దేశ సరిహద్దులో కాపలాకాసే రోబో సైనికుడిని సృష్టించిన ఇంటర్ కుర్రాడు

0

బుర్ర ఖాళీగా వుండొద్దు. ఎప్పుడూ ఏదో ఒక ఐడియా జనరేట్ అవుతూ వుండాలి. నిరంతరం ఒక తపన అగ్నిలా జ్వలిస్తూ వుండాలి. అప్పుడే ఆలోచనలు ఆవిష్కరణలై రెక్కలు తొడుక్కుంటాయి. పదిహేడేళ్ల నీల్మాధబ్ సృష్టించిన కృత్రిమ మేథస్సు మహామహా సైంటిస్టలనే సవాల్ చేసింది. ఆ కుర్రాడు ఏకంగా దేశ సరిహద్దులో కాపలాకాసే రోబో సైనికుడినే సృష్టించాడు.

ఒడిశాకు చెందిన నీల్మాధబ్ ఆర్టిఫీషియల్ ఆల్గారిథం ఆధారంగా హ్యుమనాయిడ్ రోబో తయారు చేశాడు. ఆటమ్ 3.7 అనే ఈ రోబో బోర్డర్ లో సైనికుడిలాగే కాదు..ఇతర రంగాల్లోనూ ఆరితేరింది. కావల్సిన వినోదాన్ని అందిస్తుంది. ఎడ్యుకేట్ చేస్తుంది. మాన్యుఫ్యాక్చరింగ్, డొమెస్టిక్ సర్వీసులు కూడా అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆటమ్ 3.7 రోబో మనం ఏం చెబితే అది చేస్తుంది.

తలానగర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నీల్మాధబ్ ఏడాది కాలంగా రోబో తయారీలో నిమగ్నమయయ్యాడు. ఈ ప్రాజెక్టుకు అయిన ఖర్చు దాదాపు నాలుగు లక్షలు. రోబో ఎత్తు 4.7 అడుగులు. బరువు 30 కిలోలు. 14 సెన్సర్లు, ఐదు రిమోట్ కంట్రోల్ సిస్టమ్స్ ద్వారా రోబో పనిచేస్తుంది.

నీల్మాధబ్ చిన్నప్పటి నుంచీ సైన్స్ అంటే పడిచచ్చేవాడు. ఎప్పుడు చూసినా సైన్స్ రిలేటెడ్ టాయ్స్ తయారుచేస్తూ కనిపించేవాడు. మూడో తరగతిలోనే తన మొట్టమొదటి సైన్స్ ప్రాజెక్ట్ సొంతంగా చేశాడు. ఆరో క్లాసులో ఉండగా అతని హ్యుమనాయిడ్ రోబో తయారుచేయాలన్న ఆలోచన వచ్చింది. అప్పుడంత మెచ్యూరిటీ లేక విఫలమయ్యాడు. అప్పడే అనుకున్నాడు.. ఎప్పటికైనా రోబోని తయారుచేసి చరిత్ర సృష్టించాలని.

కొడుకు ఆలోచనల తీరు చూసి తండ్రి కాస్త నిరాశ పడ్డాడు. వయసుకు మించి కష్టపడుతున్నాడేమో కొంత సంశయించాడు. నీల్మాధబ్ మాత్రం నిరుత్సాహ పడలేదు. ఇంటర్నెట్ సాయంతో బుర్రకు మరింత పదును పెట్టాడు. కుర్రాడి పట్టుదల చూసి ముచ్చపడ్డ తండ్రి.. ప్రొసీడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఎంత ఖర్చయినా భరిస్తా.. ఆకాశమే హద్దుగా దూసుకుపో అని భుజం తట్టాడు.

నీల్మాధబ్ తయారుచేయాలనుకున్న మల్టీపర్పస్ రోబో ఖర్చు ఊహించదానికంటే ఎక్కువే అవుతుంది. అందుకే రోబోటిక్స్ రంగంలో ఉన్నత చదువులు చదవాని లక్ష్యంగా పెట్టుకున్నాడు. రోబో ఒక్కటే కాదు.. మహిళల భద్రత కోసం ప్రత్యేకమైన డ్రోన్ కూడా తయారుచేయాలన్న ఆలోచన అతని మనసులో బలంగా ఉంది. 

Related Stories