పదకొండో తారీఖు.. పాతిక లక్షల మొక్కలు

0

భవిష్యత్ తరాల బాగు కోసం ఇప్పుడు చెట్లు నాటాలి. వందలు ఏళ్లు గడిచినా అశోకుడు చెట్లు నాటించాడని చెప్పుకుంటున్నామంటే చెట్లను పెంచడం కంటే గొప్ప పని ఈప్రపంచంలో బహుశా మరొకటి లేదేమో. మానవ మనుగడ సాధ్యం పచ్చదనంతోనే. చెట్లనుంచి ఆక్సీజన్ విడుదలైతేనే మనవాళి జీవించగలదు. మన దేశంలో రోజురోజుకూ అడవుల శాతం తగ్గుతూ వస్తోంది. పట్టణీకరణ దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. అయితే కెనడా లాంటి దేశాల్లో పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా చెట్ల పెంపకం ఓఉద్యమంగా తీసుకోవడం మనం చూడొచ్చు. అంటే పట్టణీకరణ సాధ్యపడినప్పటికీ అడవులు పెంపకం సాధ్యపడుతుందనేది ఆ దేశం నిరూపించింది. ఇప్పుడు మన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు చెట్ల పెంపకంపై ముందుకు రావడం శుభపరిణామం.

 తెలంగాణ హరిత హారానికి అనూహ్య స్పందన వచ్చింది. ఉద్యోగులు, స్కూల్ పిల్లలు, సెలబ్రిటీలు అంతా కలసి రావడంతో అనుకున్న దానికంటే ఎక్కువగానే ఈ కార్యక్రమం సక్సెస్ అయిందని చెప్పాలి. దాదాపు నెలన్నర నుంచి ప్రభుత్వం చేసిన ప్రచారానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కలసి రావడం పాతిక లక్షల మొక్కలు నాటే కార్యక్రమం పట్టుమని అయిపోయింది.

ఆల్ టైం రికార్డ్

ఒకే రోజు ఇంత పెద్ద మొత్తంలో మొక్కలు నాటడం బహుశా దేశ చరిత్రలోనే ప్రధమం అని ఐటి మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ బయోడైవర్సిటీ వద్ద హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న కెటిఆర్ తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు.

“హైదరాబాద్ లో 25లక్షల మొక్కలు నాటడం రికార్డే,” కెటిఆర్

హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత భారీ స్థాయిలో మొక్కలను నాటడం రికార్డ్ బ్రేకింగ్ అని కెటిఆర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం తరపునుంచి ఎంత మద్దతున్నప్పటికీ జనం కలసి రావడం విశేషమని అన్నారాయన. రాష్ట్ర గవర్నర్ తమ ఆహ్వానాన్ని మన్నించి తమతో కలసి రావడం ఆనందాన్నిచ్చిందని కెటిఆర్ అన్నారు. ఐటి మంత్రితో కలసి గవర్నర్ మొక్కలను నాటారు. గతంలో భాగ్యనగరాన్ని గ్రీన్ సిటీ అనే వారని. తిరిగి ఆ ట్యాగ్ ని తొందరలోనే పొందుతుందని నరసింహన్ అన్నారు.

మొక్కలు నాటిన చిరంజీవి, సెటబ్రిటీలు

ఏ కార్యక్రమం సక్సెస్ కావాలన్నా సెలబ్రిటీలు కలసి రావాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో టాలీవుడ్ సెలబ్రిటీలు మొక్కలు నాటారు. చిరంజీవి,అల్లు అర్జున్, రకుల్ తో పాటు మరికొంత మంది సెలబ్రిటీలు మొక్కలు నాటి సోషల్ మీడియా ద్వారా పెద్ద ప్రచారం కల్పించారు.

“హైదరాబాద్ వాతావరణ మార్పులకు కారణం మొక్కలను నరికేయడమే, కొత్తవి నాటి దాన్ని సమతుల్యం చేద్దాం,” చిరంజీవి

సామాజిక సేవాకార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం చేపట్టని ఈ కార్యక్రమంలో పాల్గొని అందరినీ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. టాలీవుడ్ ప్రముఖులు ఇతర సెలబ్రిటీలు హరితహారంలో మొక్కలు నాటారు.

జనంలో అనూహ్య స్పందన

ఇటీవల ఉష్ణోగ్రత ప్రభావమో ఏమో కానీ జనం చాల చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ వ్యాన్ ల ద్వారా ప్రతి కాలనీకి మొక్కలను అధికారులు సప్లై చేశారు. ఆ తర్వాత వాటిని నాటే కార్యక్రమం జనం చూసుకున్నారు. నగరంలో పదిలక్షలకు పైగా మొక్కలు నాటగా, నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో పదిహేను లక్షల మొక్కలను నాటారు. ఉదయం నుంచి అంతా చేతులు కలపి ఈ కార్యక్రమాన్ని సూపర్ సక్సెస్ చేశారు. రెండో విడత కార్యక్రమం ఎప్పుడొస్తుందా అనేలా జనం దగ్గర నుంచి స్పందన రావడం విశేషం. అయితే ఇది ఒక అలవాటుగా మారిపోవాలి. అనవసరంగా చెట్లను నరకడమనే అలవాటుని పూర్తిగా మరచిపోవాలి. ఇది ఒక్క హైదరాబాద్ నగరానికే కాకుండా ఇతర పట్టణాలకు వ్యాపించాలి. హరిత హారంలో రాష్ట్రం చూపిస్తోన్న చొరవ దేశ వ్యాప్తం కావాలని

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories