ఎలాంటి హెల్ప్ కావాలన్నా లీగల్ స్టార్టప్స్ రెడీ..!!

ఎలాంటి హెల్ప్ కావాలన్నా లీగల్ స్టార్టప్స్ రెడీ..!!

Sunday April 24, 2016,

4 min Read


-మా కాపీరైట్ కొట్టేశారు- జో రూమ్స్ కంపెనీపై ఓయో రూమ్స్ ఆరోపణ

-ఫేక్ రైడర్ అకౌంట్లతో మాపై కుట్రలు చేస్తున్నారు- ఓలా క్యాబ్స్ మీద ఉబెర్ కేసు

గత ఏడాది చాలా స్టార్టప్స్ మధ్య లీగల్ అంశాల్లో లొల్లి జరిగింది. కొన్ని కోర్టు దాకా వెళ్లాయి. మరికొన్ని మ్యూచువల్ గా సమస్య పరిష్కారం చేసుకున్నాయి. మొత్తమ్మీద లీగల్ ఇష్యూస్ స్టార్టప్స్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. అయితే ఇందులో పాజిటివ్ సైడ్ కూడా ఉంది. స్టార్టప్స్ మధ్య లీగల్ సమస్యలు మరో రంగానికి ఊపిరి పోశాయి! అవే లీగల్ స్టార్టప్స్. కొత్త కంపెనీల రిజిస్ట్రేషన్ దగ్గర్నుంచి న్యాయ సలహాల దాకా ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేస్తామంటున్నాయి లీగల్ స్టార్టప్స్. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

image


లారాటో డాట్ కామ్

ప్రారంభం: ఢిల్లీలో ఉంటుంది. 2013లో ఏర్పాటైంది. రోహన్ మహాజన్, నిఖిల్ సరూప్ ఫౌండర్లు.

ఫండ్ రెయిజింగ్: 2016 ఫిబ్రవరిలో లారాటో కంపెనీ ఏంజిల్ ఇన్వెస్టర్ల నుంచి లక్ష డాలర్ల నిధులు సేకరించింది. న్యాయ సేవల విస్తరణలో భాగంగా లాయర్ నెట్ వర్క్ పెంచుకోవడానికి ఆ నిధులు ఖర్చు చేస్తామంటోంది.

సేవలు: కంపెనీలకు ఎలాంటి న్యాయ సహాయం కావాలన్నా చేస్తుంది. లాయర్లతో ఈ-మెయిల్, ఫోన్ కాల్, వీడియో కాలింగ్, ఫేస్ టు ఫేస్ మీటింగ్స్ అరేంజ్ చేస్తుంది. ఆన్ లైన్ లోనే లాయర్లను ప్రశ్నలు అడగొచ్చు. మరింత సమగ్ర సమాచారం కావాలంటే కన్సల్టెంట్లను బుక్ చేసుకునే వీలుంది. లారాటోకు క్వాలిటీ చెక్ సిస్టమ్ ఉంది. లాయర్ల కోసం బీ2బీ మొబైల్ యాప్ తీసుకొచ్చింది.

రెవెన్యూ మోడల్: అరగంట పాటు లాయర్ తో ఫోన్ లో మాట్లాడించినందుకు రూ.500 ఛార్జ్ చేస్తారు. లాయర్ ఫీజు వేరే ఉంటుంది. కస్టమర్లకు సేవలు నచ్చకపోతే రీఫండ్ చేస్తారు.

కంపెనీ వృద్ధి: 2014-15 ఆర్థిక సంవత్సరంలో లారాటో నెలనెలా 20 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తోంది. ఇప్పటికే రూ.65 లక్షల రెవెన్యూ సాధించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోటి రూపాయల ఆదాయం సంపాదించడమే టార్గెట్!

మొన్న ఫిబ్రవరి వరకు లారాటోకు 14 వేల మంది రిజిస్టర్డ్ యూజర్లు, వెయ్యి మంది పెయిడ్ కస్టమర్లు ఉన్నారు. వెబ్ సైట్ ను 60 వేల మంది విజిట్ చేస్తున్నారు. నెలకు 150 మంది పెయిడ్ యూజర్లు సంప్రదిస్తున్నారు. ఇండియాలోని 150 పట్టణాల్లో వెయ్యి మంది లాయర్లు లారాటోకు పనిచేస్తున్నారు.

లారాటో బృందం

లారాటో బృందం


వెబ్ సైట్: లారాటో డాట్ కామ్

లీగిస్టిఫై

ప్రారంభం: 2013 ఆగస్టులో అక్షత్ సింఘాల్ (బిట్స్ పిలానీ స్టూడెంట్) గెట్ లీగల్ అనే కంపెనీని ప్రారంభించాడు. ఇది క్యూ అండ్ ఏ పద్ధతిలో పనిచేస్తుంది. వ్యక్తులు, వ్యాపార సంస్థల న్యాయపరమైన సమస్యలకు లాయర్లు, లా స్టూడెంట్స్ ద్వారా పరిష్కారం చూపిస్తుంది. అయితే కంపెనీకి మరిన్ని హంగులద్ది 2015 ఆగస్టులో లీగిస్టిఫై అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేశాడు అక్షత్. అతడికి రితేశ్, రవీంద్ర పురోహిత్ సహకరించారు.

ఫండ్స్: 2015 డిసెంబర్ లో పాలిప్లెక్స్ కంపెనీ నుంచి భారీగానే నిధులు సేకరించింది.

సేవలు: లీగిస్టిఫై డాట్ కామ్ ఒక ఆన్ లైన్ అగ్రిమెంట్ మేకింగ్ ప్లాట్ ఫామ్! కంపెనీల మధ్య అగ్రిమెంట్లు సెటిల్ చేస్తుంది. 30 రకాల అగ్రిమెంట్ సేవలు అందిస్తుంది. వచ్చే రెండు నెలల్లో ఆ సంఖ్యను 300కు చేర్చాలన్నది ఫౌండర్ల లక్ష్యం. స్టార్టప్ లకు ఆఫ్ లైన్లో కూడా సేవలందిస్తుంది. ప్రత్యేకంగా కన్సల్టెంట్లను నియమించి వ్యాపారం ప్రారంభించడానికి సంబంధించిన అంశాల్లో సహకరిస్తుంది.

రెవెన్యూ మోడల్: అగ్రిమెంట్ ను బట్టి రూ.1000 నుంచి రూ.1,500 దాకా ఛార్జ్ చేస్తారు. ఆఫ్ లైన్ కన్సల్టేషన్ ఫీజు రూ.5000 నుంచి రూ.15000 వరకూ ఉంది.

ఇప్పటివరకు లీగిస్టిఫై 700 లీగల్ అగ్రిమెంట్లు చేయించింది. అందులో 70-80 శాతం ఫస్ట్ టైమ్ యూజర్లకు ఫ్రీగా సర్వీస్ చేసినవే. ఇక ఆఫ్ లైన్ లో 25-30 స్టార్టప్ లకు న్యాయ సేవలు అందించింది.

లీగిస్టిఫై ఫౌండర్లు అకత్, రితేశ్

లీగిస్టిఫై ఫౌండర్లు అకత్, రితేశ్


వెబ్ సైట్: లీగిస్టిఫై డాట్ కామ్

వకీల్ సెర్చ్

ప్రారంభం: 2011లో నేషనల్ లా స్కూల్ పూర్వ విద్యార్థి హృషికేశ్ దతార్.. వకీల్ సెర్చ్ లీగల్ స్టార్టప్ స్టార్ట్ చేశాడు.

ఫండ్స్: 2015లో వకీల్ సెర్చ్ సిరీస్-ఏ ద్వారా కలారీ క్యాపిటల్ నుంచి నిధులు సేకరించింది.

సేవలు: ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్, లీగల్ డాక్యుమెంటేషన్ తోపాటు వ్యాపార విస్తరణ, మేథో సంపత్తి హక్కుల పరిరక్షణ వంటి అంశాల్లో న్యాయ సహాయం అందిస్తుంది. అందుబాటు ధరల్లో లీగల్ సర్వీసెస్ అందించడం వకీల్ సెర్చ్ స్పెషాలిటీ.

లక్ష్యం: ట్యాక్సీ ఫర్ ష్యూర్, హౌసింగ్ అండ్ ఇండియా ప్రాపర్టీ వంటి క్లయింట్లతో యాక్టివ్ బీ2బీ ప్లాట్ ఫామ్ ఉంది. సేవలన్నీ ఆన్ లైన్ లోనే ఉంటాయి.

