అమ్మాయిల రక్షణ కోసం సేఫ్టీ బ్యాగ్

0

అమ్మాయిల సేఫ్టీకోసం ఓ సరికొత్త ప్రొడక్ట్ ఇది. హ్యాండ్ బ్యాగ్ నుంచే పోలీస్ స్టేషన్‌కి అలర్ట్ చేసే టెక్నాలజీ ఇది. అన్ని రంగాల్లో టెక్నాలజీ వ్యాపించడంతో ప్రతీదీ సులభతరం అవుతోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ.. అనేక సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా ఇటీవల మనం చూస్తున్నాం. అయితే అదే పరిజ్ఞానం.. ముగువల భద్రతకు కోసం ఉపయోగపడితే ? చదవడానికి ఎంతో బాగుంది కదా ? కరెక్టే దీన్నే నిజం చేసి చూపించారు తోట బాజీ.

“ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఎన్నో విషయాలపై అధ్యయనం చేసేవాడిని. చదువు మీద కంటే ఇతర విషయాలపైనే నాకు ధ్యాస ఎక్కువ. రొబోటిక్ టెక్నాలజీలో వచ్చే మార్పులను తెలుసుకొని, వాటితో కొత్త ప్రొడక్టులు తయారు చేయడమంటే నాకు చాలా ఇష్టం.” తోట బాజీ.
తోట బాజి(కుడి)
తోట బాజి(కుడి)

అసలేంటి సేఫ్టీ బ్యాగ్

సేఫ్టీ బ్యాగ్ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం తయారైంది. బ్యాగ్ పై నట్ ఉన్నట్లు ఓ పిన్ ఉంటుంది. అక్కడి నుంచి సర్వర్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఆపత్కాల సమయాల్లో దాన్ని ప్రెస్ చేస్తే 100 నెంబరుకు కాల్ వెళ్తుంది. కాల్ వెళ్లడానికి ఫోనుతో దాన్ని కనెక్ట్ చేసి ఉంచాలి. అయితే ముందుగా ఈ టెక్నాలజీని ఇంట్లో దొంగతనాలు జరగకుండా ఉండటానికి, పోలీసులకు అలెర్ట్ చేసేలా రూపొందించాను. కానీ ఢిల్లీలో నిర్భయ సంఘటనతో నా అభిప్రాయం మార్చుకున్నా. ఈ టెక్నాలజీ అమ్మాయిల సేఫ్టీ కోసం ఉపయోగించాలని నిశ్చయించుకున్నానని బాజీ చెబుతారు. చేతిలో మొబైల్ ఉన్నా.. అత్యవసర పరిస్థితుల్లో దాని నుంచి ఫోన్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. కానీ హ్యాండ్ బాగ్ పై ఉన్న చిన్న బటన్ నొక్కితే అటు మొబైల్ ద్వారా కాల్ 100కు కనెక్ట్ అవుతుంది. వెంటనే నెంబర్ లొకేషన్‌ను ట్రేస్ చేయడం ద్వారా పోలీసులకూ అక్కడికి త్వరగా చేరుకోవడానికి తేలిక అవుతుంది.

ఉమన్ సేఫ్టీ బ్యాగ్
ఉమన్ సేఫ్టీ బ్యాగ్

ఎలక్ట్రానిక్స్ బ్రాంచిలో బిటెక్ పూర్తి చేసిన తోట బాజి కాలేజీ రోజుల నుంచి ఎన్నో విషయాలపై ఆసక్తి కనబరిచేవారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట బాజీ సొంతూరు. మధ్యతరగతి కుటుంబ నేపధ్యం గల బాజీ .. ఇంజనీరింగ్ తర్వాత ఫిజిక్స్ మాస్టార్ అవతారం ఎత్తారు. క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఐటి ఉద్యోగం వచ్చినా దానికి వెళ్లలేదు. ఎప్పుడూ రీసెర్చ్ అంటూ గంటల కొద్దీ ల్యాబ్‌లోనే గడిపేవారు. దీంతో పట్టా చేతికొచ్చింది కానీ మంచి పర్సంటేజి రాలేదు. ఇన్నోవేటివ్ థాట్స్‌తో బీటెక్ పూర్తయ్యే నాటికి దేశ వ్యాప్తంగా దాదాపు 100కు పైగా పేపర్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. అన్ని విషయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం దానికి ఎలాంటి టెక్నాలజీ ఉపయోగపడిందనే విషయాలను తెలుసుకోవడం బాజీకి చిన్నప్పటి నుంచి అలవాటు. ఇదే తనని ఇప్పుడిక్కడ నిల్చోబెట్టిందంటారాయన.

భవిష్యత్ ప్రణాళికలు

ఫండింగ్ వస్తే అమ్మాయిల సేఫ్టీ టూల్ తయారీ పరిశ్రమను పూర్తి స్థాయిలో జనం ముందుకు తీసుకొస్తానంటున్నారు. టెక్నాలజీ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలని నమ్మే తనలాంటి వారితో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబ్తున్నారు. తన క్లాస్ మేట్ ఎంఎన్ కే గుప్తా తో కలసి స్టార్టప్ ప్రారంభించిన బాజీ దాన్ని ఓ పూర్తి స్థాయి పరిశ్రమగా మార్చాలనుకుంటున్నారు.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik