జ్యూసుల నుంచి డబ్బులు పిండుతున్న ముగ్గురు మిత్రులు

జ్యూసుల నుంచి డబ్బులు పిండుతున్న ముగ్గురు మిత్రులు

Saturday September 26, 2015,

3 min Read

ప్రజల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ పట్ల అవగాహన బాగా పెరుగుతోంది. తాము తినే ఆహారం విషయంలో కూడా జనాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తూ మరింత ఫిట్‌గా సంతోషంగా గడపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పండ్ల రసాలకు ప్రాధాన్యత బాగా పెరిగింది. తాజా అంచనాల ప్రకారం పండ్ల రసాల మార్కెట్ సగటు వార్షిక వృద్ధి రేటు (CAGR) 25-30 శాతం వరకు ఉంది. భారతదేశంలో పండ్ల రసాల వ్యాపారంలో పెద్ద మొత్తంలో వాటా అసంఘటిత రంగంలోని వ్యక్తుల చేతుల్లోనే ఉంది (మొత్తం మార్కెట్ లో వీరి వాటా 75 శాతం ఉంటుంది). కన్సల్టింగ్ సంస్థ టెక్నోప్యాక్ చెబుతున్నదాని ప్రకారం భారతదేశంలో పండ్ల రసాల మార్కెట్ విలువ రూ 1,100 కోట్లు.

image


సవద్ ఒక వెంచర్ జ్యూస్ మేకర్‌గా మారే ముందు ఈ రంగంలోనే తనకు మంచి అవకాశాలు ఉన్నాయని గుర్తించాడు. పాపనచేరి గ్రామానికి చెందిన సవద్, 19 ఏళ్ల వయస్సులోనే ఊరిని వదిలేసి బెంగళూరులో అడుగుపెట్టారు. ఆయన అప్పటి విషయాల్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు.‘‘ నేను బెంగళూరు వచ్చేటప్పటికీ నా జేబులో రూ.250 రూపాయలు ఉన్నాయి. ఇంగ్లిష్ మాట్లాడటం రాదు. నా బాల్య స్నేహితుడు నైసిమ్ నా వ్యాపారానికి అవసరమైన స్క్రిప్ట్స్ ఇంగ్లీష్‌లో రాసి ఇచ్చేవాడు. ఇప్పుడు అతడు నా పార్ట్‌నర్ కూడా ’’

సవద్ మొదట ఒక చైన్ హోటల్‌లో పనిచేసేవారు. హాస్పిటలిటీ పరిశ్రమలో వ్యాపారం నడిపించే తీరు తెన్నులను ఆయన గమనించారు. తనకు ఉన్న అవకాశాలు, తన కార్యకలాపాలు బాగానే నడుస్తున్నట్టు ఆయన గుర్తించారు. తాను కూడా ఏదో ఒక రోజు సొంతంగా అటువంటి వ్యాపారాలు చేయాలని కలలు కనేవారు.

బెంగళూరులో ఓ చైన్ హోటల్‌కి అత్యంత పిన్న వయస్సులోనే జనరల్ మేనేజర్‌గా ఎదిగిన వ్యక్తిగా సావద్ పేరొందారు. కానీ ఆ విజయగాథ అక్కడితో ఆగిపోలేదు.

సావద్, సీఈవో, జ్యూస్ మేకర్

సావద్, సీఈవో, జ్యూస్ మేకర్


జ్యూస్‌ను పిండే ప్రయత్నం

ఒక సామాజిక ప్రయోగంతో సవద్ తన ప్రయత్నం మొదలుపెట్టారు. 'జ్యూస్ మేకర్ ' నెలవారీ సభ్యత్వాల ఆధారంగా పనిచేసే బి2సి సర్వీస్. వ్యక్తులు, వారి అవసరాలకు తగినట్టుగా తాజా జ్యూసులు అందించడం మీదే ప్రధానంగా దృష్టిపెట్టారు.

సవద్ వెంచర్ మీద, అతడి విజన్ మీద నమ్మకంతో అతడి బాల్య స్నేహితులు నైసిమ్, ముషిన్‌లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ప్రయోగాత్మక దశలోనే కేవలం నోటి మాట ద్వారా 250 మంది వినియోగదార్లను సంపాదించినట్టు నవీద్ చెప్పారు.

మాకు ఇతర స్టార్టప్‌ల నుంచి రిక్వెస్టులు వచ్చాయి. ఎంఎన్‌సి కంపెనీలు, అపార్ట్‌మెంట్లు, జిమ్‌లు మొదలైన చోట్లకు ఖాతా పద్దతిలో జ్యూసులను సరఫరా చేయాలి. దీనికి టెక్నాలజీని జత చేస్తే వినియోగదారులకు సులభతరం అవ్వడమే కాదు.. మేం కూడా ఒక విజయవంతమైన బిజినెస్ మోడల్‌ను సొంతం చేసుకోగలుగుతాం అనిపించింది. ప్యాకేజ్డ్ జ్యూసుల సంప్రదాయాన్ని మార్చేయాలనుకున్నాం, మేం తయారు చేసే ఆరోగ్యవంతమైన ద్రవాల ప్యాక్, మేం రూపొందించిన ఆహార పదార్ధాలు విభిన్నంగా ఉండేలా తీర్చిదిద్దాం అంటారు టీం సభ్యులు.

నైసిమ్, జ్యూస్ మేకర్ సహవ్యవస్థాపకుడు

నైసిమ్, జ్యూస్ మేకర్ సహవ్యవస్థాపకుడు


ఏడుగురు సభ్యులతో కూడిన టీమ్, 19 మంది జ్యూస్ మేకర్స్‌తో కూడిన నెట్ వర్క్, డెలివరీ బాయిస్, వీరితోనే వెంచర్ ప్రారంభమైంది. నెల నెల తమ ఆదాయం 125 శాతం మేర పెరిగినట్టు వారు చెప్పారు. కంపెనీల యొక్క ఆఫ్‌లైన్ స్టోర్లు మాకు ప్రధాన వనరులుగా మారాయి. కార్పొరేట్ తలుపులు తట్టడంతో ఈ వెంచర్ క్లయింట్ బేస్డ్‌గా మారింది. లుక్ అప్, 102 స్టూడియోస్, టోకీ టాకీ, పొలైజర్ అండ్ గెట్ క్లోజర్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయి. వాళ్లకి స్విగ్గీ, టైని ఓల్, టేస్టీ ఖానా, ఫుడ్ పాండా, రోడ్ రన్నర్ వంటి కంపెనీలతో భాగస్వామ్యాలు ఉన్నాయి. వీళ్లంతా చాలా స్పష్టంగా కనిపించేలా, ఏ సమయంలోనైనా భోజనాల్ని సరఫరా చేస్తారు.

మరో ముందడుగు ఏమిటంటే ఈ స్టార్టప్ పూర్తిగా ఆర్గానిక్ విధానంలో పండించిన పండ్లు, కూరగాయల్ని ఉపయోగించి జ్యూసులను తయారు చేయాలనుకోవడం. ఇందుకోసం సేంద్రియ విధానంలో పండ్లు, కూరగాయాలు పండించే వ్యాపారులుతో వీరు చర్చలు జరుపుతున్నారు.

జ్యూస్ మేకర్ వెబ్, మొబైల్ అప్లికేషన్(అండ్రాయిడ్, ఐఓఎస్) ఆధారంగా నడుస్తోంది. ఇందులో ఉండే మాడ్యూళ్లు, ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా సలహాలు అందిస్తాయి. వచ్చే ఏడాది కల్లా తమ వ్యాపారాన్ని చెన్నైకి విస్తరించాలని ఈ కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది.

మజీన్,  జ్యూస్ మేకర్ సహ వ్యవస్థాపకుడు

మజీన్, జ్యూస్ మేకర్ సహ వ్యవస్థాపకుడు


ఉత్పత్తుల చక్రం.. డెలివరీతోనే పూర్తయిపోకూడదనంటారు సవద్. ఇందుకు బదులుగా వినియోగదారుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ నిరంతరం ఉత్పత్తుల నాణ్యత పెంచాలని ఆయన చెబుతారు.

బలం

50 బిలియన్ల ఫుడ్ టెక్ మార్కెట్‌ను పరిగణలోనికి తీసుకుంటే జ్యూస్ డెలివరీ వ్యాపారం ఏమంత ఆశ్చర్యకరమైంది కాదు. బిజినెస్ ఇన్ సైడర్ చెబుతున్నదాని ప్రకారం సిలికాన్ వ్యాలీలో కూడా జ్యూసిరో అనే స్టార్టప్, జ్యూస్ మేకర్ తరహా వ్యాపార నమూనాను అనుసరిస్తోంది. వీరు కూడా మంచి ఆదాయాన్నే ఆర్జిస్తున్నారు. అక్టోబర్ 2013 నాటికి నాలుగు మిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్న వీరి వ్యాపారం, ఏప్రిల్ 2014 నాటికి 15.8 మిలియన్ డాలర్లుకు చేరుకుంది. ఈ సంస్థ జనవరి 2015 నాటికి 100 మిలియన్ డాల్లకు చేరుకుంటుందని రిపోర్టులు చెబుతున్నాయి.

జ్యూస్ మేకర్ మీద పెట్టుబడుదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ స్టార్టప్ జ్యూసిరో తరహాలోనే పురోగతి సాధిస్తుందా లేదా అన్నదాని మీదే అమితాసక్తి కనబరుస్తున్నారు.

website