IIT, JEE పరీక్ష రాసే కోటిన్నర మంది విద్యార్థులే 'మాక్ బ్యాంక్' మెయిన్ టార్గెట్

చవకగా మాక్ టెస్టులు అందిస్తున్న స్టార్టప్..విద్యార్థులు, కోచింగ్ సెంటర్లే టార్గెట్..పోటీపరీక్షలకు పెయిడ్ ప్రొడక్ట్ అందిస్తున్న సంస్థ ..

0

ఇది పోటీ ప్రపంచం. ప్రపంచమంతా పోటీ పడి పరుగులు తీస్తోంది. ఇక విద్యార్థులైతే పోటీ పరీక్షల చుట్టూ పరిగెత్తుతున్నారు. వారానికో నోటిఫికేషన్. నెలకో ఎగ్జామ్. ఇలా పోటీ పరీక్షల కోసం సిద్ధమయ్యే వారికోసం ఎన్నో కోచింగ్ సెంటర్లున్నాయి. వెబ్ సైట్లు కూడా సేవలందిస్తున్నాయి. అలాంటిదే మాక్ బ్యాంక్ కూడా. పేరుకు తగ్గట్టే మాక్ టెస్టులకు ఇది బ్యాంక్ లాంటిది. అసలీ బ్యాంక్ ఎవరిది ? ఏఏ సేవలందిస్తున్నాయి ? తెలుసుకుందాం...

మ... మ... మాక్ బ్యాంక్

మాక్ బ్యాంక్... ఇదో కొత్త స్టార్టప్. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు మాక్ టెస్టులు అందించే వెబ్ సైట్. ఎగ్జామ్ ప్రిపరేషన్ మార్కెట్ లో అడుగుపెట్టిన ఈ వెబ్ సైట్... విద్యార్థుల మనసు దోచేస్తుంది. కాంపిటీషన్ టెస్ట్ ప్రిపరేషన్ రంగంలో ఇండియాకు పెద్ద మార్కెటే ఉంది. అందుకే దాన్ని బేస్ చేసుకొని కొత్తకొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి. మాక్ బ్యాంక్ కూడా అలాంటి సేవలందించేందుకే మొదలైంది. బ్యాంకింగ్ ఎడ్యుకేషన్ లో పెయిడ్ ప్రొడక్ట్ అందిస్తున్న సంస్థ ఇది. విద్యార్థులకు నేరుగా మాక్ టెస్ట్ లను అందించడమే కాదు... కోచింగ్ సెంటర్లను తమ స్టార్టప్ లో భాగస్వాములను చేస్తోందీ సంస్థ.

1...2...3... స్టార్టప్

మాక్ బ్యాంక్ రూపకర్త కోణార్క్ సింఘాల్. ఇలాంటి స్టార్టప్ ల నిర్వహణలో కోణార్క్ ది మంచి హ్యాండ్. బెంగళూరు ఐఐఎంకు చెందిన పూర్వ విద్యార్థి కోణార్క్... స్టార్టప్ ప్రపంచంలో అడుగు పెట్టడానికి ముందు మూడేళ్ల పాటు బెయిన్ అండ్ కంపెనీకి పనిచేశాడు. ఆ తర్వాత సొంతగా స్టార్టప్ ప్రారంభించాడు.

"స్టార్టప్ రంగంలో చాలా ఏళ్లు పనిచేసిన అనుభవం నాకుంది. మొదట్లో మ్యాప్ మై ఇండియా, ఆ తర్వాత సోర్స్ వెబ్ ప్రారంభించాను" అని తన తొలి అడుగుల గురించి వివరిస్తాడు కోణార్క్.

సోర్స్ వెబ్ నిర్వహించిన తర్వాత ఇంకా ఏదైనా చెయ్యాలనుకున్నాడు. భారతదేశంలో ఐఐటీ-జేఈఈ, క్యాట్, బ్యాంకింగ్ లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల సంఖ్య కోటిన్నరకు పైనే ఉంటుంది. వారిలో ఎనభై శాతం మంది టాప్-10 మెట్రో సిటీల బయటి వాళ్లే. అలాంటి వారి కోసం ఏదైనా ప్రారంభించాలన్నది కోణార్క్ ఆలోచన. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ మాక్ బ్యాంక్.

“పోటీ పరీక్షలంటే చాలామంది క్యాట్, ఐఐటి జేఈఈ లాంటి వాటి గురించే ఆలోచిస్తారు. కానీ మేము మిగతా వారికి సేవలందించాలనుకున్నాం ” మాక్ బ్యాంక్ గురించి కోణార్క్ మాటలివి.

మాక్ టెస్ట్... సూపర్ హిట్

మాక్ బ్యాంక్ లో ఉచితంగా ఏమీ లభించవు. డబ్బులిచ్చి మాక్ టెస్ట్ లను కొనుక్కోవాల్సిందే. మొదట్లో ఒక పరీక్షకు ఏడు పేపర్లతో ఓ మాక్ టెస్ట్ సిరీస్ రెడీ చేసింది. ఈ సిరీస్ ధర రూ.1500. నాలుగు మాక్ టెస్టుల సిరీస్ ధర రూ.400.

"మా మాక్ టెస్ట్ లకు విద్యార్థుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. టెస్ట్ పేపర్ క్వాలిటీ అలాంటిది. మరిన్ని టెస్ట్ పేపర్స్ సిద్ధం చేసివ్వాలని మాకు చాలా రిక్వెస్ట్ లు వచ్చాయి. కానీ మాకున్న తక్కువ వనరులు మమ్మల్ని కట్టిపడేస్తున్నాయి" మాక్ బ్యాంక్ కష్టాలివి.

మాక్ బ్యాంక్ లో ప్రస్తుతం ఆరు వందల మంది పెయిడ్ యూజర్స్ ఉన్నారు. ప్రతీ సగటు టికెట్ ధర రూ.2000. మాక్ బ్యాంక్ కు మూడు రకాల డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి.

ఆన్ లైన్ ఛానల్: సోషల్ మీడియా అకౌంట్ ద్వారా యాభై శాతం మంది యూజర్లున్నారు. యాడ్స్ ద్వారా ఆదాయం లభిస్తోంది.

ఆఫ్ లైన్ టెస్ట్ ప్రిపరేషన్ ఇన్ స్టిట్యూట్స్ (బిజినెస్ టు బిజినెస్ టు కస్టమర్): పోటీ పరీక్షల విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే సెంటర్లు, క్లాసులకు మాక్ టెస్ట్ లను అందిస్తున్నారు.

ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూషన్ : బుక్ షాపుల్లో మాక్ బ్యాంక్ స్క్రాచ్ కార్డులు లభిస్తాయి. ఆ స్క్రాచ్ కార్డులు పొందిన విద్యార్థులు వెబ్ సైట్ లో డిస్కౌంట్ లభిస్తుంది.

సక్సెస్ సీక్రెట్...

కంటెంట్ ను సొంతగా తయారు చేసుకోవడం మాక్ బ్యాంక్ సక్సెస్ సీక్రెట్. అందుకే మాక్ టెస్టులు హై స్టాండర్డ్ తో ఉంటాయి. ఆన్ లైన్ మార్కెట్ లో మరిన్ని మంచి అవకాశాలు రావాలంటే అందుకు తగ్గ ఆర్థిక ప్రోత్సాహం ఉండాలి. అందుకే నిధులను సమకూర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు మాక్ బ్యాంక్ నిర్వాహకులు. ప్రస్తుతానికి మాక్ బ్యాంక్ వ్యాపారంలో నిలదొక్కుకొంది. కానీ పోటీగా టెస్ట్ బజార్, టెస్ట్ బుక్, ఎగ్జామిఫై, 100మార్క్స్ లాంటి... వెబ్ సైట్లున్నాయి. ఇలాంటి స్టార్టప్ లు ఇన్వెస్టర్లను బాగానే ఆకర్షిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని రావడం ఖాయం. మరి ఇండియాలో పోటీ పరీక్షల ప్రిపరేషన్ మార్కెట్ లో ఎన్ని నిలదొక్కుకుంటాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాలి.

Related Stories