ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్నారా..? మీ కోసమే ఈ మూడు చిట్కాలు..!

ఆన్ లైన్ బిజినెస్ చేస్తున్నారా..? మీ కోసమే ఈ మూడు చిట్కాలు..!

Saturday March 19, 2016,

4 min Read


డిజిటల్ విప్లవం విజృంభిస్తున్న ఈ తరుణంలో వ్యాపారం అంతా ఆన్ లైనే. అయితే వెబ్ సైట్.. లేకపోతే యాప్. మార్కెటింగ్ వ్యూహాలు మారిపోయాయి. నీట్ గా టక్ చేసి టై కట్టుకుని స్టిఫ్ గా సెల్యూట్ చేసి ప్రొడక్ట్ గురించి చెప్పే ఎగ్జిక్యూటివ్ లకు వేగంగా కాలం చెల్లిపోతోంది. ఈ స్టైల్ ని ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి అన్వయించాల్సిన పరిస్థితి వచ్చింది. వినియోగదారుల్ని మన వెబ్ సైట్ వరకూ తీసుకురావడంతో పాటు వారితో షాపింగ్ చేసేలా ఈ డిజిటల్ మార్కెటింగ్ తోనే ప్రయత్నించాల్సి ఉంటుంది. కస్టమర్లను వెబ్ సైట్ వరకూ తీసుకురావడానికి బోలెడన్నీ పద్దతులున్నాయి.

"యాడ్వర్డ్స్"క్యాంపైన్ ది ఇందులో కీలకపాత్ర . పాప్ అప్ ల ద్వారా కొన్ని వేల మంది వెబ్ సైట్ వరకూ వస్తారు. కానీ వారి చేత ఏమైనా కొనిపించడం కాదు కదా... కనీసం రిజిస్టర్ కూడా చేయించుకోలేం. ఆన్ లైన్ వ్యాపారులు దారుణంగా విఫలమయ్యేది అక్కడే. ఈ పరిస్థితి ఒకరో.. ఇద్దరిదో కాదు. దాదాపు అందరూ ఆన్ లైన్ వ్యాపారులది అదే పరిస్థితి. పాప్ అప్ లద్వారా వెబ్ సైట్ ఓపెన్ చేసిన వారిలో పదిహేను సెకన్లు కూడా భరించని వారు లెక్కలేనంత మంది. ఓ నివేదిక ప్రకారం పాప్ అప్ లద్వారా వెబ్ సైట్ ని సందర్శించే వారిలో 98 శాతం ఎలాంటి షాపింగూ చేయడానికి ఇష్టపడటం లేదు.

ఈ పరిస్థితిని మార్చేదేలా..?

వెబ్ సైట్ ని చూసేవారిని కొనుగోలుదారులుగా మార్చేదెలా..?

వారిని రిటర్న్ కస్టమర్లుగా చేసుకునేదెలా..?

వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకునేలా ప్రొత్సహించడమెలా..?

ఇవన్నీ ఆన్ లైన్ వ్యాపారం చేసేవారికి పెద్ద సవాళ్లు. వీటిని అధిగమించడానికి మూడు సింపుల్ చిట్కాలు ...

image


మొదటి చిట్కా : తొలిచూపులోనే అబ్బురపరచండి

"టోనీహైలే ఆఫ్ చార్ట్ బీట్" అనే సంస్థ విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం 55 శాతం మంది వినియోగాదారులు కనీసం 15 సెకన్లు కూడా యాప్, వెబ్ సైట్ల మీద ఉండటం లేదు. దీనికి కారణం ... వారిని ఆ వెబ్ సైట్ ప్రధాన పేజీ ఆకట్టుకునేలా లేకపోవడం. కొంత సేపైనా వారిని వెబ్ సైట్ దగ్గర ఆపగిలిగితే ... తదుపరి మార్కెటింగ్ చేసుకోవడానికి తగ్గట్లుగా వారి నించి ఈమెయిల్ ఐడీలను అయినా సంపాదించవచ్చు. కొంత మంది కొత్త కొత్త వెబ్ సైట్లు రోజంతా సర్ఫింగ్ చేస్తూంటారు. అలాంటి వారు మీ వెబ్ సైట్ నే గుర్తుపెట్టుకోవాలంటే కచ్చితంగా ప్రత్యేకత చూపించాల్సిందే. లేకపోతే వారు అలాంటి వెబ్ సైట్ ని ఓసారి చూశామన్న విషయం కూడా గుర్తుంచుకోరు.

కస్టమర్ల మదిలో వెబ్ సైట్ నిలిచిపోవాలంటే వారిని అబ్బురపరచాలి. దాన్ని రెండు మార్గాల్లో ప్రయత్నించవచ్చు. అందులో ఒకటి "ఆప్ట్ ఇన్ పాపప్". వినియోగదారుడు వెబ్ సైట్, లేదా యాప్ ఓపెన్ చేయగానే ఆ రోజుకు ఉన్న బెస్ట్ ఆఫర్ తో పాపప్ కనిపించేలా చేయాలి. షాపింగ్ మూడ్ లో ఉన్న ఎవరైనా అలాంటి ఆఫర్ కనిపిస్తే వెనక్కిపోరు. దీని ద్వారా కచ్చితంగా ఆ వినియోగాదారుకు సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకునే అవకాశం వస్తుంది. చాలామంది ఇలాంటి ఆఫర్లను సైడ్ బార్స్ లో ఇస్తుంటారు. కానీ "క్రేజీఎగ్" అనే సంస్థ అంచనా ప్రకారం 1,375 శాతం ఎక్కవ ఆప్ట్ ఇన్ పాపప్ లే వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

image


ఆప్ట్ ఇన్ టాపప్ లో రెండు ఉదారణలు చూద్దాం...

1. ఆఫర్ లేకుండా... ఆకట్టుకునేలా..

2. ఆఫర్ తో ఆకట్టుకునేలా..

వీటి డిజైన్ విషయంలో వినియోగదారుల అభిరుచికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఏ విభాగానికి చెందిన వస్తువుల అమ్మకాలు చేస్తూంటే... వాటి టార్గెట్ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించాలి. ఇలా చేయడం వల్ల కస్టమర్లు రిజిస్టర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

రెండో చిట్కా: వెళ్లిపోతున్నవారిని వెనక్కి లాగండి..!

వినియోగదారులు రకరకాలు. మామూలు మార్కెట్లో బేరం ఆడే విధానాన్ని ఓ సారి గుర్తు చేసుకోండి. పదిహేను వందలు చెప్పి... ఒక్క రూపాయి తగ్గనంటాడు. చివరికి వెళ్లిపోతూంటే కొత్త ధర చెబుతాడు. అప్పుడు మనం శాటిఫై అయితే మార్కెట్ చేస్తాం. లేదంటే లేదు. ఇదే ఫార్ములాను రెండో చిట్కాగా ఆన్ లైన్ మార్కెట్ లో ఉపయోగించవచ్చు.

వెబ్ సైట్, యాప్ ను ఎంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినా .. స్పందించకుండా ట్యాబ్ ను క్లోజ్ చేయడానికి వినియోగదారు ప్రయత్నిస్తే "ఎగ్జిట్ ఇన్ టెన్ట్ పాపప్" ను ఉపయోగించవచ్చు. అంటే క్లోజ్ చేసే ప్రయత్నం చేయగానే వెంటనే ఆకర్షణీయ ఆఫర్ తో ఎగ్జిట్ ఇన్ టెన్ట్ పాపప్" వస్తుంది. దాంతో వినియోగదారుడ్ని మరింత సేపు సైట్ లో ఉంచవచ్చు.

రాక్.కామ్ అనే సంస్థకు చెందిన "ఎగ్జిట్ ఇన్ టెన్ట్ పాపప్" ను కింద ఫోటోలో చూడండి..

image


చూశారుగా ఇలా ఇచ్చే ఆఫర్లు ఇప్పటి వరకు ఆ వినియోగదారు బ్రౌజింగ్ హిస్టరీని, అతని అభిరుచుల్ని విశ్లేషించే ఇచ్చేలా చేయగలిగితే విజిటర్ ని సబ్ స్క్రైబర్ గా మార్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.

మూడో చిట్కా: తిరిగొచ్చేవారికి వెల్కమ్ చెప్పండి..!

అందంతో అబ్బురపరిచినా... ఆఫర్లతో వలవేసినా... యూజర్లు నిరాసక్తత ప్రదర్శించవచ్చు. కానీ పై రెండు చిట్కాల వల్ల వెబ్ సైట్, యాప్ మనసులో అయితే ఉండిపోతుంది. అందుకే తనకు కావాల్సిన వస్తువు కోసం తిరిగి తిరిగి మళ్లీ మీ దగ్గరకే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలా వచ్చిన వారికి హృదయపూర్వకంగా వెల్కం బ్యాక్ పాపప్ తో స్వాగతం చెప్పండి. అంతకు ముందు అతను చేసిన బ్రౌజింగ్ హిస్టరీ లేదా కార్ట్ లో వారు ఉంచిన వస్తువులను డిస్ ప్లే చేస్తూ ఆ టాపప్ ఉండాలి.

గుర్తింపుకు పొంగిపోని మానవుడు ఉండరని విలియం జేమ్స్ చెబుతారు. దానికి వినియోగదారులు అతీతం కాదు. వెల్కం బ్యాక్ పాపప్ లు ఈ సూత్రానికి తగ్గట్లు ఉంటాయి. దీన్ని వినియోగదారులు ఇష్టపడతారు.

zales సంస్థ వెల్కం బ్యాక్ టాపప్

image


వెబ్ సైట్, లేదా యాప్ ని సందర్శించేవారిలో వందకు వందశాతం కస్టమర్లుగా మార్చుకోవడం సాధ్యం కాదు. కానీ ప్రయత్నిస్తే కొంత మందినైనా ఆ దిశగా మార్చవచ్చు. విండో షాపింగ్ తరహాలో వెబ్ సైట్లు, యాప్ లలో షాపింగ్ చేసేవారు చాలా మంది ఉంటారు. అలా కాకపోయినా వీరిని రిటర్న్ కస్టమర్లుగా మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. వినియోగదారుల సమాచారం, వారి బ్రౌజింగ్ హిస్టరీ ఈకామర్స్ సైట్లు, యాప్ లకు ఆస్తి లాంటివి. మొదటిసారే వినియోగదారు షాపింగ్ చేసేయకపోవచ్చు. కానీ రెండు మూడు సార్లు ఆ వెబ్ సైట్, యాప్ సందర్శించారంటే విలువైన ఖాతాదారుడు లభించినట్లే..

యువర్ స్టోరీ విన్నపం: పైవన్నీ రచయిత అభిప్రాయాలు మాత్రమే. ఎంతమాత్రమూ యువర్ స్టోరీ ఒపీనియన్ అని భావించొద్దు.