బండి ఆగిపోయిందా..? ఏం ఫికర్ చేయకండి.. యులాఫిక్స్ చేయండి!  

0

రిద్దీష్ వెస్ట్ మారేడుపల్లిలో ఉంటాడు. గచ్చిబౌలిలో ఆఫీస్. కారులోనే వెళ్లివస్తుంటాడు. ఒకరోజు ఉదయం బంజారాహిల్స్ రోడ్ నంబర్ త్రీలో వెహికిల్ సడెన్‌ గా ఆగిపోయింది. అసలే ఆఫీస్ అవర్స్. పైగా విపరీతమైన ట్రాఫిక్. బండి ఎంతకూ స్టార్ట్ అవడం లేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. ట్రాఫిక్ పోలీసుల సాయంతో సైడుకి తీశాడు. అర్జెంటుగా మెకానిక్ కావాలి. తెలిసిన ఏరియా కాదు. దగ్గర్లో ఫ్రెండ్స్ ఎవరూ లేరు. ఇప్పుడెలా..?

ప్రసన్న టీసీఎస్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. పటాన్ చెరు నుంచి వస్తుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉందని కారు పక్కన పెట్టి, స్కూటీలో బయల్దేరింది. మధ్యలోకి రాగానే టైర్ బరస్ట్ అయింది. ఊపిరి ఆగినంత పనైంది. ఎటు చూసినా శూన్యం. బండి రోడ్డువారగా తీసి పార్క్ చేసింది. ఉసూరుమంటూ ఎండలో నిల్చుంది. అర్జెంటుగా మెకానిక్ కావాలి. దగ్గర్లో తెలిసిన వాళ్లు లేరు. ఇప్పుడెలా..?

ఇది ఏ ఒకరిద్దరి సమస్యో కాదు. హైదరాబాదులో నిత్యం ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. మధ్యలో బండి బ్రేక్ డౌన్ అయితే దానంత నరకం ఇంకోటి ఉండదు. టూ వీలరో, ఫోర్ వీలరో.. వెహికిల్ ఆగిపోయందంటే చాలు చుక్కలు చూడాల్సిందే. అందునా పీక్ ఆవర్స్ అయితే ఇబ్బంది చెప్పతరం కాదు. అలాంటి సమస్యకు నిమిషాల్లో పరిష్కారం చూపిస్తోంది యులా ఫిక్స్. హైదరాబాదుకి చెందిన ఈ స్టార్టప్ టైర్ పంక్చర్ నుంచి కార్ వాష్అన్ని సేవల్ని ఒకే ఫ్లాట్ ఫామ్ మీదికి తెచ్చింది.

చేయాల్సిందల్లా యులా ఫిక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడమే. యాప్ ద్వారా రిక్వెస్ట్ సబ్మిట్ చేయగానే, దగ్గర్లోని మెకానిక్‌ల సమాచారం వస్తుంది. మల్టీపుల్ ప్రొవైడర్స్ అందుబాటులోకి వస్తారు. ఎస్ట్ మేట్స్ కూడా నెగోషియబుల్. దాంట్లో మీకు బెస్ట్ అనిపించిన వారిని సెలెక్ట్ చేసుకోగానే, సదరు మెకానిక్ కు ఆటోమేటిగ్గా జాబ్ అసైన్ అవుతుంది. మీరు టీ తాగేంత సేపట్లో మెకానిక్ వచ్చి బండి రిపేర్ చేస్తాడు. మరీ మేజర్ సమస్య అయితే సమయం పడుతుందనుకోండి అదివేరే విషయం.

ఇలా ఫోర్ వీలరైనా, టూ వీలరైనా, సమస్య చిన్నదైనా, పెద్దదైనా.. సరసమైన ధరలో పక్కా సర్వీస్ అందిస్తారు. ఫుల్లీ ఆటోమేటెడ్ అయిన ఈ కార్ కేర్ సంస్థ ప్రస్తుతానికి 1600 ప్రొవైడర్లను అందిస్తోంది. 2వేల మంది డ్రైవర్ల డేటాను కూడా కలెక్ట్ చేసింది. పంక్చర్, కార్ వాష్, ఆయిల్ ఛేంజ్, రెగ్యులర్ సర్వీస్, వెహికిల్ టోయింగ్.. ఇలా అన్ని రకాల సర్వీసులను అందిస్తోంది యులాఫిక్స్ యాప్.

ప్రస్తుతానికి యులాఫిక్స్ యాండ్రాయిడ్ వెర్షన్ లో యాప్ అందుబాటులో ఉంది. త్వరలో ఐఓఎస్ లోనూ రాబోతోంది. వెబ్ వెర్షన్ కూడా ఉంది. సెల్ఫ్ డయాగ్నస్టిక్ చేసే కేపబిలిటీ ఉన్న ఓబీడీ జాక్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు.

యులాఫిక్స్‌ సీఈవో నగేశ్ కొండూరి. ఇతనికి 15 ఏళ్ల ఐటీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అమెరికాలో ఎంఎస్ చేసిన నగేశ్‌.. యూఎస్‌ ఎయిర్ వేస్ లాంటి సంస్థల్లో పనిచేశారు. ప్రస్తుతం తన టీంలో పదిమంది మెంబర్లున్నారు. నెల క్రితమే మార్కెట్లోకి వచ్చిన ఈ యాప్ 200కు పైగా డౌన్ లోడ్లను నమోదు చేసుకుంది.

ఇప్పటికైతే సోషల్ మీడియా ద్వారానే అడ్వర్టయిజ్ చేస్తోంది. ఏంజిల్ ఇన్వెస్టర్ల కోసం ఎదురు చూస్తున్నామని సీఈవో నగేశ్ తెలిపారు. వచ్చే ఏడాదినాటికి అమెరికాలో లాంఛ్ చేయాలనే పట్టుదలతో ఉన్నామని చెప్పి ముగించారాయన. 

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Related Stories

Stories by team ys telugu