సమానత్వం కోసం ఆ ఇద్దరమ్మాయిలు !!

సమానత్వం కోసం ఆ ఇద్దరమ్మాయిలు !!

Monday December 14, 2015,

3 min Read

సమానత్వం సాధించాలంటే పోరాటాలు చేయాలా? కూర్చొని మాట్లాడుకుంటే సరిపోదా? జండర్ ఈక్వాలిటీ లాంటి విషయాలపై స్కూల్ రోజుల నుంచే ఓ మంచి ఒరవడి నేర్పిస్తే ఉన్నత మైన భావాలు కలిగిన భవిష్యత్ తరాలను చూడొచ్చు. ఇదే విషయాన్ని ప్రచారం చేస్తూ సామాజిక మార్పుకోసం పనిచేస్తోంది ‘రూబారూ’ అనే సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా గతేడాది ఏర్పాటుచేసిన ఈ సంస్థ స్కూళ్లు, ఇతర విద్యా సంస్థల్లో ప్రత్యేక మైన సెషన్స్ నిర్వహిస్తూ విద్యార్థుల్లో సమానత్వ భావాలను పెంచుతోంది.

“కొత్తతరానికి, చిన్నారులకు నేర్చుకోడానికి ఓ అవకాశం కల్పించాలి, దానికొక ప్లాట్ ఫాం క్రియేట్ చేయాలనేదే మా ఉద్దేశం” మోనిష వేమవరపు

మోనీష రూబారూకి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తోన్న సంస్థ తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా స్కూళ్ల లో నేర్చుకోడానికుండే ప్రతి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని చూస్తోంది. చిన్నారుల రక్షణ్ దేశ భవిష్యత్ రక్షణగా భావిస్తోన్న ఈ సంస్థ ఇదే అజెండాతో ముందుకు పోతోంది.

image


ఇది మొదలు

2013లొ ఓ ఎన్జీఓ ప్రారంభించాలని అనుకున్నట్లు మొనిష చెప్పుకొచ్చారు. అయితే ముందుగా ఆర్గనైజేషన్ ప్రారంభించే బదులు మనం చేసే పని అందరికీ చెప్పి దాన్ని చేస్తూ సాధకబాధకాలు తెలుసుకున్నారు. 2014 జనవరికి ఎలాంటి ఎన్జీఓ ప్రారంభించాలనే దానిపై క్లారిటీ వచ్చింది. చిన్నారులకు లెర్నింగ్ స్పేస్ ఇవ్వాలనేది దీని అజెండాగా మార్చారు. ఆ తర్వాత మోనీషాతో పాటు నేహ చేతులు కలిపారు. ఇప్పుడు 2000లకు పైగా సభ్యులతో ఈ సంస్థ దూసుకు పోతోంది. ఢిల్లీకి చెందిన ప్రవ అనే స్వచ్ఛంద సంస్థ దీనికి మెంటార్‌షిప్‌ చేస్తోంది. ఫండింగ్ విషయంలో సూచనలు, సలహాలను అందిస్తోంది.

“చాలా స్వచ్ఛంద సంస్థల సహాయ సహకారాలతో మేం పనిచేస్తున్నాం. ఏ ఒక్కరి వల్లనో అన్ని పనులు కావాలంటే కష్టమే” మోనిష

ప్రస్తుతానికి స్కూళ్లలో ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్న సంస్థ మరింత విస్తరించాలని చూస్తోంది. కానీ టార్గెట్ మాత్రం చిన్నారులే అంటూ చెప్పుకొచ్చారు మోనీష.

image


రూబారూ చేస్తున్న కార్యక్రమాలు

  1. విద్యార్థి దశ నుంచే చిన్నారులు స్కూలు విద్యతో పాటు జీవిత పాఠాలు చేర్చుకోవాలి. దీనికోసం తమ చుట్టుపక్కల ఉన్న పరిసరాలతో పాటు ఇతర వియాలపై అవగాహన కల్పిస్తారు.
  2. ఎకడమిక్ లెర్నింగ్ తోపాటు ఎక్స్ పరిమెంటల్ లెర్నింగ్ ను ప్రోత్సహించడం ఈ సంస్థ లక్ష్యం.
  3. స్కూళ్లలో వర్క్ షాపులు, క్యాంపులు, ఫిల్మ్ స్క్రీనింగ్ లాంటి యాక్టివిటీలను ఏర్పాటు చేస్తారు.
  4. టీచర్లు,పేరెంట్స్, విద్యావేత్తలతో ఓ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. వారి అభిప్రాయాలను తీసుకొని భవిష్యత్ లీడర్స్ ని తయారు చేయాలనేది టార్గెట్ గా పెట్టుకున్నారు.
  5. సమానత్వం కలిగిన సమాజం స్థపన కోసం స్కూళ్ల నుంచే చిన్నారులకు ప్రత్యేక పాఠాలు చెబుతారు.
  6. స్కూల్లో నేర్చుకునే విషయంతో పాటు పరిసరాలను నుంచి స్వయంగా నేర్చుకునే అవకాశాన్ని ఇవ్వడం వీరి లక్ష్యం.

