జొన్న బిస్కెట్లకు కార్పొరేట్ రంగులద్దిన హైదరాబాదీ కంపెనీ

స్థానిక రుచులకు కార్పొరేట్ హంగులు దిద్దుతున్న కంపెనీ...జొన్న, రాగులతో నోరూరించే రుచికరమైన వంటకాలు...

జొన్న బిస్కెట్లకు కార్పొరేట్ రంగులద్దిన హైదరాబాదీ కంపెనీ

Saturday June 06, 2015,

4 min Read


ఆకలి తీర్చుకోవాలనే యోచనలో జంక్ ఫుడ్స్ తినేస్తూ.. ఆరోగ్యాన్ని పణంగా పెట్టేస్తున్నాం మనం. పాశ్చాత్య పోకడలను నరనరాన జీర్ణించేసుకుని పిజ్జా, రెడ్‌బుల్ కాంబో వంటి డైట్ తీసుకుంటూ నానా సమస్యలను నెత్తికి తెచ్చుకుంటున్నాం. సాంకేతికంగా ఎంతో పురోగమిస్తున్న మనం.. ఆరోగ్యం కాపాడుకోవడానికి ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం కానీ ఆహార విషయంలో మాత్రం జంక్ పుడ్స్‌కు బానిసలమై బతికేస్తున్నాం.

image


ఈ జంక్ ఫుడ్స్‌కు చెక్ పెట్టేందుకు HeartandSoul.co.inని జూలై 2012 లో ప్రారంభించారు అర్జున్. పుడ్ అండ్ టెక్నాలజీపై ఇంటిలోనే రీసెర్చి, డిజైన్ చేసి స్నాకింగ్ ఇండస్ట్రీకి శ్రీ కారం చుట్టారు. పిండితో తయారు చేస్తున్న ఈ పదార్ధాలు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే అల్పాహారాన్ని సిద్ధం చేస్తోంది అర్జున్ అండ్ టీమ్. రాగి, జొన్నలతో పాటు స్థానికంగా లభించే పదార్థాలతో ఫుడ్ ఐటెమ్స్ రుచిగా తయారు చేయడం వీళ్ల స్పెషాలిటీ.

అర్జున్ , ఫౌండర్, సిఇవో హార్డ్ అండ్ సోల్

అర్జున్ , ఫౌండర్, సిఇవో హార్డ్ అండ్ సోల్


లోకల్ మార్కెట్లో అధిక శాతం నిజాయితీ గల వ్యాపారులు లేకపోవడంతో పాటు, అవగాహనా రాహిత్యమూ మరో సమస్యగా తయారైంది. పోషక విలువలు, ఆరోగ్యకరమైన 'వంటి పదాలు ఉన్నాయంటూ లేబుల్స్‌లో చేరుస్తున్నప్పటికి అవి కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.

మరో వైపు ఆహార ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలు స్థానిక రుచులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇలాంటి లోకల్ ఫ్లేవర్‌ కోసమే Heartandsoul.co.in ప్రాణం పోసుకుంది. రసాయనరహిత ఉత్పత్తులతో వన్ స్టాప్ షాప్ ప్రారంభించారు.

''న్యూట్రిషియస్, రుచికరమైన, ఆరోగ్యవంతమైన ఆహారం 'ఆహా' అనే స్థాయిలో ఉండాలని కోరుకుంటాము. వివిధ రకాల ప్యాక్ మీద ఉండే కంటెంట్స్ చూసి చాలా హెల్తీ ఫుడ్ అని భ్రమపడతాము. వాస్తవానికి అందులో ఆ పదార్థాలే ఉండవు. వాటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆరోగ్యవంతమైన ఆహార పదార్ధాల తయారీకి నడుం బిగించాము. కంపెనీ తయారు చేసే ఫుడ్ ఐటెమ్స్ ఆరోగ్యంతో పాటు రుచి ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు'' అర్జున్.

హార్ట్ అండ్ సోల్ కంపెనీ అభివృద్ధి చెందడానికి కుటుంబ సభ్యులతో పాటు, స్నేహితులు నిధులు సమకూర్చారు. ట్రయిల్ రన్‌గా ఫస్ట్ సెంటర్‌ను హైదరాబాద్ శివార్లలో ప్రారంభించారు. ఈ రంగంలో ఉన్న ఎదుగదలను దృష్టిలో ఉంచుకొని అనుభవం ఉన్న వారిని తీసుకోవడమే కారణం. వాళ్ల మార్గదర్శకత్వంలో హైదరాబాద్ లోకల్ ఫ్లేవర్‌తో ఆహార పదార్ధాలు తయారు చేస్తున్నాము. అయితే బెంగుళూర్, ముంబై ల్లాగా హైదరాబాద్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాల్సి ఉందని అర్జున్ అభిప్రాయపడతున్నారు.

రాగులు, జోన్నలతో  స్నాక్స్

రాగులు, జోన్నలతో స్నాక్స్


దక్షిణాఫ్రికాలో బీజం

సంస్థ నిర్వాహకుడు అర్జున్ డర్ తల్లి భారతీయురాలు, తండ్రి అమెరికన్. ఇతర పారిశ్రామికవేత్తలా కాకుండా అసాధరణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అర్జున్. ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ధైర్యంతో ముందుకు వెళ్లేవారు. కార్పొరేట్ వ్యవస్థలో కుటుంబ పరంగా వస్తున్న వ్యాపారం అభివృద్ధి చేయాలనుకున్నారు. ప్రధానంగా తెలుగు మాట్లాడే ప్రాంతంలో పెరగడంతో స్థానికంగా లభ్యమయ్యే ఆహారం, దాని రుచులుపై అనుకోకుండానే అతనికి ప్రేమ పెరిగింది. అర్జున్ ఉన్నత విద్య కోసం సౌతాఫ్రికాలోని కేప్ టౌన్ యూనివర్శిటీకి వెళ్లారు. అక్కడే పీజీలో సోషల్ ఆంత్రోపాలజీ, పాలిటిక్స్ , స్పానిష్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. సౌతాఫ్రికాలో మూడేళ్లు ఉన్న ఆయనకు భారత్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య ఉన్న సారూపత్యలు, సంస్కృతికి దగ్గర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అలా ప్రారంభమైన ఆలోచన హైద్రాబాద్ లో వ్యాపారం చేయడానికి కారణమైంది.

ఇక్కడ స్థానికంగా లభించే గింజలైన జొన్న పై పరిశోధనలు చేసి, వాటిని మరింతగా అభివృద్ధి చేశారు. వాటిని ఎలా పండించాలో తెలుసుకొనే పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఇంకా జొన్నరొట్టెలు చప్పటి ఆహారం కావడంతో వాటికి తగిన పదార్ధాలను కలిపి, కొత్త ఉత్పత్తికి ప్రాణం పోశారు. జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి, అది ప్యాకింగ్‌లో ఉన్నప్పుడు ఆక్సిజన్, తేమ కనీస స్థాయిలో ఉంచాల్సి ఉంటుంది. హార్ట్ అండ్ సోల్ ఇప్పుడు నాణ్యత గల జొన్న క్రాకర్లు అందిస్తుంది. కంపెనీ రుచికరమైన,ఆరోగ్యకరమైన జొన్నల పిండితో రకరకాల కాంబినేషన్‌లతో పదార్థాలు తయారు చేస్తున్నారు.

కంపెనీ తయారు చేసిన జొన్న బిస్కెట్లు

కంపెనీ తయారు చేసిన జొన్న బిస్కెట్లు


జొన్న క్రాకర్స్ ఉత్పత్తి గురించి అర్జున్ ఇలా వివరిస్తారు.'' ఆకలి తగ్గిస్తుంది. అంతే కాదు జొన్నల్లో ఉండే పోషక విలువలు బలాన్ని చేకూర్చి పెడతాయి. భోజనంపై పెట్టే ఖర్చును తగ్గిస్తుంది. ఫైబర్ స్నాక్స్ జీర్ణక్రియలో పని చేయడానికి దోహదం చేయడంతో, ఏ పనిలో నైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది.HeartandSoul.co.in ఉత్పత్తుల శ్రేణి రకరకాలుగా ఉంది. జొన్నలతో రకరకాల స్నాక్స్ తయారు చేసి అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పిల్లలు ఇష్టపడే పిజ్జాలు, జొన్న కుకీలతో పాటు జొన్నల గంజి ఉచితంగా పంపిణీ చేస్తున్నము.''

అంతే కాదు సంస్థ కార్యకలాపాలను విస్తృత పరుచుకొనేందుకు.. పలు ప్రాంతాల్లో ఫ్రీ గా శాంపిల్స్ ఇస్తూ.... సర్వేలు నిర్వహించి వ్యాపారాన్ని విస్తృతం చేయడానికి సోషల్ మీడియాలో చేస్తున్న సర్వేల స్పందన తెలుసుకుంటూ మార్పులు చేస్తున్నారు. HeartandSoul.co.in సంస్థ.

జొన్న బిస్కెట్స్

జొన్న బిస్కెట్స్


ముఖ్యమైన లక్ష్యం ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారంపై అవగాహన కల్పించడం, పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే వారు చురుకుగా, తెలివిగా ఉంటారో తల్లిదండ్రులుకు వివరంగా చెప్పుకొస్తారు. అలా అని ఎక్కడో లభించే ఆహారం కాకుండా ఇండియన్ ఫ్లేవర్స్‌ను పరిచయం చేస్తామని అర్జున్ అంటారు.ప్యాకేజింగ్ రూపకల్పనలో హార్ట్ అండ్ సోల్ ఉత్పత్తులు అన్నింటిని స్థానికుల చేత చేయడం వల్ల న్యూట్రిషన్‌తో పాటు ట్రెడిషన్ పై అవగాహన వస్తుంది.

హైదరాబాద్ లో లభ్యమయ్యే స్థానిక రుచులతో ఆధారపడి ఉత్పత్తులను తయారు చేయడం వల్ల.. మార్కెట్ లో బ్రాండింగ్ ఈజీ అవుతుంది. Chikki (వేరుశెనగ, నువ్వులు, బెల్లం) చాయ్ (ఏలకులు, అల్లం, బెల్లం) వంటి రుచులు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఇంకా వాటికి దాల్చిన చెక్క, సుగంధ ద్రవ్యాలను కలపడంతో రుచికరంగా ఉంటుంది. తీపి కోసం ఎక్కువగా బెల్లాన్ని వాడతాము. మేము చేసే కాంబినేషన్లు ఎవ్వరి దగ్గర లభ్యం కావు.. అదే మా ప్రత్యేకతగా నిలుస్తోందని ఉత్పత్తి గురించి వివరిస్తారు అర్జున్. ఓ వైపు పిల్లలకు జంక్ ఫుడ్ పెడుతూ ఆరోగ్యం కోసం జిమ్ లకు తీసుకెళ్లే తల్లిదండ్రులకు ఇదే విషయాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని వివరించారు.

ఒక్కో అడుగు...

HeartandSoul.co.in కంపెనీ లక్ష్యం హైదరాబాద్ లో సూపర్ మార్కెట్స్, జిమ్స్ / ఫిట్నెస్ కేంద్రాలు, సోషల్ క్లబ్స్ గా నిర్ణయించుకున్నారు. ముందుగా భాగ్యనగరంలో బేస్ ఏర్పాటు చేసుకుంటే..ఇక దేశవ్యాప్తంగా రిటైల్ చైన్స్, ఆరోగ్య దుకాణాలు ఏర్పాటు పెద్ద పని కాదు. అయితే లక్ష్యం సాధించడానికి కొంత సమయం పడుతుంది. హడావిడిగా ఏదో చేయాలనే కాదు..క్వాలిటీ విషయంలో మాత్రం రాజీపడదలుచుకోలేదని వివరిస్తారు. ఈ రంగంలో పోటీకి సంబంధించి పెద్దగా బెంగ పడాల్సిన అవసరం లేదని అర్జున్ అంటారు. ఎందుకంటే జొన్నతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ఉంటాయి. ఇంకా మార్కెట్ లోకి రాగి ,జొన్న కలుపుకొని ఇంటర్నేషనల్ సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. అయితే వారు కాల్చిన జొన్నలను వినియోగిస్తారు. అవి ఆరోగ్య రీత్యా మంచిది కాదని సూచిస్తారు. హార్వర్డ్ స్కూల్ పబ్లిక్ స్టడీ ప్రకారం, భారత్ లో 2012-2030 నాటికి సరైనా ఆహారం లేక వివిధ వ్యాధుల బారిన పడే కారణంగా $ 6.2 ట్రిలియన్ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడే మీరు మీ చాయ్‌తో పాటు భోజనంలో Heart &Soul స్నాక్సే జవాబు అంటూ ముగిస్తారు.

website