ఈ టెస్ట్ బుక్ ఉంటే పోటీపరీక్షల్లో విజయం మీదే !

గేట్‌, క్యాట్‌... ఏదైనా అభ్యర్థుల చేతికి చిక్కాల్సిందే! ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌లో సహాయకారిగా ఉండే సైట్‌

ఈ టెస్ట్ బుక్ ఉంటే పోటీపరీక్షల్లో విజయం మీదే !

Wednesday June 24, 2015,

2 min Read

పరీక్షలనగానే మునుపటిలా చిట్టీలు, కాపీలు కొట్టడం రోజులు పోయాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్‌ వ్యవహారమే ! పక్కనే గైడ్‌ పెట్టుకున్నా, సమాధానం వెతుక్కుని టిక్‌ చేసే లోపు పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. అందుకే ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ రాసేవారికోసం ముందస్తు తయారీని టెస్ట్‌ బుక్‌ అందిస్తోంది. గేట్‌, క్యాట్‌, ఎస్‌బిఐ పిఓ, ఎస్‌బిఐ క్లర్క్‌, ఐబిపిఎస్‌ పిఓ వగైరా అనేక ఆన్‌లైన్‌ పరీక్షలకు మాక్‌ టెస్ట్‌‌లు ఈ సైట్‌లో ఉంటాయి. 2014 జనవరిలో ఆరంభమైంది. లెట్స్‌ వెంచర్‌, ఆహ్‌!వెంచర్స్‌ ద్వారా కొందరు ఏంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి కోటిన్నర రూ.ల నిధుల సేకరణ జరుపుతోంది. ఈ వ్యవహారాన్ని ఢిల్లీకి చెందిన ఇన్వెస్టర్‌ ఉత్సవ్‌ సోమాని, కార్లయిల్‌ గ్రూప్‌ ఎండి శంకర్‌ నారాయణన్‌లు మరికొందరు ఇన్వెస్ట్‌ మెంట్‌ బ్యాంకర్లు, విద్యా వ్యాపారవేత్తలు, మొబైల్‌ నిపుణులు, ఆంట్రప్రెన్యూర్లతో కలిసి నడిపిస్తున్నారు.

టెస్ట్‌ బుక్‌ టీమ్‌

టెస్ట్‌ బుక్‌ టీమ్‌


టెస్ట్‌ బుక్‌ ముంబై, ఢిల్లీ ఐఐటిలకు చెందిన ఆరుగురు పూర్వ విద్యార్థులు స్థాపించి, విజయవంతంగా నిర్వహిస్తున్నారు. మార్చిలో వారిని కలిసినప్పుడు గేట్‌ (GATE) నిమిత్తం 13,000 మంది నమోదయ్యారని తెలిపారు. మొత్తమ్మీద 55,000 అభ్యర్థులు (యూజర్లు) నమోదై ఉన్నారని, వీరు దాదాపు 30 లక్షల వరకు ప్రశ్నలను పరిష్కరించగలిగారని చెప్పారు. వారు చెప్పినదాని ప్రకారం ప్రతి ఒక్క అభ్యర్థి సగటున 55 ప్రశ్నలను సాల్వ్‌ చేయగలుగుతున్నారు. ఆయా విద్యా విభాగాల్లో బోధనానుభవం ఉన్న టాపర్లు, అధ్యాపకులు టెస్ట్‌ బుక్‌ సమాచారాన్ని రూపొందిస్తున్నారు.

ప్రస్తుతానికి అభ్యర్థులకు టెస్ట్‌ బుక్‌ పూర్తిగా ఉచిత సేవలందిస్తోంది. త్వరలోనే ప్రీమియం ఫీచర్లు పద్ధతి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. కొత్త నిధులను ఉత్పాదన మెరుగుదలకు, యూజర్‌ బేస్‌ను పెంచుకోవడానికి వెచ్చించాలని అనుకుంటున్నారు. ఇప్పటివరకు నెట్‌వర్క్స్‌ ద్వారా అందరికీ అందుతోంది. ఇక మీదట మార్కెట్టులోకి విస్తరింపజేయాలని ప్రణాళికలు వేస్తున్నారు.

ఇండియాలో విద్యాహక్కు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆన్‌లైన్‌ టెస్ట్‌ల పట్ల అభ్యర్థులు చాలా మక్కువ చూపుతున్నారు. విద్యా రంగంలో ఇది చాలా డిమాండ్‌ ఉన్న సబ్జెక్టుగా మారింది. విద్యార్థికి సహాయకారిగా ఉంటుందన్న భావన కలిగించగలిగితే రుసుం చెల్లించడానికి సిద్ధపడుతున్నారు. ఇండియాలో ఇలాంటి అన్‌లైన్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ సాగించే స్టార్టప్స్‌ వ్యాపార వివరాలు అవీ సేకరించి, ఈ మాదిరి సైట్లకుగల డిమాండ్‌ను అంచనా వేశారు. టాపర్‌ 22 లక్షల డాలర్లను ఎస్‌ఎఐఎఫ్‌ భాగస్వాములు, హెలియన్‌ వెంచర్స్‌ నుంచి; ఎంబైబ్‌ 40 లక్షల డాలర్లను కలారి నుంచి నిధులు సేకరించగలిగాయి. వీళ్లేగాక, ఇంకా చాలా స్టార్టప్స్‌ ఈ రంగంలో ఉన్నాయి. సైట్‌లో చందోబద్ధంగా సమయాన్ని వెచ్చించడం, ప్రశ్నలలో నిమగ్నం కావడం అనేవి స్టార్టప్స్‌ కి చాలా ముఖ్యం. టెస్ట్‌ బుక్‌ ఇంకా శైశవదశలోనే ఉంది. విద్యార్థి లోకంలోకి టెస్ట్‌బుక్‌ చొచ్చుకుపోవాలన్న తపనతో నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.


వెబ్‌సైట్‌ : Testbook