స్టార్టప్ హైరింగ్ కి ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది!

0

స్టార్టప్ హైరింగ్ మేక్ ఇట్ ఏ కేక్ వాక్ అని విషయంపై ఈ ఏడాది మొదటి స్టార్టప్ సాటర్ డేలో ఆసక్తి కరమైన చర్చ జరిగింది. సాధారణంగా స్టార్టప్ లో మొదట ఫౌండర్ , కో ఫౌండర్ కంపల్సరీ. ఆ తర్వాత తీసుకున్న ఉద్యోగిని బట్టే ఆ స్టార్టప్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఆ హైరింగ్ ప్రక్రియలో కొన్ని విషయాల్లో జాగ్రత్త పాటిస్తే ఊహించిన దానికంటే మంచి ఫలితాలు అందుతాయని ఇందులో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు.

“స్టార్టప్ కు హైరింగ్ అనేది బయటకు కనపడని అతిపెద్ద సవాలు,” సుబ్బరాజు

స్టార్టప్ లీడర్ షిప్ ప్రొగ్రాం కి ప్రొగ్రాం లీడ్ గా వ్యవహరిస్తున్న సుబ్బరాజు చెప్పిన ప్రకారం స్టార్టప్ లకు మొదటి ఉద్యోగులను తీసుకోవడం అతి పెద్ద సవాలే. తర్వాత వచ్చే ఉద్యోగులు మొదటి ఉద్యోగులు చూపించిన బాటలో పయనించాల్సి వస్తుంది. దీంతో పాటు ఫౌండర్ విజన్ ను అర్థం చేసుకునే ఉద్యోగి లభిస్తే ఆ స్టార్టప్ కు తిరుగు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

హైరింగ్ అంటే టీం బిల్డింగ్

స్టార్టప్ సక్సెస్ లో టీం అనేది ప్రధాన భూమిక పోషిస్తుంది. కానీ సరైన టీంని తయారు చేయడం తోనే ఆ స్టార్టప్ సక్సెస్, ఫెయిల్యూర్ ఆధారపడి ఉంటుంది. ఫౌండర్ విజన్ పూర్తి కావాలన్నా, ఫండ్ రెయిజింగ్ లో ఇన్వస్టర్ పెట్టుబడి పెట్టాలన్నా ఇలా ఏం జరగాలన్నా సంస్థలోని మొదటి ఉద్యోగి, అంటే కో ఫౌండర్ లేదా ఇంజనీర్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ వ్యక్తి స్కిల్స్ ఆధారంగానే తర్వాతి రౌండ్ ఫండింగ్ ను దాటుకొని చివరాఖరికి సక్సెస్ ఫుల్ స్టార్టప్ గా మారడానికి అవకాశాలుంటాయి. ఆ తర్వాత ఎంతమంది ఉద్యోగులను తీసుకున్నా అదంతా మొదటి ఉద్యోగి పనితీరుతో ముడిపడి ఉంటుందని చర్చలో పాల్గొన్న వారు అభిప్రాయపడ్డారు.

“కో ఫౌండర్ సరిగ్గా ఉంటే, టీం బిల్డింగ్ అంతే సరిగ్గా ఉంటుంది,” సుబ్బరాజు

టీం బిల్డింగ్ లో ప్రధామాంకం కో ఫౌండరే అనే అభిప్రాయం ఆయన వెలిబుచ్చారు. పైన చెప్పినట్లు టీం అంతా సులభంగా తయారు కావాలంటే అది కో ఫౌండర్ హైరింగ్ పైనే ఉంటుంది.

హ్యాకథాన్ సపోర్ట్

కో ఫౌండర్ ని హైర్ చేయడంలో మొదటి మార్గంగా హ్యాకథాన్ అని చర్చ సాగింది. హ్యాకథాన్ ద్వారా అయితే సరైన స్కిల్ ఉన్న వ్యక్తిని పసిగట్టవచ్చు.

“ఈవెంట్ ఏర్పాటు చేసి, హ్యాకథాన్ ద్వారా కో ఫౌండర్ ని ఎంచుకోవడం చాలా సులువు,” రాజత్

హ్యాక్ మేనియా ఫౌండర్ అయిన రాజత్ చెప్పిన ప్రకారం హ్యకథాన్ ద్వారా టెక్నికల్ గా అవగాహన ఉన్న వ్యక్తిని తీసుకుంటే స్టార్టప్ కు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. సాధారణంగా హైరింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయించడం స్టార్టప్ కు సాధ్యం కాదు. అలాంటప్పుడు సరైన టాలెంట్ ను గుర్తొంచాల్సివస్తే హ్యాకథాన్ ఒక్కటే మార్గమని ఆయన చెప్పుకొచ్చారు. హ్యాకథాన్ మద్దతుతో వండర్స్ క్రియేట్ చేయొచ్చన్నారు. భవిష్యత్ లో ఎన్నో రకాలుగా ఉద్యోగులను ఎన్నుకొచ్చు. కానీ మొదటి ఉద్యోగి విషయంలో ఇదొక్కటే సరైన మార్గం. దీన్ని ఫాలో అయితే స్టార్టప్ సక్సెస్ రేటుని ముందే చెప్పియొచ్చని రాజత్ అంటున్నారు.

హైరింగ్ లో జాగ్రత్తలు

హైరింగ్ విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తల్లో కొన్ని ఈ చర్చ ద్వారా తెలిశాయి.

  1. కో ఫౌండర్ ని హైర్ చేయాలనుకున్నప్పుడు అతను టెకీ అయితే స్టార్టప్ కు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
  2. కో ఫౌండర్ స్టార్టప్ మొదటి ఉద్యోగి కనక భవిష్యత్ లో అతనే టీంకు రోల్ మోడల్ అయ్యే అవకాశాలున్నాయి.
  3. భారీ స్థాయిలో జీతాలను ఆఫర్ చేయాల్సిన అవసరం స్టార్టప్ లకు లేదు.
  4. హ్యాకథాన్ ద్వారా స్కిల్ చూసినప్పటకీ, ఫౌండర్ విజన్ ను అర్థం చేసుకునే వ్యక్తినే కో ఫౌండర్ గా తీసుకోవాలి.
  5. హైరింగ్ విషయంలో పారదర్శకంగా ఉంటే సక్సస్ టీం బిల్డింగ్ సాధ్యపడుతుంది. తద్వారా స్టార్టప్ సక్సస్ అవుతుంది.

హైరింగ్ విషయంలో ఔట్ సోర్సింగ్ సాయం తీసుకున్నప్పటికీ ఫౌండర్ చివరి నిర్ణయం తీసుకుంటేనే, అది భవిష్యత్ లో స్టార్టప్ ఎదుగుదలకు సాయపడుతుందని ముగించారు సుబ్బరాజు.
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories

Stories by ashok patnaik