ఆన్‌లైన్లో స్వైన్ ఫ్లూ మందుల ఫ్లాష్ సేల్

టీకా మందుల వ్యాపారానికి కొత్త మోడల్ముందస్తు రిజిస్ట్రేషన్స్ చేయించుకుని మరీ వ్యాపారం ఆన్ లైన్లో ప్లూ వ్యాక్సిన్స్ అమ్మకాలు

Wednesday April 22, 2015,

3 min Read

ఎలాంటి ఉత్పత్తైనా.... మార్కెట్ చేయాలంటే... ఉత్పత్తి రాక ముందే మార్కెట్లో హైప్ క్రియేట్ చేయాలి. దాని వల్ల ఉత్పత్తి రాకముందే విజయం సొంతమవుతుంది. అదే షియోమీ సక్సెస్ వెనుక సీక్రెట్. దేశంలో ఇలాంటి ముఖ్యమైన టీకాల అవసరాన్ని గుర్తించడం వల్లే తాము కూడా ఇలాంటి మోడల్‌ను అనుసరించాల్సిన వచ్చిందని మెడ్ యోగ్ సంస్థ చెబ్తుంది. ఇంతకీ ఈ స్వైన్ ఫ్లూ టీకాలను ఆన్ లైన్ లో ఎందుకు అమ్మాల్సి వచ్చింది ? ఈ ప్రక్రియలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రణత్ భండానీ వివరిస్తున్నారు. 

ఆయన మాటల్లోనే.. 


''స్వైన్ ఫ్లూ దేశవ్యాప్తంగా పౌరులలో భయాందోళన సృష్టించింది. అందరికీ టీకాలు అందించాలనే ఆలోచన ఉన్నప్పటికి...టీకాలు తక్కువ సరఫరా ఉంది. దీంతో టీకాలు సేకరించాలని మేము దాదాపు ప్రతి ఆసుపత్రి, డయాగ్నస్టిక్స్ సెంటర్, టీకా సెంటర్, మందులు తయారు చేసే సంస్థలను..పంపిణీ సంస్థలను సంప్రదించాము. కానీ ఎవ్వరి దగ్గర పెద్ద ఎత్తున టీకా ముందులు లేవు. దాదాపు రెండు వారాలు ఫాలో ఆప్ తర్వాత, కావాల్సిన స్వైన్ ఫ్లూ మందును అందించడానికి ఓ డయాగ్నోస్టిక్ కేంద్రాల చైన్ సెంటర్స్ నిర్వాహకులు ముందుకు వచ్చారు.. అయితే వాటికి చాలా సమయం పడుతుందని చెప్పారు..

స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ దొరకుతుందన్న డయాగ్నస్టిక్స్ సంస్థ హామీతో.... మెడ్ యోగా సంస్థ ద్వారా ఆన్ లైన్ ‌లో విక్రయాలు ప్రారంభించాము. దానికి పది రోజుల వ్యవధిలోనే టీకా కోసం కావాల్సిన వారి నుంచి పేర్లు నమోదుకు అంగీకరించడానికి పోర్టల్ ప్రారంభించాము. మాకు 1,200 పైగా టీకాలు కోసం దరఖాస్తులు అందాయి. కానీ మార్కెట్ లో అందుబాటులో ఎటువంటి టీకాలు లేవు. అప్పటికే వాగ్దానం చేసిన డయాగ్నస్టిక్స్ సెంటర్ అనుకున్న సమయానికి మందులు ఇవ్వలేని పరిస్థితి. మరో వైపు మాకు రిజిస్ట్రేషన్లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. అవసరమైన వారికి రెండో దశలో ఇస్తామని చెబుతున్నాము. అదే సమయంలో, మేము టీకాలు సేకరించాలని మా ప్రయత్నాలు వేగవంతం చేశాము. డిమాండ్ భారీగా ఉండడంతో బెంగుళూర్ తో పాటు దేశంలోని అన్ని ప్రధాననగరాల్లోని పంపిణీదారులను సంప్రదిస్తూనే ఉన్నాము. మాకు ఒక్కటే సమాధానం మందులు అందుబాటులో లేవు.... అని మాత్రమే వచ్చేది. వ్యాక్సిన్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్నప్పటికి తయారీదారులు డిమాండ్‌కు తగ్గ సరఫరా అందించే పరిస్థితి లేదు. తయారీదారులపై ప్రభుత్వ నియంత్రణ కూడా ఉండడంతో మేము అనుకున్నది సాధించడం కష్టమన్న భావనకు వచ్చేశాము. అటు రాజస్థాన్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో మాకు మందులు కోసం ఆర్డర్లు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి. అయితే మొదటి దశలో మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో.... అసంతృప్తికి లోనయ్యాము. అయితే వినియోగదారుల నుండి విపరీతమైన స్పందన పొందిన తర్వాత... మేము బెంగుళూరు లోని అన్ని ప్రధాన ఆరోగ్య కేంద్రాల డేటాను సేకరించే పనిలో పడ్డాము. చివరకు 18 మార్చి 2015 న అపోలో హాస్పటల్స్ నుంచి కమిట్ మెంట్ ప్రకారం వ్యాక్సిన్స్ లు అందుకున్నాము. అనుకున్న సమయానికి వ్యాక్సిన్ అందించిన అపోలో ఆస్పత్రి టీమ్ కు ధన్యవాదాలంటారు ప్రణత్.

అయితే అపోలో టీం ఫస్ట్ ఫేజ్ లో కేవలం వంద టీకాలు మాత్రమే ఇచ్చారు. అప్పటికే డిమాండ్ కు తగ్గ సప్లయి లేకపోవడంతో ఏమి చేయాలో అర్ధం కాని పరిస్థితి ఉంది. కానీ రెండు రోజుల తర్వాత అంటే మార్చి 20 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అనుకున్న దాని కంటే ఎక్కువ సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి వ్యాక్సిన్ లు మాకు అందాయి. అది నమ్మ లేని నిజం. మా అంచనాలను తలకిందిల చేస్తూ.... ప్రతి వ్యక్తికి రెండు వ్యాక్సిన్‌లు అందించే స్థాయి వచ్చేసింది. అప్పటికే పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు ఉండడంతో... కొన్ని గంటల వ్యవధిలోనే అన్ని టీకాలు అమ్ముడైపోయాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి టీకాలు సరఫరా చేసి మాపై ఉన్న నమ్మకాన్ని మరింతగా పెంచుకోగలిగాము. మేము ముందుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... ఎవరికి మందులు కావాలో వాళ్లకే అందించగలిగాము. ఇంకా స్వైన్ ప్లూ బాధితులకు ప్రచార ఖర్చులు లేకుండా తక్కువ ఖర్చుతో టీకాలు అందించగలిగాము. ఇంకా ఆనందించాల్సిన విషయం ఏమంటే.... ఇంకా 2,500 పైగా టీకాలు మరో సారి రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధం చేసి ఉంచాము.

మొత్తానికి ఆన్ లైన్ వ్యాక్సిన్ అమ్మకాల్లో... గజిబిజిగా ఉన్న ప్రక్రియను సరళీకృత చేశాము. ఇంకా ఆన్ లైన్లో సమాచారం, పుస్తక రూపంలో అందుబాటులోకి తీసుకువచ్చామంటారు'' మెడ్ యోగ కో ఫౌండర్ ప్రణత్

Campaign url :http://www.medyog.com/swineflu/