మీరు సింగిలా.. ? మింగిల్ అయ్యేందుకు రెడీయా ? మీ కోసమే ఓ స్టార్టప్ రెడ్ కార్పెట్ వేస్తోంది

మీరు సింగిలా.. ? మింగిల్ అయ్యేందుకు రెడీయా ? మీ కోసమే ఓ స్టార్టప్ రెడ్ కార్పెట్ వేస్తోంది

Thursday May 28, 2015,

3 min Read

మనం డిస్కనెక్టెడ్ ప్రపంచంలో బతికేస్తున్నాం. ఒకరితో మరొకరి పలకరింపులు డిజిటల్ గా మారిపోయాయి. సామాజిక సర్కిళ్లు, గ్రూపులు చాలా దగ్గరగా అయిపోయాయి. ఒకరినొకరు పలకరించుకోవడానికి సమయం లేకుండా పోతోంది. దీంతో అందరిని కలపడానికి కొన్ని సంస్థలకు అవకాశం దొరికినట్లైంది. నేటి యువతరం అంతా వారిలా ఆలోచించే వారితోనే కలవడానికి ఇష్టపడుతున్నారు. చాలా రకాలైన వెబ్ సైట్లు సింగిల్ ఇండివిడ్యువల్స్‌ని కలపడంపై ఫోకస్ పెట్టాయి. ఇలాంటి డేటింగ్ సైట్లలో ట్రూలీ మ్యాడ్లీ, ఎస్లే డాట్ కామ్ లాంటివాటిని ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇవి ఒంటరిగా ఉండి ఒకేలా ఆలోచించే వారికోసం ప్రారంభమైనప్పటికీ సాధారణ నెట్ జనులకు సైతం సుపరిచితం. అయితే వరల్డ్ ఎలైక్(ఒకేలాగ ఆలోచించే ప్రపంచం) అనేది మాత్రం వేరనే చెప్పాలి.

ఏ వరల్డ్ అలైక్ (AWA) అనేది నవంబర్ 2014లో ప్రారంభమైంది. దీన్ని హిమాన్షు గుప్త చేపట్టారు. జనం అంతా కలసి వచ్చి వారి సామాజిక సర్కిల్‌ను ఏర్పాటు చేసుకొని తమకు కావల్సిన సౌకర్యాన్ని పొందుతున్నారు. వేరు వేరు ఈవెంట్‌లలో ఒంటరిగా ఎదుగుతున్నారు. ఒకేరకమైన ఆసక్తి, ఇష్టం ఉన్న ఈ ఒంటరి పక్షులకు ఆహ్వానం అందుతుంది. ఈ ఆహ్వానం నచ్చితే సామాజిక సైట్‌లో వీరు కలుసుకుంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో కొత్తవారిని కలవడం చాలా సులభం. అదే నగరానికి చెందిన వారైనా లేక వేరే ఊరు వారైనా కావొచ్చు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో కలుసుకోడాలు చాలా సర్వసాధారణం. అయితే భారత్ లో ఈ ఆలోచన ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉంది. మనదేశంలో కూడా ఎన్నో అనధికారిక సమావేశాలు జరుగుతూనే ఉంటాయి. అయితే అది విదేశాల కలయికల్లా మాత్రం ఉండటం లేదు.

దేవినా భద్వార్, హిమాన్సూ గుప్త

దేవినా భద్వార్, హిమాన్సూ గుప్త


ఈ ప్రత్యేకమైన స్పేస్ ఎలా పనిచేస్తుంది ?

ప్రతినెలా ఏడబ్యుఏ వ్యక్తిగత ఈవెంట్ లను ఏర్పాటు చేస్తోంది. దీంతో తమలాగ ఆలోచించే వారితో కలవడానికి అవకాశాన్ని కల్పించినట్లవుతోంది. ఏ వరల్డ్ ఎలైక్ (ఎడబ్యూఏ) ప్రధాన ఉద్దేశం జనానికి సంబంధించిన నెట్ వర్క్‌ను పెంచాలి. తమలా ఆలోచించే వారి గురించి తెలియాలి. అలాంటి వారు ఈ నగరంలోనే ఉన్నారనే ఉత్సాహవంతమైన కబురును తెలుసుకోవాలి.

ఎవరికి వారు వెబ్ సైట్లో అప్లికేషన్ నింపి మెంబర్‌షిప్ తీసుకోవాలి. కొంత చర్చ జరిగిన తర్వాత వీరందరికీ ఈవెంట్ కు ఆహ్వానం అందుతుంది. ఒకసారి ఫార్మల్ ఇన్విటేషన్ వచ్చిన తర్వాత పేమెంట్ ఆన్‌లైన్ మెంబర్‌షిప్ ప్లాన్‌కు సెలక్ట్ కావడానికి అవకాశం వస్తుంది. వీటి ధరలు మూడు నెలలకు 7,500, ఆరు నెలలకు 12వేలు, ఏడాదికి 15వేలు.విదేశాల్ల్లో 12ఏళ్లు పనిచేసిన హిమాన్షు దీన్ని ప్రారంభించారు. భారత్ వచ్చాక కొత్తవారిని కలవడం కష్టంగా తోచింది. వారితో స్నేహం చేయడం అంత ఈజీ అనిపించలేదు. తనకు ఎదురైన అనుభవం వేరొకరికి ఎదురు కాకూడదని ఎడబ్యూఎ ను మొదలు పెట్టాల్సి వచ్చింది.

మొదటి నెలంతా టెక్నాలజీనే ఔపోసన పట్టే కార్యక్రమాన్ని చేపట్టింది. తర్వాత బ్రాండింగ్, కమ్యునికేషన్ లాంటి విషయాలతోపాటు సోషల్ నెట్ వర్క్‌లో సింగిల్స్ లాంటి చాలా విషయాలపై పూర్తి గ్రిప్ తెచ్చుకున్నారు. ఇంకేముంది వెబ్ సైట్ లాంచింగ్ అయిపోయింది. ఇప్పటి వరకూ టీం డజన్ ఈవెంట్లను చేసింది. 150మంది ఇందులో పాల్గొన్నారు. మరో 100మంది డేటా బేస్ సిద్ధంగా ఉంది. మరో రెండు ఈవెంట్లను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరికొన్ని ఈవెంట్స్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

జనంలో నమ్మకాన్ని కలిగించడమే టీం ముందున్న సవాలు. సమయం గడుస్తున్న కొద్దీ మెంబర్స్‌కు కావల్సిన అవసరాలు ఒక్కొక్కటి బోధపడుతున్నాయి. వారి ఆలోచన దోరణి తెలుస్తోంది. ఫీడ్ బ్యాక్ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నామని హిమాన్షు వివరించే ప్రయత్నం చేశారు. చాలా రకాల ఆన్ లైన్ సైట్లు సింగిల్స్‌ని వెతికి తీసే కార్యక్రమం చేపడుతున్నాయి. అవి ప్రధానంగా డేటింగ్ లేదా మాట్రిమోని కోసమే పనిచేస్తాయి. ఏడబ్యూఏ అనేది లైట్ మైండెడ్ వారిని కలపడమనే కార్యక్రమాన్ని భుజాన వేసుకుంది. తమలాగే ఆలోచించే వారిని కలవడం వల్ల చాలా లాభాలున్నాయి. ఫ్రెండ్ సర్కిల్‌ని పెంచుకోవడం, ఇతర అవసరాలకు నెట్ వర్క్ సాయం పొందడం, ప్రత్యేకమైన వ్యక్తులను కలవడం లాంటివి ఇందులో ప్రధానంగా చెప్పొచ్చు. సోషల్ సర్కిల్‌ని పెంచుకోవడం, వారి కంఫర్ట్ జోన్‌లోనికి ప్రవేశించడం... స్వతంత్రంగా గ్రో కావడం అనేది మా ప్రధాన అజెండా అన్నారు హిమాన్షు. అయితే భవిష్యత్‌లో ప్రతి ఒక్కరికి ఓ చక్కనైన వాతావరణం కల్పించి వారిలా ఆలోచించే వారితో సంబంధాలను పెంపొందించడమనే బాధ్యతను కూడా టీం చేపడుతుంది.

ఢిల్లీలోని ఉత్తర ప్రాంతంలో విస్తరించాలనే యోచనలో టీం ఉంది . ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్న ఏకైక లైఫ్ స్టైల్ నెట్ వర్క్ గా కొనసాగుతోంది. టెక్నాలజీ నిర్మాణంతో పాటు మొబైల్ అప్లికేషన్ పై పెట్టుబడులను మరింత పెంచాలని చూస్తున్నారు. సభ్యుల సంఖ్య మరింతగా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఏడాది ద్వితియార్థంలో ముంబైలో, వచ్చే ఏడాది చివరికల్లా ప్రపంచ వ్యాప్తంగా విస్తరించాలనే ప్రణాళికతో టీం పనిచేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వెల్ ఎడ్యుకేటెడ్ సింగిల్స్‌ను ఒకే గొడుగు కిందికి తీసుకు రావడమనే టార్గెట్‌గా తాము పనిచేస్తున్నారట. ప్రపంచంలో ఏ నగరంలో ఉన్నా వారిలాగా ఆలోచించే వారితో కలిసే అవకాశాన్ని తాము కల్పిస్తామని హిమాన్షూ ముగించారు.