త్వరలోనే నిజామాబాద్ పట్టణంలో ఐటీ హబ్

త్వరలోనే నిజామాబాద్ పట్టణంలో ఐటీ హబ్

Sunday September 17, 2017,

2 min Read

ఐటీ పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లాలన్న తెలంగాణ ప్రభుత్వం ఆశయం శరవేగంగా ముందుకు పోతుంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మణానికి అమోదం తెల్పిన ప్రభుత్వం తాజాగా నిజామాబాద్ పట్టణానికి ఐటి పరిశ్రమను తీసుకెళ్లనున్నట్లు తెల్పింది. త్వరలోనే నిజామాబాదులో ఐటి హబ్ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు.

image


ఈ ఐటి హబ్ కోసం మెదటి దశలో సూమారు 25 కోట్ల రూపాయాలను ఖర్చు చేస్తారు. ఐటి హబ్ లో, ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటుంది. వచ్చే ఏడాదిలో ఇందుకు సంబంధించిన అన్ని మౌలిక వసతులను టియస్ ఐఐసి ఏర్పాటు చేస్తుంది. నిజామాబాద్ పట్టణానికి ఐటీ పరిశ్రమ అభివృద్ధి కోసం కావల్సిన అన్ని అనుకూలతలు ఉన్నాయి. హైదరాబాద్ నగరానికి సూమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి జాతీయ రహదారి, రైలు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. దాదాపు దశాబ్దన్నర కిందటే జిల్లాలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు వెలిశాయి. పక్కనే ఉన్న బాసర ట్రిపుల్ ఐటీ ద్వారా కూడా వేలాది మంది ఇంజనీర్లు ప్రతి సంవత్సరం పట్టాలు తీసుకుంటున్నారు. అక్కడి చుట్టుపక్కల ఉన్న విద్యాసంస్థల ద్వారా ఐటి పరిశ్రమలకు కావాల్సిన నాణ్యమైన మానవ వనరుల లభ్యత సాద్యం అవుతోంది.

తెలంగాణలోని ద్వీతీయ శ్రేణి పట్టణాలకు ఐటి పరిశ్రమలను తరలించే క్రమంలో మెదట చిన్నస్థాయి కంపెనీలు పెట్టుబడులు పెడతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. వందలాది మంది తెలుగు ఏన్నారైలు విదేశాల్లో అనేక ఐటి కంపెనీలు పెట్టారు.. వారంతా ముందుకు వస్తే ప్రభుత్వం తరపున పాలసీ పరమైన రాయితీలు కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఒక వైపు ప్రభుత్వం నుంచి ఐటి హబ్ ప్రతిపాదన అమోదానికి ప్రయత్నం చేస్తూనే, మరోవైపు స్వయంగా వీదేశాల్లోని ఏన్నారైల కంపెనీలతో మంత్రి చర్చలు నిర్వహించారు. ఐటి హబ్ ఏర్పాటు కోసం వారు చూపిన చొరవ, కృషిని కేటీఆర్ అభినందించారు. ఐటి హబ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సుమారు 60కిపైగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ లను మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం ఆసక్తి కనబరిచిన 60 మంది ఎన్నారైలో తెలంగాణేతర ఏన్నారైలు ఉన్నారని, వారంతా తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి, కంపెనీల ఏర్పాటుకు ముందుకు వచ్చారని కేటీఆర్ అభినందించారు.