వైట్ బోర్డ్ కెఫే.. ఇదో రకమైన కో-వర్కింగ్ కెఫే

0

దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కేవీ జగన్నాథ్ అనే ఓ ఆంట్రప్రెన్యూర్ హైదరాబాద్ స్టార్టప్ లకోసం ఓ ప్లాట్ ఫాం క్రియేట్ చేద్దామనుకున్నారు. అయితే అది సాధారణంగా ఉండకూడదని భావించారు. అలా ప్రారంభమైందే ఈ వైట్ బోర్డ్ కెఫే(డబ్యూబీసీ).

“కొత్తగా వ్యాపారం ప్రారంభిచాలనుకుంటే మా కేఫేకి వచ్చి కాఫీ తాగండి,” జగన్నాథ్

స్టార్టప్ లకు కో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ని అందించడం తమ కెఫే ప్రత్యేకత అని జగన్నాథ్ అంటున్నారు. ఈ కెఫేలో అడుగు పెట్టి కొత్త వ్యాపారం ప్రారంభించాలంటున్నారు.

కోవర్కింగ్ కెఫే

స్టార్ బక్స్, కాఫీడే లాంటి కాఫీ షాప్ లాగానే ఉంటుంది. దీంతో పాటు కోవర్కింగ్ స్పేస్ లాగా వినియోగించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల తర్వాత దీన్ని ఓ కల్చరల్ స్పేస్ లాగా ఉపయోగించుకోవచ్చు. సౌండింగ్, లైటింగ్ లాంటి హై ఎండ్ ఎక్విప్ మెంట్ అందుబాటులో ఉన్నాయి. స్టార్టప్ లకు ఇది ఓ మంచి ప్లాట్ ఫాం అని జగన్నాథ్ అంటున్నారు.

“ప్రపంచ వ్యాప్తంగా కాకా హోటల్ నుంచి స్టార్ హోటల్ దాకా ఎన్నో చోట్ల మీటింగ్ లకు అటెండ్ అయ్యా,” జగన్నాథ్

తాను చాలా దేశాల్లో చాలా సమావేశాల్లో పాల్గొన్నానని , అన్నిచోట్ల అందుబాటులో ఉన్న అన్ని రకాలైన సౌకర్యాలు ఇక్కడ అందించడానికి వైట్ బోర్డ్ కెఫేని ఏర్పాటు చేశామన్నారు.

ఈవెంట్స్ కు అనువుగా

ఉదయం నుంచి సాయంత్రం దాకా కో వర్కింగ్ స్పేస్ లాగా వాడుకోవడమే కాదు, స్టార్టప్ టాక్స్ లాంటి ఈవెంట్స్ చేయడానికి కూడా ఇది ఎంతగానో అనుకూలమైంది.

“సాయంకాలం 6 తర్వాత సంగీత కచేరి పెట్టినా స్వాగతమే,” జగన్నాథ్

స్టార్టప్ కోసం పనిచేసేవారితో పాటు ఫ్రీలాన్సర్స్ కోసం ఇది అందుబాటులోకి తెచ్చామన్న జగన్నాథ్- సాయంకాలం సమయంలో మ్యూజిక్ కన్సర్న్ ఏర్పాటు చేసుకోవచ్చని ఆఫర్ చేస్తున్నారు.

వైట్ బోర్డ్ కెఫే ఫౌండర్ గురించి

హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన ఛాయిస్ సొల్యూషన్ లిమిటెడ్ కంపెనీ కి ఎండీ, సిఈఓ గా ఉన్న జగన్నాథ్ బ్రెయిన్ చైల్డ్ ఇది. ఐఐటి రూర్కీ పూర్వ విద్యార్థి అయిన జగన్నాథ్- ఐఎస్బీ నుంచి మాస్టర్స్ చేశారు. హార్వార్డ్ బిజినెస్ స్కూల్ నుంచి పట్టా పొందారు. 29 ఏళ్ల పాటు ఐటి, ఐటి ఆధారిత రంగంలో అనుభవం ఉంది. ‘క్లౌడ్ కంప్యూటింగ్ బ్లాక్ బుక్’ అనే పుస్తకానికి సహ రచయిత. భవిష్యత్ లో మరిన్ని పుస్తకాలు ఆయన కలం నుంచి రాబోతున్నాయి.

భవిష్యత్ ప్రణాలికలు

కాఫీ కేఫే, కో వర్కింగ్ స్పేస్ లు ఒకే చోటికి తీసుకొచ్చే ఇలాంటి కెఫేలను మరిన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. స్టార్టప్ ఈకో సిస్టమ్ లో ఇలాంటి స్పేస్ లను భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్ లో దేశం మొత్తం నాల్డెడ్ షేరింగ్ హబ్ లను ఏర్పాటు చేయడానికి ప్రణాలిక సిద్ధమని ముగించారు జగన్నాథ్

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories