పాతికేళ్లకే ఓ పెద్ద కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ ఎలా అయ్యాడు..?

Monday March 07, 2016,

3 min Read


ఆల్ ఇన్ వన్… అన్ని సర్వీసులు ఒకేచోట దొరికితే. అంతకన్నా కావాల్సింది ఏముంది అంటారా? ఇలాంటి సర్వీసులను అందించేందుకు ఏడాది క్రితం ప్రారంభమైన అర్బన్ క్లాప్ స్టార్టప్… ఇప్పుడు దూసుకుపోతోంది. ప్లంబింగ్ నుంచి… సాఫ్ట్ వేర్ వరకు అన్ని సేవలనూ ఒకేగొడుగు కిందకి తీసుకొచ్చింది. వేలాది ప్రొఫెషనల్స్ ఇందులో పనిచేస్తున్నారు. కస్టమర్ల అవసరాలను తీరుస్తూ… అందరి మన్నననలు అందుకుంటున్న అర్బన్ క్లాప్ కు వైస్ ప్రెసిడెంట్ శ్రీపాద్ పాణ్యం. వయసు ఇరవై ఐదే. రతన్ టాటా మనసును గెలుచుకుందీ కంపెనీ. అసలు పాతికేళ్లకే ఇంత ఘనతను శ్రీపాద్ ఎలా సాధించాడు.?

ఢిల్లీ ఐఐటీలో చదువుకుంటున్నప్పుడే శ్రీపాద్ పాణ్యం ఆలోచనలు భిన్నంగా ఉండేవి. తోటి విద్యార్థులందరూ పెద్ద పెద్ద కంపెనీల్లో జాబ్స్ కొట్టి… సెటిలవ్వాలని కలలు కనేవారు… శ్రీపాద్ కి మాత్రం స్టార్టప్స్ లో పనిచేయాలని… వీలైతే కొన్ని స్టార్టప్స్ పెట్టి పది మందికి ఉపాధి కల్పించాలని అనుకునేవాడు. ఆ ఆలోచనలకు తగ్గట్లే… ఈయన ఏటూ జెడ్ సర్వీస్ సంస్థ అర్బన్ క్లాప్ లోని ద వాల్ ఆఫ్ అర్బన్ క్లాస్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. కంపెనీలో యంగెస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఈయనే.

undefined

undefined


2012లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తిచేశారు శ్రీపాద్. వెంటనే యాప్ మీ డాట్ కాంలో అసిస్టెంట్ మేనేజర్ గా చేశారు. డిజిటల్ మార్కెటింగ్ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. కొన్నాళ్లకు అర్బన్ క్లాప్ స్టార్టప్ నుంచి ఫోన్ వచ్చింది. తమ కంపెనీలో చేరాలంటూ కోరారు. తమ స్టార్టప్ లోనున్న అవకాశాలను వివరించారు. అయితే ఆరంకెల జీతంతో యాప్ మీలో బాగానే సెటిలయ్యానని … ఉద్యోగం మారే ఆలోచన లేదని ముఖంమీదే చెప్పేశారు శ్రీపాద్. అయినా వాళ్లు ఊరుకోలేదు. మళ్లీ మళ్లీ ఫోన్ చేసి మాట్లాడారు.

“అప్పుడే నాకు అర్థమయ్యింది… పెద్ద పేరున్న కంపెనీలో పనిచేయడం కన్నా… వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవాలని. ఉద్యోగం మారడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. స్టార్టప్పే అయినా మంచి అవకాశాన్ని వదులుకోకూడదనుకున్నాను. చిన్న కంపెనీ, స్మాల్ టీం అన్న ఆలోచనలను మనసునుంచి తీసేశాను” శ్రీపాద్

ఒక పనిని నేను చేయగలనా లేదా…? నా వల్ల వాళ్ల స్టార్టప్ కు ఏమైనా ఉపయోగముందా…? నాలో సత్తా ఉందా లేదా అని ప్రశ్నించుకున్నానని చెబుతున్నారు శ్రీపాద్. అర్బన్ క్లాప్ టీంపై నమ్మకం ఏర్పడింది. వెంటనే మార్కెటింగ్ అండ్ ప్రోడక్ట్ మేనేజర్ గా అర్బన్ క్లాబ్ లో చేరిపోయారు. ప్రొడక్ట్ టీంలో చేరిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. మార్కెట్ లో కంపెనీ పరుగులు తీస్తున్నప్పుడు హయరార్కీ మొదలయ్యింది. ఇంజనీరింగ్ టీం పెరిగింది. మల్టిపుల్ ప్రాడక్ట్స్ లో పనిచేయాల్సి వచ్చింది. అర్బన్ క్లాప్ మొబైల్ యాప్ గా ప్రారంభమయ్యింది. అయితే డిమాండ్ పెరగడంతో మొబైల్ వెబ్ సైట్, డెస్క్ టాప్ వెబ్ సైట్ గా మార్చాల్సి వచ్చిందంటున్నారు శ్రీపాద్.

అప్పటికీ మార్కెట్లో మాలాంటి కంపెనీ మరోటి లేకపోవడంతో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఎదుగుతున్న సమయంలో అలాంటివి తప్పవనుకున్నారు. “ దేశంలో ఈ కామర్స్ కంపెనీలు ప్రారంభమైనప్పుడు అలాంటి మోడల్స్ చాలా ఉండేవి. బడా కంపెనీలను చూసి స్టార్టప్ లు వచ్చాయి. మేం మాత్రం ఎలాంటి కాపీలు కొట్టకుండా సొంతంగా ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాల్సి వచ్చింది. ఇండియన్ మార్కెట్లో ఆల్ సర్వీసెస్ కంపెనీలో రంగంలో మాదే మొదటిది. ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపడమే మా లక్ష్యం. అలాగే చేస్తున్నాం అంటారు శ్రీపాద్.

ఏడాది వ్యవధిలోనే అర్బన్ క్లాప్ సంస్థ ఎంతగానో ఎదిగింది. అందించే సేవలు, ఉత్పత్తుల్లో గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. కస్టమర్లు కోరుకున్నట్లు మారారు. రివర్స్ ఆక్షన్ మోడల్ పై దృష్టిపెట్టారు. కస్టమర్లు తమకు నచ్చిన సర్వీసును ఎంచుకునే వీలుంది. ప్రొఫెషనల్స్ సేవలు అవసరమా కాదా అన్నది వారే నిర్ణయిస్తారనేది శ్రీపాద్ అభిప్రాయం.

సర్కారీ కొలువులా టైంకి వచ్చి, సాయంత్రం కాగానే వెళ్లిపోతే స్టార్టప్ కంపెనీల్లో పనిచేయలేమంటారు శ్రీపాద్. ఉదయం 8.30కి ఆఫీసుకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చేటప్పటికీ రాత్రి 10 లేదా 11 అయ్యేది. కంపెనీ ఉత్పత్తులు, సేవల్లో ఎలాంటి సమస్యలు రాకుండా శ్రీపాద్ పర్సనల్ కేర్ తీసుకునేవారు. సమస్య పరిష్కారమయ్యేవరకు నిద్రపోడు.

 శ్రీపాద్ ఒక అల్టిమేట్ పెర్ఫెక్షనిస్ట్. మంచి ఆలోచనాపరుడు. విజ్ఞానభాండాగారం. ఏపని చేసినా ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. అది చాలా మంచి పద్ధతి. ఏపని అయినా పూర్తి ఏకాగ్రతతో చేస్తారు-రాఘవ్ చంద్ర (అర్బన్ క్లాప్ వ్యవస్థాపకుడు) 

కంపెనీ వ్యవస్థాపకులే కాదు… తోటి ఉద్యోగులుకూడా శ్రీపాద్ గురించి ఇదేమాట చెప్తారు. ఉద్యోగుల్లో ఎవరైనా ఒక సమస్యను తీసుకెళ్తే… కాదనకుండా పరిష్కరిస్తారు. ఆ ఉద్యోగి చిరునవ్వుతో వెనుదిరిగేలా చేస్తారు. అయితే శ్రీపాద్ మితభాషి. కస్టమర్ల ముఖంపై చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యం. అర్బన్ క్లాప్ లో పనిచేయడానికి కారణం తోటి ఉద్యోగులే అంటారు. 

ప్లంబర్ నుంచి సఫ్ట్ వేర్ సర్వీసుల వరకు అన్ని రకాల సేవలందిస్తున్నామని… ప్లంబింగ్ సర్వీసుకు డిమాండ్ ఎక్కువగా ఉన్నా… పని చేసేవారు దొరకడం లేదని చెప్పారు శ్రీపాద్. ఏ పనినీ తక్కువగా చూడకూడదనేది ఈయన ఫిలాసఫీ. చిన్న చిన్న సమస్యలను పరిష్కరించినప్పుడు వచ్చే తృప్తి మాటల్లో వర్ణించలేమంటున్నారు. అర్బన్ క్లాప్ సంస్థ ఇటీవలే యోగా సర్వీసును కూడా ప్రారంభించింది. నెలకు పదివేలు కూడా సంపాదించలేని యోగా టీచర్స్… అర్బన్ క్లాప్ లో చేరి 40 వేల వరకు ఆర్జిస్తున్నారు.

“ మన దేశ జనాభా పెరుగుతోంది. దేశం అభివృద్ధిబాటలో పయనిస్తోంది. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఇవి చాలా మంచి రోజులు. అర్బన్ క్లాప్ కాన్సెప్ట్ నచ్చే ఇందులో చేరాను. సొంతంగా అవకాశాలు సృష్టించుకోవడం,ఆర్థికంగా స్థిరపడాలనుకునేవారికి ఇదో మంచి వేదికగా మారింది. మనం చేస్తున్న పనిని ప్రేమించాలి. అదే అర్బన్ క్లాప్ టీంకు స్ఫూర్తి”- శ్రీపాద్