రూబారూ టీం

రూబారూ లో మోనీషా వేమవరపు కో ఫౌండర్ , సీఈఓగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాదీ అయిన మోనీషా ఢిల్లీలో నిఫ్ట్ నుంచి డిగ్రీ పొందారు. తర్వాత గ్లోబల్ ఎక్స్ చేంజ్‌ కార్యక్రమంలో భాగంగా 3నెలలు యూకే, 3నెలలు రాజస్తాన్ లో ఓ మారుమూల పల్లెలో ఉన్నారు. అనంతరం కొన్ని ఎన్జీఓలతో కలసి పనిచేశారు. తను కూడా సంస్థను ప్రారంభించాలనుకునన్నది అప్పుడే. చిన్నారులకు నేర్చుకునే అవకాశం ఇచ్చే ప్లాట్ ఫాం కల్పించాలనే ఉద్దేశంతో రూబారూని ప్రారంభించారు. ఇండోర్ కేంద్రంగా ప్రారంభమైన అన్హద్ ప్రవాకు ఆమె వ్యవస్థాక సభ్యురాలిగా ఉన్నారు. బ్రిటిష్ కౌన్సిల్ 2010 లో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ క్లైమేట్ ఛాంపియన్ లో పాల్గొన్నారు. నేహా స్వైన్ రూబారూకి మరో కోఫౌండర్. ఒడిషాకు చెందిన నేహా బెంగళూరు క్రిస్ట్ కాలేజీ నుంచి డిగ్రీ పొందారు. అనంతరం డిఎస్ఎస్‌డబ్ల్యూ ఢిల్లీ నుంచి సోషల్ వర్క్ పై మాస్టర్ డిగ్రీ పొందారు. ఢిల్లీలోనే ప్రవా సంస్థలో ప్రొగ్రాం కో ఆర్డినేటర్ గా పనిచేశారు. అప్పుడే మోనీషాతో పరిచయం ఏర్పడింది. వీళ్లద్ది సంస్థ రూబారు రూపుదాల్చుకుంది. వీరితో పాటు సుభాషి ద్వివేది, స్వైర సకారియా గాంధి, గాయత్రి గాజుపాక ఎగ్జిక్యూటివ్ టీంలో ఉన్నారు. హేమఖత్రి, నగ్మ అబిది,రమీజ్ ఆలం, ఇషాని సేన్, అభినవ్ గుప్త, రితిక కునాలు ఎడ్వైజరీ టీంలో ఉన్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

రూబారూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోన్న సంస్థ. నగరంలోని అన్ని స్కూళ్లకు సేవలన విస్తరించాలని చూస్తోంది. చాలా స్కూళ్లు ఈ సంస్థకు ఫండింగ్ అందిస్తున్నాయి. ఆదాయ వనరులను మరింత పెంచితే మరిన్ని స్కూళ్లకు ఉచితంగా సేవలను అందించడానికి ప్రణాలిక చేస్తున్నారు. టీంని కూడా విస్తరించాలని చూస్తున్నారు. మరిన్ని నగరాలకు సేవలను విస్తరించాలని చూస్తోంది. ఫెలోషిప్స్ లాంటి కార్యక్రమాలను స్కూళ్లతో పాలు అన్ని విద్యాలయాల్లో ఏర్పాటు చేయాలని చూస్తోంది.

image


  1. కమ్యూనిటీ డిబేట్స్ లను ఏర్పాటు చేసి దానిపై పూర్తి అవగాహన తీసుకు రావాలి చూస్తున్నారు.
  2. అందరికీ సోషల్ స్పేస్ కల్పించడానికి మరిన్ని కార్యక్రమాలను చేపడతామన్నారు.
భవిష్యత్ తరాల్లో సమానత్వం పై పూర్తి అవగాహణ కల్పించగలిగితే అంతకంటే పెద్ద లక్ష్యం ఇంకేముంటుందని నవ్వుతూ ముగించారు మోనీష