లోదుస్తుల కొనుగోళ్లలో లేడీస్‌ను బీట్ చేసిన జెంట్స్

దూసుకొస్తోన్న లోదుస్తుల సెగ్మెంట్ఆన్ లైన్ సేల్స్ లో మగాళ్లదే పైచేయిమగువల లోదుస్తులకోసం మగాళ్ల వెతుకులాట2018నాటికి 30వేల కోట్లకు దాటుతుందని అంచనా

లోదుస్తుల కొనుగోళ్లలో లేడీస్‌ను బీట్ చేసిన జెంట్స్

Thursday April 23, 2015,

2 min Read

సెక్సీభామ సన్నీలియోన్‌కి తగిన లోదుస్తులు ఎక్కడ దొరుకుతాయ్ ? ఫ్యాషన్‌గా కనపడే లోదుస్తులు కొనాలంటే ఎలా? కచ్చితంగా ఇండియాలో మాత్రం కాదు. ఎందుకంటే ఇలాంటివి ఇక్కడ దొరకుతాయా అసలు? ఇవన్నీ ఇకప్పటి ప్రశ్నలు. ప్రస్తుతం ఈ క్వశ్చన్లు వేయక్కర్లేదు. భవిష్యత్ లో ఉత్పన్నం కావుకూడా. ఎందుకంటే భారత్‌లో కూడా లోదుస్తుల మార్కెట్ ఒకప్పటిలా లేదు. అత్యంత వేగంగా దూసుకుపోతోన్న సెగ్మెంట్స్‌లో లోదుస్తుల సెగ్మెంట్ ముందువరుసలో ఉండంటం విశేషం.

image


భారత ఈ కామర్స్ బూమ్‌ని క్యాష్ చేసుకోవడంలో లోదుస్తుల మార్కెట్ ముందుందనే చెప్పాలి. అమ్మకాల పరంగా చూసినా దేశంలో అన్నింటికంటే లోదుస్తుల సేల్స్ మాత్రమే లాభదాయంగా సాగుతున్నాయి. సమీప భవిష్యత్‌లో ఇది మరింత గిరాకీ ఉన్న సెగ్మెంట్‌గా మారబోతోందని వ్యాపార వేత్తలు అంచనావేస్తున్నారు.

అబ్బాయిలదే పై చేయా ? ఇది ఎలా సాధ్యం ?

“ భారత్ లో ప్రస్తుతం లోదుస్తుల మార్కెట్ 15వేల కోట్లు.2018 సరికి ఇది రెట్టింపై 30వేల కోట్లకు చేరుతుంది అంచనా.” లోదుస్తులను కొనేవారంతా మగువలే అనే అభిప్రాయం మార్చుకోవాల్సిందే. అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా ఆన్‌లైన్లో లోదుస్తుల కోసం వెతుకుతున్నారు. దీన్నొక మనోహరమైన విషయంగా మనం గుర్తించాలి. మొన్నటి వ్యాలంటైన్స్‌ డే రోజు సేల్స్‌లో ఆసక్తికరమైన నిజాలు తెలిశాయి. పార్ట్నర్స్‌కి క్లాసిక్ గిఫ్ట్ ఇచ్చే కంటే కొద్దిగ విభిన్నంగా ఇవ్వాలనే ఆలోచనా ధోరణి మగాళ్లలో కనిపించింది. ఆన్‌లైన్ స్టోర్స్ కూడా మగువలైనా, మగాళ్లైనా ఫర్వాలేదంటూ... కొనేవాళ్లను ఎంకరేజ్ చేస్తున్నాయి. “సాధారణంగా లోదుస్తులను ఆన్ లైన్లో పర్చేజ్ చేయడానికి అబ్బాయిలు సిగ్గుపడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పులొచ్చాయి. కన్సెషన్ ఇస్తే మరింత ఎక్కువ సమయం లోదుస్తులను ఎంచుకోడానికి, కొనడానికి అబ్బాయిలు కేటాయిస్తున్నారు,” అని జివామి డాట్ కామ్ ఫౌండర్ సిఈఓ రిచాకార్ అంటున్నారు.

ఇంటిమేట్స్ సెగ్మెంట్‌లో ఇప్పుడు డిమాండ్‌కు సరిపడిన సప్లై చేయడం అంత సులభం కాదనేది ఆన్‌లైన్‌లో లోదుస్తులను అమ్మకాలపై పెట్టుబడులు పెట్టిన వారి అభిప్రాయం.

“చాలావరకూ హై ఎండ్ మగువలు విదేశాల్లోనే లోదుస్తులను కొనుక్కోవడం మనకి తెలిసిన విషయమే . ఎందుకంటే మన దేశంలో ఆప్షన్ లేకపోవడే దీనికి ప్రధాన కారణం,” క్లోయి కో ఫౌండర్ నేహా కాంత్ అంటున్నారు. ఈ కారణంతోనే తాను లోదుస్తుల కోసం ప్రత్యేక ఆన్ లైన్ స్టోర్ ప్రారంభించానని అన్నారామె.

ప్రెట్టీ సీక్రెట్స్ పేరుతో నైట్‌వేర్ బొటిక్‌ని కరణ్ బెహల్ ప్రారంభించారు. ఈకామర్స్ లోదుస్తుల బిజినెస్ కు ఎంతగా ఉపయోగపడిందనే విషయాన్ని వివరిస్తూ..

“కస్టమర్ల అవసరాలకు అనుగూణంగా .. ఎలాంటి అడ్డంకులు లేకుండా.. దూసుకుపోవడానికి ఆన్ లైన్ సేల్స్ ఎంతగానో దోహద పడ్డాయి”, అని కరణ్ చెప్పుకొచ్చారు. ఈ సెగ్మెంట్ లో సీక్రెట్స్ అన్నింటికంటే ముందే అడుగుపెట్టింది. ఇదే ఆన్ లైన్ కస్టమర్ల అభిరుచిని ముందుగానే పసిగట్టే అవకాశం తమకు లభించిందని అంటున్నారు కరణ్.

దేశ మార్కెట్లో మగువల లోదుస్తుల సెగ్మెంట్ అత్యంగ వేగంగా దూసుకుపోతోంది. ఇక్కడి జనాల పల్స్ తెల్సుకున్న ఫ్రెంచ్ లగ్జరీ లోదుస్తుల బ్రాండ్ 2012లో స్టోర్‌ని ప్రారంభించింది. సాయంకాల దుస్తుల సెగ్మెంట్ లో దీన్ని కాలిఫోర్నియా కలెక్షన్ ఫాలో అయింది. ఇందులో పార్టీ, క్లబ్ వేర్ కూడా ఉండటం విశేషం. పెద్ద సంఖ్యలో కస్టమర్లను తమవైపు తిప్పుకోవడంలో ఇవి విజయం సాధించాయి.

ఇక చివరగా.. భారత్‌లో మెట్రో నగరాలతో పాటు టూటైర్, త్రీటైర్ నగరాల్లో సైతం లోదుస్తుల అమ్మకాల గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. డిమాపూర్, కటిహార్ లాంటి ప్రాంతాలతో పాటు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉండే కస్టమర్లు సైతం మౌస్ తో క్లిక్ చేసి లోదుస్తులను ఆర్డర్ ఇచ్చి ఇంటికి తెప్పించుకుంటుండటం కొసమెరుపు.