స్మాల్ సిటీసే ఈ కామర్స్ కు బిగ్ బాస్కెట్

0

నెలకి వెయ్యికోట్ల రన్ రేట్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు బిగ్ బాస్కెట్ కో ఫౌండర్ అభినవ్ చౌదరి ప్రకటించారు. అయితే ఇది 2018 మార్చి తర్వాతి లెక్క అంటూ వివరించే ప్రయత్నం చేశారాయన. దీనికి రీచ్ కావాంటే చిన్న నగరాలకు విస్తరించడమే మార్గంగా చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో బిగ్ బాస్కెట్ ఎక్స్ ప్రెస్ సేవలను ప్రారంభించింది. ఆర్డర్ ఇచ్చిన 60 నిమిషాల్లో డెలివరీ ఇచ్చే ఈ ఎక్స్ ప్రెస్ సేవలను భాగ్యనగర వినియోగదారులు ఉపయోగించుకోవాలని చౌదరి కోరారు.

“సమీప భవిష్యత్ లో 120మిలియన్ డాలర్ల ఫండింగ్ సాధిస్తాం.” చౌదరి

రోజుకి 30వేల ఆర్డర్లతో దూసుకుపోతున్న బిగ్ బాస్కెట్ తొందరలోనే ఫండ్ ను రెయిజ్ చేయబోతుందన్న వార్తను ముందే వెల్లడించారాయన. 2017-18 సంవత్సరాలు తమ కంపెనీకి బ్రేక్ ఇవెన్ కానున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో 30 నగరాల్లో తమ సేవలను విస్తరణ పూర్తి కానుందని, ఇందులో 19 చిన్ననగరాలు(టైర్ 2) ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్ ఈకామర్స్ సెగ్మెంట్ అంతా టైర్ టూ సిటీల్లోనే ఉన్నట్లు జోస్యం చెప్పారు.

బిబిఎక్స్ ప్రెస్

సొంత లాజిస్టిక్ వ్యవస్థతో వచ్చిన బిగ్ బాస్కెట్ ప్రాడక్ట్ ఇది. ఎక్స్ ప్రెస్ సేవలను వినియోగించుకునే కస్టమర్లు ఫుల్ సర్వీసు డెలివరీని కూడా వాడుకునే వెసులు బాటు కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి3వరకూ పేటిఎం ద్వారా ఈసేవలను వినియోగించుకునే కస్టమర్లకు మొదటి ఆర్డర్ లో 20శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి మెట్రో నగరాలకే పరిమితమైన ఈ సేవలు భవిష్యత్ లో టైర్ టూ సిటీలకు కూడా విస్తరిస్తామని చౌదరి చెప్పుకొచ్చారు.

“8మెట్రో నగరాల్లో బిబి ఎక్స్ ప్రెస్ సేవలు.” చౌదరి

ఈ ఏడాది ముగిసే సమయానికి మొత్తం ఎనిమిది నగరాల్లో ఈ సేవలను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కొనుగోలు దారుడి అవసరాల బట్టి మరింత వేగంగా డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినట్లు చెప్పారాయన. దీనికోసం ప్రత్యేకంగా డార్క్ స్టోర్ లను ఏర్పాటు చేస్తోంది బిగ్ బాస్కెట్.

100బిలియన్ డాలర్ల వ్యాపారం

రెండేళ్లలో తమ వ్యాపార విస్తరణ పూర్తయితే తము 100బిలియన్ డాలర్ల వ్యాపారానికి చేరుకుంటామని చౌదరి చెప్పుకొచ్చారు.

“గ్రాసరీలోమార్జిన్ తక్కువగా ఉంటుంది.” చౌదరి

ఆన్ లైన్ గ్రాసరీ మార్కెట్ లో మార్జిన్ పెద్దగా ఉండదంటున్నారాయన. తాము అనుకున్నట్లు 30 నగరాల్లో పూర్తిస్థాయిలో సేవల వినియోగం జరిగితే నెలకుతమ ఆదాయం పదివేల కోట్లుగా ఉండబోతుందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చికల్లా 27నగరాల్లో సేవలను వినియోగంలోకి తీసుకు రావాలని బిగ్ బాస్కెట్ చూస్తోంది. ప్రస్తుతానికి 2బిలియన్ డాలర్ల టర్నోవర్ చేస్తోన్న బిగ్ బాస్కెట్ దీన్ని పదిరెట్లు మార్చాలని ప్రణాలిక చేస్తోంది.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ఏర్పాటు

బిగ్ బాస్కెట్ మరిన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది. బిబి ఎక్స్ ప్రెస్ సేవలున్న చోట డార్క్ స్టోర్స్ పనిచేయనున్నాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల సంఖ్య గణనీయంగా పెంచనున్నారు. కిరణాతో పాటు ఇతర ప్రాడక్టులు కలిపి దాదాపు 14 వేలకు పైగా ఉత్పత్తులు బిగ్ బాస్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. స్పీడ్ డెలివరీపై బిగ్ బాస్కెట్ కస్టమర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఏర్పాటు చేసిందే ఈ బిబి ఎక్స్ ప్రెస్. అయితే వాటితో పాటు మరిన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకు రావడానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల అవసరం ఉందని చౌదరి అంటున్నారు.

“ఫుల్ సర్వీసు డెలివరీ కోసం వ్యాన్ లను వినియోగిస్తున్న బిగ్ బాస్కెట్, ఎక్స్ ప్రెస్ సర్వీసు కోసం బైక్ లను వాడుతుందని ముగించారు చౌదరి”

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik