ఇది చిన్నారుల సినిమా పండుగ !

0

హైదరాబాద్ కేంద్రంగా 19వ అంతర్జతీయ బాలల చల చిత్రోత్సవం కనుల విందుగా ప్రారంభమైంది. దాదాపు 14దేశాల నుంచి వివిధ భాషల్లో చిత్రాలు ఈ ఉత్సవంలో ప్రదర్శనకు పెట్టారు. ఇరాన్, రష్య, కొరియా, ఫిలిప్పిన్, బ్రెజిల్, కెనడాల నుంచి వచ్చిన చిత్రాలు ఈసారి పాల్గొన్నాయి. భారత్ నుంచి ఏడు చిత్రాలు స్క్రీనింగ్ అర్హత పొందడం విశేషం. ఈ చలన చిత్రోత్సవాలు చాలా ఏళ్లుగా హైదరాబాద్ ఆథిత్యం ఇస్తోంది. వేరే చోట్ల దీన్ని జరపాలని చూసినప్పటికీ ఇక్కడున్న అనుకూల పరిస్థితులు వేరెక్కడా లేకపోవడం మన భాగ్యనగరంలోనే కొనసాగిస్తున్నారు.

“నైతిక విలువలు పెంచే పాత్రలు గల గొప్ప స్థానిక కథల ఆధారంగా చిత్రాలు నిర్మించాలి.” నటుడు ముఖేష్ ఖన్నా

శక్తి మాన్ గా సుపరిచితుడైన ముఖేష్ ఖన్నా అవార్డులను సాధించడానికి చిత్రాలు నిర్మించాలనుకునే దోరణి మార్చుకోవాలని అభిప్రాయపడ్డారు.

రంజింప జేసిన ‘బ్లూ మౌంటెన్’

రియాల్టి షోల ప్రభావం చిన్నారులపై ఎలా ఉందనే కధాంశంతో తెరకెక్కిన బ్లూ మౌంటెన్ ఆహుతులను ఆలోచనకు గురిచేసింది.

“కధలో ఎమోషన్ క్యారీ అయినంత సేపూ సినిమాకు ప్రేక్షకుడు దూరం కాడు.” బ్లూ మౌంటెన్ దర్శకుడు సుమన్ గంగూలి

బ్లూ మౌంటెన్ తన మొదటి సినిమా అని చెప్పుకొచ్చిన ఆయన రియాల్టి షోలు సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి, మురీ ముఖ్యంగా చిన్నారులపై రియాల్టి షో ల ప్రభావం ఏ స్థాయిలో ఉందో చూపించే ప్రయత్నం చేశారన్నారాయన. మధ్య తరగతి జనంపై ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. కొన్ని సార్లు ఆ విషయం ఆలోచించినప్పుడు తాను కూడా ఎమోషన్ కి గురవుతానన్నారు. దీంతో పాటు సినిమా అంటే ఆర్ట్,సైన్స్, కామర్స్ మూడు సబ్జెట్లు ఉండాలన్నారు. కళకు సైన్స్ జోడించడంతో పాటు కమర్షియల్ గా జనానికి దగ్గరైతే అది హిట్ సినిమా అవుతుందన్నారు. అది బాలల చిత్రమైనా మరేదైనా కావొచ్చు. థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు బోర్ ఫీల్ అయితే ఇక సినిమా తీయాల్సిన అవసరం లేదన్నారు. తన సినిమా బ్లూ మౌంటెన్ లో వీటిని క్యారీ చేశానన్నారాయన.

ఫిలిప్పిన్స్ చిత్రం ‘స్కేర్ క్రౌ’

సామాజిక నేపథ్యమే ఈ సినిమా కధాంశం. ఓ నిరుపేద కుటుంబం పై దొంగతనం అనే మచ్చ ఎంతదాకా తీసుకెళ్లిందనేది సినిమాలో చూపించారు. పాపాయ్ అనే ఓ బుడతుడిపై దొంగ అనే ముద్ర వేయడం వల్ల తాను స్కూల్ కు వెళ్లడానికి కూడా భయపడే పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ డ్రామా తో సాగిన సినిమా 90నిముషాల నిడివి తో సాగుతుంది. మన దేశానికి దగ్గరగా ఉండే సామాజిక పరిస్థితులు ఫిలిప్పిన్స్ వి. మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన కధలా అనిపిస్తుంది. కధా, కధనమే ఈ సినిమాకి ప్లస్ గా చెప్పాలి.

బాలు మహేంద్ర తీసిన ది జనరేషన్స్, కమల్ సేతు తీసిన ది ఎల్లో ఫెస్ట్, అభిషేక్ సిన్హా తీసిన నాట్ అవుట్, తెలుగు సినిమా అబ్దుల్లా లు ప్రదర్శనలో భారత్ తరుపు నుంచి ప్రదాన ఆకర్షణగా నిలిచాయనే చెప్పాలి.వేల మంది విద్యార్థులు, చిన్నారులు ఈ చలన చిత్రోత్సవాలు చూడటానికి వచ్చారు. ప్రసాద్ ఐ మ్యాక్స్ లో ప్రదర్శనలన్నీ హౌస్ ఫుల్ కావడం విశేషం.

మరిన్ని సామాజిక నేపథ్యంతో వచ్చే సినిమాలకు ఇవి నాంది పలికేలా ఈ బాలల చలన చిత్రోత్సవాలు కనిపిస్తున్నాయి.

ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Stories by ashok patnaik