మీరు పోయెట్రీ రాస్తారా? అయితే మమ్మల్ని సంప్రదించండి!

-సాహితీ సేవ చేస్తోన్న ఇద్దరమ్మాయిలు-ముంబైలో పోయెట్రీ క్లబ్ ఏర్పాటు-జనంనుంచి వస్తోన్న విశేష స్పందన-పెద్ద పెద్ద ఈవెంట్లు చేయడానకి ప్రణాళిక

0

ఇఫ్ ఐ షుడ్ హేవే డాటర్(నాకే గనక కూతురుంటే) అనే ఒ అందమైన వీడియో చూసిని తర్వాత మనం కూడా గేయ రచయితగా మారాలనే ఆరాటం కచ్చితంగా పెరుగుతుంది . ఇప్పుడిప్పుడే కళలు, సాహిత్యం, నాటికలు ముంబైలాంటి నగరాల్లో తనదైన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాయి. విస్తరించడానికి మాత్రం టైం పడుతుంది. అందుకే భవిష్యత్ మార్కెట్ ను ఊహించి తృప్తి శెట్టి, అకితా షాలు ఓ పోయెట్రీ క్లబ్ ను ప్రారంభించారు.

ది పోయెట్రీ క్లబ్, ముంబై
ది పోయెట్రీ క్లబ్, ముంబై

సీఏ చదువుకునే రోజుల్నుంచే ఈ ఇద్దరు మంచి స్నేహితులు. ఇద్దరికీ కవిత్వం అంటే మక్కువ. డిబేటింగ్ అండ్ లిటరరి సొసైటికి అకితా కార్యదర్శి. తృప్తి రోటరాక్ట్ క్లబ్ కు ఎడిటర్. జూలై 2013 లో వీళ్లిద్దరూ కలసి ది పొయెట్రీక్లబ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో గేయ రచయితలు కలసి వారి భావాలను పంచుకొని ఎదగడానికి అవకాశం కల్పిస్తారు. ముంబైలో జరిగే ఈవెంట్స్ లలో పాల్గొనే పోయెట్లు పెర్ఫామ్ చేయడానికి సిగ్గు పడుతున్నారు. వారందరినీ ఒక చోట చేర్చడం ద్వారా వారిలో ఆత్మవిశ్వసం నింపేలా ఈ క్లబ్ సాయం అందిస్తుంది. కొన్ని గేయాలతో కూడిన వీడియోలను తీసి .. లైవ్ లో చేయలేని ఎన్నో గొప్ప విషయాలను చూపించే అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని వినియోగించుకోడానికి మా క్లబ్ లో జాయిన్ అవుతున్నరని తృప్తి తెలిపారు.

వాస్తవానికి ముంబైలో ఈవెంట్లు చేసే కంపెనీలకు పోటీ పడేలా చేయాలనే ఉద్దేశంతో క్లబ్ స్థాపించలేదు. దాన్నొక కమ్యూనిటీ లాగ దీన్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. కమ్యునిటీలో ప్రతి ఒక్కరూ ఎదగాలనేది వారి ప్రధాన ఉద్దేశం. సెషన్లలో అందరి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం క్లబ్ లో ముఖ్యమైన విషయం. ఎవరెలాంటి భాషలో రాసినా సెషన్లలో పాల్గోవచ్చు. ఇక్కడ ఒకే ఒక్క రూలుంది. ఎవరి దగ్గరైనా గేయం ఉంటే వారు రావొచ్చు. ఫీడ్ బ్యాక్ కూడా ఉంటుంది. అయితే ఈ సెషన్ కు ఎంట్రీ ఫీజుని కూడా పెట్టలేదు. అందరికీ అందుబాటులో ఉండేలా సెషన్ జరగాలనే ఉద్దేశంతో భవిష్యత్తులో కూడా ఎంట్రీ ఫీజు పెట్టబోమని వారు ప్రకటించారు.

నెలనెలా జరిగే సెషన్లతో క్లబ్ ముందడుగులు వేస్తోంది. భాంద్రాలోని పింట్ రూంలో సెషన్లు జరుగుతున్నాయి. ఇంతకు ముందే చెప్పినట్లు ఈ సెషన్ లో ఎంట్రీ ఫీజు, కవర్ చార్జ్, బూజ్ ని కొనాల్సిన కంపల్సరీ లాంటివి అసలు లేవు. మొత్తం ఉచితమే.  

ఏక్తా గులేచా అనే మార్కెటింగ్ పర్స్ న్ ముంబైలో ఉన్న లిటరరీ గ్రూపులను వెతుక్కుంటూ ఉంటే వీరిద్దరూ కలిసారు. తర్వాత జూహూలోని కైఫి అజ్మీ పార్కులో, అంధేరిలో స్నేహితురాలి ఇంటిలో ఉన్న లాన్ లో సెషన్లను కండక్ట్ చేశారు. తర్వాత పోయెట్రీ క్లబ్ సెషన్ ఏర్పాటు చేయాలని మాకు ఆహ్వానాలు అందాయి. తర్వత దాని విలువ తెలిసొచ్చింది. అని క్లబ్ ఫౌండర్లు వివరించారు. ఫేస్ బుక్ పేజీతోపాటు యూట్యూబ్ చానల్ ద్వారా ఫౌండర్లు సెషన్ల గురించి చెబుతుంటారు. భవిష్యత్ లో భారీ ఈవెంట్లు కండక్ట్ చేద్దామని చూస్తున్నాం అంటున్నారు. ఇందులో ప్రేక్షకులకు ఫ్రీ ఎంట్రీ ఇవ్వాలనేది వారి ఆలోచన. స్కూళ్లు, కాలేజీల్లో కూడా ప్రత్యేక వర్క్ షాపులు కండక్ట్ చేయాలనుకుంటున్నాం. విద్యార్థుల్లో కూడా రచనా శక్తి ఎక్కువే. దానికి సాయం అందించి వారిని తీర్చిదిద్దే కార్యక్రమం చేపడతామని అంటున్నారు.

భారత దేశంలో కవిత్వం అనేది ఓ మహా సముద్రం కావొచ్చు. కానీ ఈ అమ్మాయిలు సాహితీ రంగానికి చేతనైన సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో క్లబ్ ని ప్రారంభించారు. రచనా రంగంపై ఉన్న మక్కువతో వీరిద్దరు చేస్తున్నఈ ప్రయత్నానికి చాలామంది నుంచి ప్రశంసలు వస్తున్నాయి. మీరెప్పుడైనా ముంబై వెళితే టిపిసి సెషన్ ఎక్కడైనా జరుగుతుందేమో తెలుసుకుని అటెండ్ అవ్వండి. మంచి ఎక్స్ పీరియెన్స్.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik