ఆఫీస్ బాయ్ నుంచి ఆపరేషన్స్ మేనేజర్ దాకా..

‘‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు ’’ ఇది ఓ సినిమాలోని హిట్ పాట. కొంతమంది అదృష్టంతో పైకి వస్తే.. కొంతమంది కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు.. అలాంటివారిలో అశోక్ స్వైన్ ఒకరు.. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అశోక్ ఆఫీస్ బాయ్ నుంచి ఆపరేషన్స్ మేనేజర్ దాకా ఎదిగారు..

ఆఫీస్ బాయ్ నుంచి ఆపరేషన్స్ మేనేజర్ దాకా..

Wednesday May 06, 2015,

4 min Read

ఓ సంస్థ రోజువారి కార్యక్రమాలు చూసుకునేందుకు చురుకైన ఉద్యోగి అవసరం. అప్పుడే సంస్థ వ్యవస్థాపకులు కంపెనీ అభివృద్ధికి సంబంధించిన ఇతర పనులపై దృష్టి పెట్టే అవకాశముంటుంది. కాలిఫోర్నియా బ్యురిటో కంపెనీ కో ఫౌండర్ ధరమ్ ఖాల్సాకు అలాంటి మల్టీ టాలెంటెడ్ ఎంప్లాయి దొరికాడు. ఆఫీస్ బాయ్ నుంచి ఆపరేషన్స్ మేనేజర్‌గా ఎదిగిన అశోక్ స్వైన్ విజయగాధే ఇది.


కాలిఫోర్నియాలోని బ్యూరిటో మెక్సికన్ ఫుడ్ కంపెనీని బెర్ట్ మ్యూల్లెర్, ధరమ్ ఖాల్సా, గాలెన్ కొన్నెల్ అనే ముగ్గురు అమెరికన్లు స్థాపించారు. కాలిఫోర్నియా బ్యూరిటో కంపెనీ బ్రాంచ్‌ను తొలిసారిగా బెంగళూరులో 2012 అక్టోబర్ లో ప్రారంభించారు. 2014 కల్లా 7 స్టోర్లు, వందమంది ఉద్యోగులతో సంస్థ అభివృద్ధి చెందింది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా 500 స్టోర్లు ప్రారంభించడమే లక్ష్యంగా సంస్థ పని చేస్తోంది.

2013లో కాలిఫోర్నియా బ్యూరిటో కంపెనీలో ఆపరేషన్స్ మేనేజర్‌గా అశోక్ జాయినయ్యారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, కొత్త సమస్యలు తెలివిగా పరిష్కరించడం, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో కంపెనీ ఉద్యోగులు కాంట్రాక్టు ఉద్యోగులకు ట్రైనింగ్ క్లాసులివ్వడంతో పాటు ఆహార పదార్థాల దిగుమతి ఒప్పందాలు చేసుకోవడం అశోక్ స్వైన్ పని. ఇలాంటి డే టు డే ఆపరేషన్స్ తో అశోక్ పై ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ అది సంస్థ ఎదుగుదల అభివృద్ధికి ఉపయోగపడుతుంది.

image


‘‘స్ఫూర్తిని నింపే అశోక్ విజయ గాథ’’

ఒడిశాలోని పూరి అశోక్ స్వైన్ స్వస్థలం. వ్యవసాయమే జీవనాధారంగా బతికే ఉమ్మడి కుటుంబం నుంచి అశోక్ వచ్చారు. సొంతూరులోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఉత్కళ్ యూనివర్శిటీ నుంచి బీకాంలో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన అశోక్ కాలేజీ చదివే రోజుల్లో తల్లిదండ్రులపై ఆధారపడలేదు. తన స్నేహితుడితో కలిసి సొంతంగా ఓ బిజినెస్ ప్రారంభించారు. ఆఫీసులు, హోటళ్లు క్లీనింగ్ చేసే మెటీరియల్స్‌ను సొంతంగా తయారు చేసి అమ్మేవారు. ఈ వ్యాపారాన్ని సమర్ధవంతగా కొనసాగించాలనుకున్నా అప్పటికే మార్కెట్లో అలాంటి ప్రొడక్ట్స్‌తో ఉన్న పోటీ వారికి ఇబ్బందికరంగా మారింది.

‘‘ ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. డిగ్రీ తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ చేయాలనుకున్నా, నా కుటుంబ ఆర్ధిక పరిస్థితి దానికి సహకరించలేదు. ఇదే సమయంలో ఉద్యోగం కోసం 2004లో బెంగళూరు వెళ్లాను.’’


అశోక్ ఉద్యోగం కోసం చెప్పులరిగేలా బెంగళూరులో తిరిగారు. ఇంగ్లీష్ పై అంత పట్టు లేకపోవడంతో ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. చివరకు కాంట్రాక్ట్ పద్దతిన ఆఫీస్ బాయ్‌గా ఓ కంపెనీలో జాయిన్ అయ్యారు. తన చదువుకు ఉద్యోగానికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో తర్వాత ఆ ఉద్యోగం మానేశారు. రోజులో 12 గంటలు పనిచేస్తూ మిగతా సమయంలో స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులకు వెళ్లేవారు. ఇదే సమయంలో ఓ కంపెనీలో అకౌంట్స్ అసిస్టెంట్‌గా అశోక్‌కు ఉద్యోగ అవకాశం వచ్చింది. జీతం 3,500లే అయినా పని ఒత్తిడి మాత్రం బాగా ఉండేది.

image


2006లో ఫుడ్ ఇండస్ట్రీ వైపు అశోక్ అడుగులు పడ్డాయి. ఓ ఫుడ్ కంపెనీలో ఏరియా మేనేజర్‌గా జాయిన్ అయ్యారు. అక్కడ మంచి అనుభవం సంపాదించారు. 2013 డిసెంబర్ లో కాలిఫోర్నియా బ్యూరిటో కంపెనీలో ఏరియా మేనేజర్‌గా అశోక్ కు అవకాశం వచ్చింది. తన టాలెంట్‌తో ఆరు నెలల్లోనే ఆపరేషన్ మేనేజర్ గా ప్రమోషన్ పొందారు.

‘‘కాలిఫోర్నియా బ్యూరిటో కంపెనీలో అశోక్ ది కీలక పాత్ర.. అశోక్ రాకతో కంపెనీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. మెల్లగా కంపెనీ కార్యకలాపాలన్నీ ఓ పద్ధతిగా జరగడం ప్రారంభించాయి. మేం కంపెనీ ఎలా నడవాలన్నది నిర్ణయిస్తాం.. దానిని సమర్ధవంతంగా అమలు పరిచేది అశోక్ అంటారు కంపెనీ కో ఫౌండర్ ధరమ్.’’

కంపెనీకి సంబంధించిన అన్ని స్టోర్లలో స్మూత్ ఆపరేషన్స్ నిర్వహించడం అశోక్ పని. తమ కస్టమర్లకు నాణ్యమైన ఫుడ్‌తో పాటు మంచి సర్వీస్ అందించడమే అశోక్ బాధ్యత.

ఆపరేషన్స్ మేనేజర్‌గా అశోక్ ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు. సంస్థ అభివృద్ధికి కొత్తగా ఆలోచించడం దానిని అమలు పరచడం. కంపెనీకి సంబంధించిన అన్నీ స్టోర్లలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవడం. స్టోర్ల నిర్వహణ, వాటికి సరిపడా ఉద్యోగులను సమకూర్చడం. వారికి ట్రైనింగ్ క్లాసులు, ప్రేరణ కలిగించడం, టీంను బలోపేతం చేస్తూ కంపెనీ సేల్స్ పెంచడం, కంపెనీ బ్రాండ్ ఇమేజ్ పెంచడంతో పాటు మొత్తంగా కంపెనీని లాభాల బాటలో నడిపించడం అశోక్ బాధ్యతలు.

6 నెలల్లోనే ఏరియా మేనేజర్‌గా ఉన్న అశోక్ ను ఆపరేషన్స్ మేనేజర్‌గా ప్రమోట్ చేయడానికి కారణమేంటని కంపెనీ కో ఫౌండర్ ధరమ్ ను ప్రశ్నిస్తే... ఆయన ఒకటే సమాధానం చెబుతారు. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా అశోక్‌లో ఉంది. అది మేం గుర్తించాం.. మునుపటి ఆపరేషన్స్ మేనేజర్ కన్నా అశోక్ మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్ అని చెబుతారు.

కంపెనీ ఫౌండర్స్ సైతం అశోక్‌కు ఎంతో గౌరవం ఇస్తారు. కొత్త ప్రాజెక్టు అప్పగించినా అశోక్ సమర్ధవంతంగా నిర్వహిస్తారని కంపెనీ కో ఫౌండర్ ధరమ్ నమ్మకంగా చెబుతారు. కంపెనీకి సంబంధించి అన్ని విషయాలపైనా మేమంతా కలిసి పనిచేస్తామంటారు.

అశోక్‌లో ఇంకో కోణం చూస్తే... ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉంటారు. పని విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తారు. కంపెనీ కోసం తను చేయాల్సిదంతా చేస్తారు. ఇంకో కొత్త విషయమేంటంటే అశోక్ రాక్ స్టార్ పెర్ఫార్మర్ కూడా... తప్పులు అస్సలు క్షమించరు... పనిలో రాజకీయాల జోలికి పోరు... ఏ తప్పు జరిగినా ఆ బాధ్యత తన భుజాన వేసుకుంటారు. ఏరియా మేనేజర్లు తెలియక తప్పులు చేసినా వాళ్లతో స్మూత్‌గానే మాట్లాడుతారు. మొత్తంగా తన టీంను బలోపేతం చేసేందుకు కృషి చేస్తారు.

తన టీంకు సరైన డైరెక్షన్ ఇస్తూ నిర్ణీత సమయంలోనూ పనులు పూర్తయ్యేలా చూస్తారు. ఎప్పుడైతే కంపెనీ ప్రొడక్ట్స్ పట్ల కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తారో అప్పుడు అశోక్ సంతోషంగా ఫీల్ అవుతారు. తన ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చడంతో అశోక్ మరింత ఉత్సాహంగా పని చేస్తారు. ‘‘కంపెనీ ఛైర్మన్లు ఎదురైనా నేరుగానే పలకరిస్తాను. ఇలాంటి కంపెనీ అభివృద్ధిలో భాగస్వామిని అయినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాని అశోక్ అంటారు. మీటింగ్ లో తన పనిని టీం సభ్యులు గుర్తించి, మెచ్చుకోవడమే తన జీవితంలో సంతోషకరమైన రోజుని” చెబుతారు అశోక్.

కంపెనీకి సంబంధించిన స్టోర్లలో లాస్ట్ ప్లేస్ లో నిలిచిన వాటిని ఫస్ట్ ప్లేస్ కు తేవడమే అశోక్ ముందున్న పెద్ద ఛాలెంజ్. ‘‘ కంపెనీ స్టాండర్డ్స్‌కు తగినట్లుగా కస్టమర్లకు తక్కువ ధరకే మంచి ఫుడ్ అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.. ప్రస్తుతం అది ట్రాక్‌లో పడింది.’’

ఆఫీస్ పూర్తయిన తర్వాత అశోక్ తన ఫ్యామిలీతో గడుపుతారు. న్యూస్, కామెడీ షోలు ఎక్కువగా చూస్తారు. అశోక్ తన టీంకు ఒక్కటే చెబుతారు.. ‘‘ ఉత్తమ విజయాలు అందుకోవాలంటే ప్రతి రోజూ ఏదో కొత్త విషయం నేర్చుకోవాలి’’.