విజులైజ్ చేసి చూపెడితేనే.. అది ఏంటి..? ఎందుకు..? అనే కోణంలో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇమేజ్, టెక్స్ట్ కంటే వీడియోలే అత్యధికంగా షేర్ అవుతున్నాయి. ప్రాడక్ట్ గురించి వీరలెవల్లో ఆర్టికల్ రాసి పెడితే ఎవరూ చూడరు. దాని బదులు ఒక నిమిషం నిడివి ఉన్న ఒక వీడియో పోస్ట్ చేయండి.. కావల్సినన్ని వ్యూస్. దాంతోపాటు షేర్స్. ఆ ఏం చూస్తాం లే అనుకునే లేజ టైప్ వాళ్లు కూడా కాసేపు ఆగి పరిశీలిస్తారు.

2. ఎక్కువ సమాచారం.. తక్కువ టైం

వెయ్యి పదాల కంటే రెండు నిమిషాల వీడియోనే జనాలకు ఎక్కువ రీచ్ అవుతుంది. అది మిలియన్ పదాలతో సమానం. ప్రాడక్ట్ ఐడియా, దాని సర్వీసు తదితర వివరాలన్నీ వీడియోలో నిక్షిప్తం చేస్తే మీ విజన్ ఏంటో జనానికి ఈజీగా చేరిపోతుంది. చాలా తక్కువ సమయంలో అంతకంటే తేలిగ్గా కన్వర్జేషన్ జరిగిపోతుంది. ఎక్స్ ప్లయినర్ వీడియోలైతే ఇంకా ఎక్కువ సమాచారం కన్వే అవుతుంది. దానికోసం యూజర్లు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు.

image


3. ఆడియెన్స్ ఫిదా 

కనెక్ట్ అయిన ప్రతీ వీక్షకుడు మీ ప్రాడక్ట్ పట్ల సదభిప్రాయంతో ఉంటాడు. అదొక పాజిటివ్ ఎమోషన్. సదరు ప్రాడక్టుని కొనడానికి చాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్స్ ప్లయినర్ వీడియోలంటే కేవలం వాటిని వివరించేవే కావు.. కలకాలం గుర్తుండిపోయేలా చేస్తాయి. అన్ని రకాల వీడియో యాడ్స్ కు ఈ పర్ఫెక్షన్ ఉంటుంది.

4 సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్

గూగుల్, ఇంకా ఇతర సెర్చ్ ఇంజిన్లు ఇలాంటి వీడియోల పట్ల ఎంతో ఇష్టంగా ఉంటాయి. పైగా ఇలాంటి వీడియోలకు ప్రియారిటీ కూడా ఇస్తుంటాయి. ఇంజిన్ ఫ్రెండ్లీగా ఉండి రిజల్ట్ పేజీలో టాప్ లో కనపడేలా చేస్తాయి. తద్వారా క్లయింట్ అట్రాక్ట్ అవడం.. బిజినెస్ కన్వర్ట్ కావడం.. దానంతట అదే జరిగిపోతుంది.

5. హయ్యర్ కన్వర్షన్ రేట్

చాలామంది చెప్పే మాట ఇదే. వీడియో కన్వర్షన్ రేటు ఇతర వాటికంటే ఎక్కువ. అమెజాన్, ఈబే లాంటి సంస్థలు ఇలాంటి వీడియోలా ద్వారా ప్రాడక్ట్స్ పేజీ కన్వర్షన్ రేటు 35 శాతం పెరిగిందని చెప్తున్నాయి. వీడియో అనేది అతి తక్కువ సమయంలోనే వైరల్ గా మారి వందల, వేల కస్టమర్ పొటెన్షియల్ ని క్రియేట్ చేస్తుంది.

6. అరటిపండు వొలిచిపెట్టినంత ఈజీగా

ఇంట్రస్టింగ్ గా చెప్పిన ప్రతీ వీడియో ప్రాడక్ట్ జనం దగ్గరికి చేరిపోతుంది. వాళ్లు ఒక సినిమా చూసినంత ఆసక్తిగా చూస్తారు. చదివిన దానికంటే.. వింటూ చూడటం అనేది అటెన్షన్ ను క్రియేట్ చేస్తుంది.

అందుకే ఈ పవర్ ఫుల్ మీడియంను ఎట్టి పరిస్థితుల్లో లైట్ తీసుకోవద్దు. మార్కెటింగ్, అడ్వర్టయిజింగ్ విషయంలో దీనంత తోపు మరోటి లేదు. పదిమంది మాత్రమే చదివే బదులు.. వేలమంది చూడటం అంటే.. మార్కెట్ పొటెన్షియల్ పెరిగినట్టే కాదా? మరి ఎందుకాలస్యం...?