సాహసం చేశారు.... యాప్ వీరులుగా నిలిచారు.. !

యాప్ డెవలపింగ్ లో ఎమ్మెన్సీ కంపెనీలను క్లైంట్లుగా చేసుకున్న సిస్కో మాజీ ఉద్యోగులు

సాహసం చేశారు.... యాప్ వీరులుగా నిలిచారు.. !

Tuesday May 03, 2016,

4 min Read


నెలకు రూ.2 లక్షల జీతం..!

తనపైనే ఆధారపడిన కుటుంబం..!

మూడు నెలల చిన్నారి కూతురు...!

అమెరికా రారమ్మని పిలుస్తున్న H1 వీసా..!

ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉద్యోగం వదిలేస్తారా..?. అలా వదిలేసిన వాళ్లని బుర్ర ఉన్నవాళ్లుగా ఎవరైనా లెక్కకడతారా..?. ఎవరేమనుకున్నా జార్జ్ క్రిస్టోఫర్, జి.సురేష్ కుమార్ తమ ఉద్యోగాలను వదిలేశారు. కేరళలోని తిరుచిరాపల్లికి చెందిన వీరిద్దరూ సిస్కోలో హైపేమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబాల నుంచి పైకొచ్చిన వీరిద్దరి యాంబిషన్ అంట్రపెన్యూర్ షిప్. అందుకే రూ.2 లక్షల రూపాయల ఉద్యోగం, అమెరికా అవకాశం వీరికి గొప్ప చాన్సులుగా అనిపించలేదు. మూడు నెలల వయసున్న చిన్నారి కూతురు భవిష్యత్ ను రిస్క్ కి పెడుతున్నానని జార్జ్ క్రిస్టోఫర్ మనసులో కూడా అనుకోలేదు. త్వరలో రెండో బిడ్డకు తండ్రి కాబోతున్న జి.సురేష్ కూడా తాను లాటరీ వేస్తున్నాననే భావనకు రాలేదు. తమ విజయం ముందే ఖరారైందని నిర్ణయించుకున్నారు. అయితే కష్టనష్టాలుంటాయని.. దాని కోసం ఎంత శ్రమకైనా సిద్ధపడాలనే ఉద్దేశంతో అంట్రపెన్యూర్ పరుగు ప్రారంభించారు.

యాప్ మేకింగ్ లో కింగులు

మిత్రులిద్దరూ సిస్కో ఉద్యోగాన్ని వదిలేసి బయటకు వచ్చిన తర్వాత 2012లో చెన్నైలో "మ్యాక్ యాప్ స్టూడియో"ను స్థాపించారు. నాలుగేళ్లు తిరిగేసరికి యాప్ ల రూపకల్పనలో ఎమ్మెన్సీ కంపెనీల నుంచి సైతం కింగ్ లు గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా 120 అప్లికేషన్లను రూపొందించారు. ఐఓఎస్, అండ్రాయిడ్, విండోస్, మ్యాక్ OSX లాంటి వేర్వేరు ఫ్లాట్ ఫామ్స్ పై వీటిని రూపొందించారు. వీరు రూపొందించుకున్న యాప్స్ ఇప్పటికి మూడు మిలియన్ల డౌన్ లోడ్లు నమోదు చేశాయి. వీటిని ప్రస్తుతం నాలుగు లక్షల మంది రోజూవారీగా ఉపయోగించుకుంటున్నారు.

రోజువారీ ఖర్చుల వ్యవహారాలను విశ్లేషించే మనీ బ్యాగ్, రోజువారీ పనులను చక్కబెట్టుకునేందుకు సహకరించే టాస్కస్ బాక్స్, ఫైల్ నేమ్స్ వారీగా ఫోల్డర్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించే డిక్లట్టర్, మనసులో కలిగే భావనలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకునేందుకు ఉపయోగపడే విష్ జార్ లాంటి యాప్ లు వీరు రూపొందించినవే. వీటిని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకున్నారు.

గతంలో వీరి యాప్ మేకింగ్ ప్రతిభకు పలు అవార్డులు కూడా వచ్చాయి. ఇంటెల్ బ్లాక్ బెల్ట్ అవార్డును ప్రధానం చేసింది. అలాగే వరుసగా రెండేళ్ల పాటు ఇంటెల్ డెవలపర్స్ చాలెంజ్ అవార్డును వీరు గెల్చుకున్నారు. వీరి అప్లికేష్ డెవలపింగ్ టాలెంట్ చూసిన ఇంటెల్ లక్ష డాలర్ల బహుమతిని కూడా ఇచ్చింది. ఇంటెల్ తమ X86 ప్రాసెసర్ తో డెవలప్ చేసే యాప్ ల కోసం గూగుల్ ప్లే స్టోర్ లో ఓ యాప్ స్టోర్ ను తమ క్రియేట్ చేయమని వీరిద్దరికీ ఆఫర్ కూడా ఇచ్చింది. 2014కల్లా వీరి క్లైంట్ల సంఖ్య 30కి చేరింది. వీరిలో పదికిపైగా మల్టీనేషల్ కంపెనీలున్నాయి. ప్రపంచస్థాయి డిజైన్, డెవలప్ మెంట్ తమ ప్రత్యేకత అని సురేష్ నమ్మకంగా చెబుతున్నారు. మాములు డెవలపర్లు వసూలు చేసేదానికన్నా వీరు ఇరవై శాతం ఎక్కువే వసూలు చేస్తారు.

తడబడినా.. నిలబడ్డారు..!

యాప్ డెవలపింగ్ పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన ఈ ఇద్దరు మిత్రులు మార్కెటింగ్ పై మాత్రం పెద్దగా పట్టుసాధించలేకపోయారు. దీంతో యాప్ మేకింగ్ లో మ్యాక్ యాప్ స్టోర్ టాప్ చార్ట్స్ లో ఉంటున్నప్పటికీ.. ఆదాయం మాత్రం స్థిరంగా రాలేదు. మొదటి రెండేళ్లు మ్యాక్ ఆప్ స్టోర్ లో ఉద్యోగులు, ఫౌండర్లు వీరిద్దరే. ఎవరినీ ప్రత్యేకంగా ఉద్యోగంలోకి తీసుకోలేదు. వన్ ఎంబీపీఎస్ ఇంటర్నెట్ సౌకర్యం మీదే పనిచేసేవారు. అయితే ఆ తర్వాత వీరు తమ మార్కెటింగ్ టాలెంట్ ను పెంచుకున్నారు. వీరు మొత్తం ఇప్పుడు మూడు కంపెనీలను రన్ చేస్తున్నారు. మ్యాక్ యాప్ స్టూడియోతో పాటు బ్లూ ఇన్నోవేషన్స్ అనే మరో సంస్థను 2012లో ప్రారంభించారు. అండ్రాయిడ్ X86, రియల్ సెన్స్, టూ ఇన్ వన్ డివైజెస్ విభాగాల్లో ఇది పని చేస్తోంది. అలాగే ఈ ఏడాది జనవరిలో రాకెట్ ఎక్స్ ల్యాబ్స్ అనే సంస్థను ప్రారంభించారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వస్తువులు, సేవల కొత్త ఉత్పత్తులను కనుగోనేందుకు ప్రత్యేకంగా దీని కింద పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పారు.

వీరు అప్లికేషన్ రూపొందించే విధానం పూర్తి పారదర్శకంగా ఉంటుంది. అప్లికేషన్ కావాల్సిన వారి అవసరాలు, ఎలాంటి ఉపయోగానికి అన్నదానిపై స్పష్టమైన అవగాహనకు వచ్చిన తర్వాత ఒక్కో విభాగంతో యాప్ ను డెవలప్ చేస్తూ వెళ్తారు. మొదట కస్టమర్ యాప్ డెవలపింగ్ కోసం వచ్చినప్పుడు ఫస్ట్ వెర్షన్ రూపొందించి చూపిస్తారు. తర్వాత దానికి తగ్గ ఫీచర్స్ జత చేస్తూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ.. కంప్లీట్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ చేస్తారు. అంతా సంతృప్తిగా వచ్చిన తర్వాత యాప్ ను వ్యాలిడేట్ చేస్తారు.

" యాప్ ను ఇతర ఫీచర్స్ ను వన్ బై వన్ యాడ్ చేస్తూ ఉంటాం. దీని వల్ల వినియోగదారుకు అప్లికేషన్ పై స్పష్టమైన అవగాహన వస్తుంది. ఫైనల్ డెలివరిలో ఒక్కసారిగా అర్థం కాని విషయాలేం యాప్ లో బయటపడవు" జార్జ్ , కో ఫౌండర్, మ్యాక్ యాప్ స్టూడియో

వీరిద్దరూ ఫ్రేమ్ వర్క్ బేస్డ్ డెవలప్ మెంట్ మోడల్ ను అనుసరిస్తారు. యాప్ లను డెవలప్ చేసుకునేందుకు రీయూజ్ కాంపోనెట్ లను రెడీగా ఉంచుకుంటారు. దీని వల్ల వారికి చాలా డెవలపింగ్ టైమ్ ఆదా అవుతుంది.

జార్జ్ క్రిస్టోఫర్, జి.సురేష్ కుమార్, మ్యాక్ యాప్ స్డూడియో ఫౌండర్లు<br>

జార్జ్ క్రిస్టోఫర్, జి.సురేష్ కుమార్, మ్యాక్ యాప్ స్డూడియో ఫౌండర్లు


నాలుగేళ్లలో నాలుగు కోట్ల స్థాయికి..!

గత ఏడాది మాక్ యాప్ స్డూడియో నాలుగు కోట్ల రూపాయల ఆదాయం సాధించింది. ఏడాదిలో 141శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది మొత్తం ఆదాయాన్ని రూ.16 కోట్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది చివరికల్లా పది మిలియన్ల యూజర్లు తాము రూపొందించిన యాప్ ను రోజువారీ ఉపయోగించుకుంటారని అంచనా వేస్తోంది. ప్రస్తుతం మాక్ యాప్ స్డూడియోలో 42 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

ప్రస్తుతం వీరు ఆన్ లైన్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, టీచర్స్ మధ్య కమ్యూనికేషన్, సమన్వయం మరింత పెరిగేలా ఈ వ్యవస్థనూ రూపొందిస్తున్నారు. వీరు ఇప్పటికే మైస్కూల్ ట్యాబ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. స్కూల్ సిలబస్ తో ఉండే ఆటలు, పాటలు, యాప్స్, బుక్స్ ను ఇందులో పొందుపరిచారు. దీంతో ఈ ట్యాప్ మంచి ఆదరణ చూరగొంటోంది.

మ్యాక్ యాప్ స్టూడియో బృందం <br>

మ్యాక్ యాప్ స్టూడియో బృందం


ప్రపంచస్థాయి మార్కెట్

ఈ ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ను ఉపయోగించేవాళ్లు 462 మిలియన్లకు చేరుకుంటారు. ఇండియాలో పెయిడ్ యాప్ రెవిన్యూ 317.6 మిలియన్ల డాలర్లకు చేరుకోనుంది. వచ్చే ఏడాది కల్లా ఇండియా ప్రపంచంలోనే యాప్ డెవలపర్స్ కేంద్రంగా నిలుస్తుందని డెలాయిట్ అంచనా వేసింది. మొబైల్ యాప్ డెవలపింగ్ లో ఓపెన్ ఎక్స్ సెల్, సోర్స్ బిట్స్, కోన్ స్టాంట్ ఇన్ఫో సొల్యూషన్స్, టెక్ ఎహెడ్, క్యూ బరస్ట్ లాంటి సంస్థలు ఇప్పటికే ప్రముఖంగా పేరు తెచ్చుకున్నాయి. వీటన్నింటిని స్మార్ ఫోన్ యాప్ వల్లే యాభై శాతానికిపైగా ఆదాయం సమకూరుతుందని అంచనా. స్టార్టప్ ల విప్లవం నడుస్తున్న ఈ సమయంలో యాప్ ల డిమాండ్ మరో యాభై శాతం పెరిగే అవకాశం ఉంది.

ఒక్క యాప్ తో ప్రపంచమార్కెట్ ను గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉందని వాట్స్ యాప్ లాంటివి నిరూపించాయి. నెక్ట్స్ వాట్స్ యాప్ భారత్ నుంచే వస్తుందని టెక్నాలజీ ఎక్స్ పర్ట్స్ చాలా రోజుల నుంచి అంచనా వేస్తున్నారు. ఈ తరుణంలో భారత్ యాప్ డెవలపర్లదే ముందు ముందు మార్కెట్ లో సింహభాగం, మాక్ యాప్ స్డూడియోలాంటి సంస్థలు ఇందులో కీలకంగా మారనున్నాయి.

వెబ్ సైట్