ప్రతికూలతలే విజయసోపానాలుగా పర్సనల్ బ్యూటీ బిజినెస్ లో ప్రియాంక

పర్సనల్ కేర్ కు అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది నేటితరం. ఇలాంటి బ్యూటీ రంగంలో తమకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకోవడం ఎవ్వరికైనా కష్టమే. ఇక ఈ సెక్టార్ లో బిజినెస్ ప్రారంభించాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. కానీ ఈ రంగంలో యువ పారిశ్రామికవేత్త, కాలోస్ కంపెనీ అధిపతి ప్రియాంక అగర్వాల్ దూసుకుపోతున్నారు. చదువుకొనే రోజుల్లో వచ్చిన ఐడియాను ఆచరణలో పెట్టి కోట్ల రూపాయలు ఆర్జించే స్థాయికి చేరుకున్నారు.

0

ప్రియాంక వయసు పాతికేళ్లు. ఈ ఏజ్ లోనే వ్యాపార రంగంలో ప్రవేశిస్తానని, రిస్క్ లు చేయాల్సి వస్తుందని అనుకోలేదు. కాలేజ్ లో ఉన్నప్పుడు ప్రియాంక తరచూ తండ్రి ఆఫీసుకు వెళ్తుండేవారు. ఆయన నడిపే ఆహారోత్పత్తుల బిజినెస్ ను పరిశీలిస్తుండేవారు. అప్పుడే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన కలిగింది. ఓ సెలూన్ ను ప్రారంభించాలనుకున్నారు. కానీ, పర్సనల్ కేర్ లేదా కాస్మెటిక్స్ బిజినెస్ చేయాలన్న ఐడియా మాత్రం రాలేదు. అనుభవం ఉంటే మంచిదని భావించి షార్ట్ టర్మ్ హెయిర్ అండ్ బ్యూటీ కోర్స్ లో చేరారు. అయితే కొన్ని రోజులకే కోర్సు అంటే ప్రియాంక బోర్ కొట్టేసింది హెయిర్ అండ్ బ్యూటీ కోర్స్ లో ఆసక్తి తగ్గిపోయినా ప్రియాంక నెమ్మదించలేదు. తాను ఏ రంగంలో అడుగిడితే బాగుంటుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. తండ్రిని సలహా అడిగితే పర్సనల్ కేర్ వ్యాపారం ప్రారంభించాలని ఐడియా ఇచ్చారు. ప్రస్తుతం ఈ బిజినెస్ లో దూసుకుపోతున్న ప్రియాంక ఈ ఐడియా తనకు మొదట నవ్వుతెప్పించిందని తెలిపారు.

లేటుగా వచ్చినా... లేటెస్ట్ గా...

------------------------------

పర్సనల్ కేర్ వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచన వచ్చినప్పుడు ప్రియాంకకు 20ఏళ్లు. అప్పటికి ఆమె కాలేజ్ స్టూడెంట్. దీంతో చదువు పూర్తైన తర్వాతే బిజినెస్ లాంచ్ చేయాలనుకున్నారు. చదువు పూర్తయ్యాక ఓ ఏడాది ఖాళీగా ఉండాల్సి వచ్చింది. దీంతో ఆమె వ్యాపారంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రియాంక బిజినెస్ ఐడియా అటకెక్కినట్లే అని అనుకున్నారంతా. అందరి అనుమానాలు పటాపంచలు చేస్తూ ప్రియాంక కాలోస్ పేరిట వ్యాపారం ప్రారంభించారు. తొలినాళ్లలో, తండ్రి వద్ద పనిచేసేఉద్యోగుల సహకారం తీసుకుంటూ బిజినెస్ నడిపారు. కార్యకలాపాలు నెమ్మదిగా ఉండడంతో వ్యాపారం అస్తవ్యస్తంగా సాగింది. తండ్రి పెట్టిన రూ.10 లక్షల పెట్టుబడి వృథా కాకుడదనే ఉద్దేశంతో నలుగురితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసుకున్నారు ప్రియాంక. ముందుగా టయర్ 2, టయర్ 3 సిటీల్లో ఎన్నిక చేసిన స్టోర్స్ లో ఉత్పత్తుల అమ్మకం ప్రారంభించారు

వృద్ధి బాటలో..

-------------------

ప్రతికూలతలనే విజయసోపానాలుగా మలచుకుని పర్సనల్ కేర్ వ్యాపారంలో విజయం సాధించారు ప్రియాంక. రూ.10 లక్షలను రూ.కోటి టర్నోవర్ గా మలచుకున్నామని ఆనందంగా చెప్తున్నారు. కొందరికి ఈ విజయం చిన్నదిగా కనిపించవచ్చు. కానీ డాబర్, పీ అండ్ జీ, హెచ్ యూ ఎల్ లాంటి బడా కంపెనీలతో పాటు లోకల్ ఉత్పత్తులను తట్టుకొని... సౌందర్యోత్పత్తుల పోటీని తట్టుకుంటూ ఇంత టర్నోవర్ సాధించడం అద్భుతమే అంటారామె. ప్రస్తుతం కాలోస్ కాస్మొటిక్స్ లైన్ ఆరు రాష్ట్రాలకు విస్తరించింది. ప్రతీ రాష్ట్రంలోనూ వందకుపైగా స్టోర్స్ లో ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

ప్రియాంక
ప్రియాంక

ఎంబీఏ సెకండ్ ఇయర్ లో అడుగిడిన ప్రియాంక, తమ సంస్థలో తనకంటే ఎక్కువ క్వాలిఫికేషన్, అనుభవం ఉన్న ఉద్యోగులున్నట్లు చెప్పారు. బాస్ అనే అహం లేకుండా వ్యాపార నిర్ణయాల్లో వారికీ ప్రాధాన్యతనిస్తానని తెలిపారు. ప్రతిభను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాన్న ప్రియాంక ఇప్పటివరకూ లింగ వివక్షను ఎదుర్కోలేదని అన్నారు. ఇలాంటి స్నేహపూరిత వాతావరణం మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పారు.