వెబ్ సైట్: వకీల్ సెర్చ్ డాట్ కామ్

మీట్ యువర్ ప్రో

ప్రారంభం: 2014 జూలైలో మీట్ యువర్ ప్రో మొదలైంది. చెన్నైకి చెందిన దివాకర్ విజయ్ శాస్త్రి, రాజేశ్ ఇన్వశేఖరన్ దీనికి ఫౌండర్లు.

సేవలు: లీగల్, ట్యాక్స్ అవసరాలకు వన్ స్టాప్ షాప్ గా కంపెనీని తీర్చిదిద్దారు. వ్యక్తిగత, వ్యాపార పన్నులు, రియల్ ఎస్టేట్ ట్రాన్జాక్షన్స్, కంపెనీల ఏర్పాటు వంటి లీగల్ అంశాల్లో మీట్ యువర్ ప్రో సేవలు అందిస్తుంది. స్టార్టప్ లకు లీగల్, ప్రొఫెషనల్ సర్వీసులు అందించడానికి ఒక స్టార్టప్ క్లినిక్ ను కూడా స్టార్ట్ చేశారు.

రెవెన్యూ మోడల్: కంపెనీకి, లాయర్ కు మధ్య డీల్ కుదిరితే.. అందులో నుంచి 10 శాతం మార్జిన్ కంపెనీకి వెళ్తుంది.

ఫ్యూచర్ ప్లాన్: మీట్ యువర్ ప్రోకి ప్రస్తుతం వెయ్యి మంది ప్రొఫెషనల్స్ అటాచ్ అయి ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరం రూ.5 లక్షల రెవెన్యూ వచ్చింది. దాన్నింకా పెంచడానికి ఫౌండర్లు కృషి చేస్తున్నారు.

మీట్ యువర్ ప్రో కో ఫౌండర్ దివాకర్

మీట్ యువర్ ప్రో కో ఫౌండర్ దివాకర్


వెబ్ సైట్: మీట్ యువర్ ప్రో

లీగల్ రాస్తా

ప్రారంభం: 2015 జూన్ లో లీగల్ రాస్తా అందుబాటులోకి వచ్చింది. హిమాన్షు జైన్, అతడి సోదరుడు పులకిత్ జైన్ ఈ కంపెనీ సృష్టికర్తలు.

ఫండ్ రెయిజింగ్: 2016 ఏప్రిల్ లో ప్రవీణ్ ఖండేల్ వాల్, యతిన్ కుమార్ ల దగ్గర్నుంచి రూ.6.5 కోట్ల ఫండ్ సేకరించారు.

సేవలు: కంపెనీ ఏర్పాటు, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ లైసెన్స్, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ వంటి 50 రకాల సేవలు లీగల్ రాస్తాలో దొరుకుతాయి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉండటం విశేషం! సర్వీస్ నచ్చకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తారు.

రెవెన్యూ మోడల్: కస్టమర్ల దగ్గర్నుంచి నామమాత్రపు ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. ప్రభుత్వం దగ్గర్నుంచి కోడ్స్ పొందడానికి రూ.2,999, ప్రైవేటు కంపెనీ రిజిస్ట్రేషన్లకు రూ.13,999 వసూలు చేస్తారు.

ఫ్యూచర్: రెవెన్యూ విషయంలో లీగల్ రాస్తా కంపెనీ నెలనెలా 40 శాతం గ్రోత్ నమోదు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీలో 2,200 మంది కస్టమర్లు ఉన్నారు. రోజుకు 11 వేల మంది వెబ్ సైట్ ను సందర్శిస్తుంటారు.

లీగల్ రాస్తా టీం

లీగల్ రాస్తా టీం


వెబ్ సైట్: లీగల్ రాస్తా

ఇవికాకుండా పాథ్ లీగల్, బీ కాంప్లియెన్స్, వెంచర్ ఈజీ, ఇండియా ఫిల్లింగ్స్ వంటి ఇతర లీగల్ స్టార్టప్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. స్టార్టప్స్ తీరుతెన్నులను బట్టి న్యాయపరమైన అంశాల్లో రకరకాల సేవలు అందిస్తున్నాయి. లీగల్ స్టార్టప్స్ కు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ముందు ముందు లీగల్ స్టార్టప్స్ కూడా ఒక ముఖ్యమైన సెక్టార్ గా స్థిరపడే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.