ఇక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్లు లభించును..!!

ఇక్కడ పవర్ పాయింట్ ప్రజంటేషన్లు లభించును..!!

Monday January 11, 2016,

3 min Read

ఐడియా, కంటెంట్! ఈ రెండూ ఉంటే స‌రిపోతుందా? బాస్ ను మెప్పించాలంటే ప్ర‌జంటేష‌న్ ప‌వ‌ర్ ఫుల్ గా ఉండాలి. చూడ‌గానే ప్రాజెక్టు ఆక‌ట్టుకోవాలి. మ‌రి అంత ప‌ర్ ఫెక్టుగా ప‌వర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ సిద్ధం చేయ‌డం సాధ్య‌మ‌నా? సాధ్యమే అంటోంది స‌్కెచ్ బ‌బుల్.

ఆశిష్ (కో ఫౌండర్), పంకజ్ (సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్)

ఆశిష్ (కో ఫౌండర్), పంకజ్ (సోషల్ మీడియా స్ట్రాటెజిస్ట్)


కస్టమర్లు, ఇన్వెస్టర్లను ఆక‌ట్టుకోవాలంటే చ‌క్క‌టి ప్రజంటేషన్ అవ‌స‌రం. పవర్ పాయింట్ ప్రజంటేషన్ కి కంటెంట్ ఎంత ముఖ్యమో దానికి సరిపోయే డిజైన్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకోసం ప్రొఫెషనల్ డిజైనర్ ను పెట్టుకుంటే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ఒక్కో టెంప్లేట్ కు పది వేల నుంచి లక్ష రూపాయల దాకా ఛార్జ్ చేసే డిజైనర్లు కూడా ఉన్నారు. దాంతో ఎవరికి వారే సొంతంగా ప్రజంటేషన్స్ రూపొందించుకోవాల్సి వ‌స్తోంది. అంత క‌ష్ట‌పడ్డా ప్ర‌జంటేష‌న్ ప‌ర్ ఫెక్టుగా కుదురుతుందా అంటే చెప్ప‌లేం.

ఇంటర్నెట్ లో ఎడిటింగ్ టూల్స్ కి కొదవలేదు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, యాపిల్ కీ నోట్ థీమ్స్- ఇలా చాలానే ఉన్నాయి. హైకూ డెక్, కాన్వా, డెక్ సెట్, స్లైడ్ సోర్స్ లాంటి టూల్స్ డిజైన్లు, ఫొటోలు, ఫాంట్స్, కలర్స్, ట్రాన్సిషన్స్ అందిస్తున్నాయి. ఇన్ని ఉన్నా ఏదో లోటు! ఎంత జాగ్రత్తగా ప్రజంటేషన్ తయారు చేసినా ఏదో ఒక వంక ఉంటుంది. పైగా టైం వేస్టు యవ్వారం.

మరి ఎలా? కంటెంట్ కు అతికినట్టు సరిపోయే డిజైన్లు ఎక్కడుంటాయి? రెడీ టూ యూజ్ టెంప్లేట్స్, గ్రాఫిక్స్, థీమ్స్ ఎందులో దొరుకుతాయి? స్కెచ్ బబుల్ అని గూగుల్ లో టైప్ చేస్తే ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. టెంప్లేట్ సెలక్ట్ చేసుకొని, కంటెంట్ యాడ్ చేసి, మీ ఐడియాకు తగ్గట్టుగా కొన్ని బేసిక్ ఛేంజెస్ చేస్తే చాలు- అద్భుతమైన విజువల్స్ తో మీ పవర్ పాయింట్ ప్రజంటేషన్ రెడీ అయిపోతుంది!

ఏంటీ స్కెచ్ బబుల్?

ఆశిష్, రోహిత్. ఇద్దరూ టెకీలు. ఓసారి సెల్ ఫోన్ మానిటరింగ్ సాఫ్ట్ వేర్ ఒకటి తయారు చేశారు. ఇన్వెస్టర్లను ఇంప్రెస్ చేయడానికి వారికి ఒక మంచి ప్రజంటేషన్ అవ‌స‌ర‌మైంది. పవర్ పాయింట్ టూల్ పై ఇద్దరికీ పెద్దగా అవగాహన లేదు. చివరికి ఒక డిజైనర్ ను పట్టుకొని ప్రజంటేషన్ రూపొందించారు గానీ- అందుకు 500 డాలర్ల దాకా వదిలించుకోవాల్సి వచ్చింది! అప్పుడే వారిద్దిరికీ ఓ ఆలోచన వచ్చింది. ప్రజంటేషన్ డిజైన్ విషయంలో తమలా ఇబ్బందులు పడేవాళ్లు చాలా మందే ఉన్నారని గుర్తించారు. టైమ్, మనీ రెండూ వేస్ట్ కాకుండా ప్రీ డిజైన్డ్ ప్రొఫెషనల్ ప్రజంటేషన్ టెంప్లేట్స్ తయారు చేయాలని డిసైడయ్యారు. 2014 సెప్టెంబర్ లో తమ ఐడియాకు ఒక రూపమిచ్చారు. అదే స్కెచ్ బబుల్!

రెడీ టూ యూజ్ కాన్సెప్ట్..

50 పవర్ పాయింట్ టెంప్లేట్స్ తో మొదలైన స్కెచ్ బబుల్ లో ఇప్పుడు వెయ్యికి పైగా టెంప్లేట్స్ అందుబాటులో ఉన్నాయి. పది వేలకు పైగా స్లైడ్స్ దొరుకుతాయి. ప్రీ డిజైన్డ్ స్లైడ్స్ ను సులభంగా ఎడిట్ చేయవచ్చు. గంటల తరబడి సిస్టమ్ ముందు కూర్చోవాల్సిన పనిలేదు. పర్ ఫెక్ట్ గా పవర్ పాయింట్ ప్రజంటేషన్స్ తయారు చేసుకోవచ్చు. టెంప్లేట్స్ అన్నీ 4:3, 16:9 (వైడ్ స్క్రీన్) సైజులో ఉంటాయి. కొన్ని టెంప్లేట్స్ ఫ్రీగా కూడా దొరుకుతాయి. స్కెచ్ బబుల్ టెక్నికల్ పార్ట్ అంతా రోహిత్ చూసుకుంటాడు. ప్రజంటేషన్ల డిజైన్, మార్కెటింగ్ ఆశిష్ పని. తర్వాత వీరిద్దరితో పంకజ్ జాయిన్ అయ్యాడు. సోషల్ మీడియాలో కంపెనీని మార్కెట్ చేయడం పంకజ్ బాధ్యత.

స‌వాళ్లు దాటుకొని..

స్కెచ్ బబుల్ టీం మొదట్లో అనేక సవాళ్లు ఎదుర్కొంది. కస్టమర్ల అవసరాలేంటో తెలిసేది కాదు. బిజినెస్ ప్రజంటేషన్స్ లో వాడే కామన్ కలర్స్ తో ఎడిటింగ్ కు వీలుగా టెంప్లేట్ తయారు చేయాలనుకున్నారు. కానీ కస్టమర్లు వివిధ రకాల కలర్ కాంబినేషన్స్ కోరుకుంటారని తర్వాత అర్థమైంది. దాంతో మల్టీపుల్ కలర్ కాంబినేషన్లతో టెంప్లేట్స్ డిజైన్ చేయడం మొదలు పెట్టారు. అది బాగా వర్కవుట్ అయింది. ప్రస్తుతం కీ నోట్, గూగుల్ స్లైడ్స్, ప్రెజీలకు టెంప్లేట్స్ డిజైన్ చేసే పనిలో ఉన్నారు.

మిగతా కాంపిటీటర్లతో పోల్చుకుంటే స్కెచ్ బబుల్ లో తక్కువ రేటుకే టెంప్లేట్స్ అందిస్తున్నాం. మరో రెండు నెలల్లో మా వెబ్ సైట్ ను వన్ స్టాప్ షాప్ గా మారుస్తున్నాం. పవర్ పాయింట్, కీనోట్, గూగుల్ స్లైడ్స్, ప్రెజీ- ఇలా దేనికి టెంప్లేట్ కావాలన్నా మా వెబ్ సైటులో అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల ప్రజంటేషన్లకు సరిపోయే ఇలాంటి టెంప్లేట్స్ ఇంకే వెబ్ సైట్ లోనూ దొరకవు- ఆశిష్‌

ఎవరికి ఉపయోగకరం?

స్కెచ్ బబుల్ టెంప్లేట్స్ కేవలం ఇన్వెస్టర్లు, కస్టమర్లకే పరిమితం కాదు. కంపెనీ స్ట్రాటెజీని కళ్లకు కట్టడంలో మార్కెటింగ్ వాళ్లకు, సంస్థాగతమైన పట్టికల రూపకల్పనలో హెచ్ఆర్ సిబ్బందికి, వస్తువులను మార్కెట్ చేయడంలో ప్రోడక్ట్ మేనేజర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇన్వెస్టర్లను ఆకర్షించే మార్కెటింగ్ ప్లాన్స్, బిజినెస్ ప్రణాళికలు, టైమ్ లైన్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, ప్రోడక్ట్ మేనేజ్ మెంట్ డాక్యుమెంట్ల తయారీలో స్టార్టప్ ఫౌండర్లు కూడా స్కెచ్ బబుల్ ను ఉపయోగించుకోవచ్చు. టీచర్లు, విద్యార్థులు, అకౌంటెంట్లు, లాయర్ల వంటి నాన్ ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఈ టెంప్లేట్స్ ను వాడుకోవచ్చు.

ఫ్యూచ‌ర్ ప్లాన్స్ ఇవీ..

స్కెచ్ బబుల్ పేరెంట్ కంపెనీ ఇన్ఫోషేర్. రోజురోజుకూ వెబ్ సైట్ కు హిట్స్ పెరుగుతున్నాయి. స్కెచ్ బబుల్ ప్రజంటేషన్లకు స్లైడ్ షేర్ లో ఐదు లక్షల వ్యూస్ వచ్చాయి. ప్రఖ్యాత మార్కెటింగ్ కంపెనీ హబ్ స్పాట్ కూడా వాటిని ప్రదర్శించింది. వెబ్, ఈ-కామర్స్, సీఎంఎస్ టెంప్లేట్స్ కూడా యాడ్ చేయాలన్నదే ఫౌండర్ల ఫ్యూచర్ ప్లాన్. ఎన్వాటో కంపెనీ స్థాయికి ఎదగాలన్న వారి లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం!

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి