ఆన్‌లైన్‌లో టపాసుల అమ్మకం మొదలెట్టిన 'ఫటాకే'

ఆన్‌లైన్‌లో టపాసుల అమ్మకం మొదలెట్టిన 'ఫటాకే'

Saturday November 14, 2015,

4 min Read

దీపావళి...వెలుగుల పండుగ. దీంతో పాటే పండుగ కోసం కొనుగోళ్లు, అమ్మకాల్లో బిజీ అయిపోతారు. చాలామంది ఈ-కామర్స్ సేల్స్‌లో భాగంగా తమకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుంటారు. ఇక మిగిలింది ఫైర్ వర్క్స్ లిస్ట్ మాత్రమే. ఫైర్ క్రాకర్ మానుఫాక్చరర్స్, డిస్ట్రిబ్యుటర్స్ పెద్ద ఎత్తున అమ్మకాల కోసం సిద్ధమయిపోతుంటారు. అయితే చాలామంది కొనుగోళ్ల జాబితాలో చివరి అంశంగా క్రాకర్స్‌ను జత చేస్తారు. ఒక్కోసారి అలా కొనుక్కోవడం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. దీపావళి దగ్గరపడడంతో షాపుల్లో రద్దీ ఎక్కువగా ఉండడమో లేకుంటే, అన్నీ అయిపోయి లిమిటెడ్ వెరైటీ మాత్రమే అందుబాటులో ఉండడమో జరుగుతుంది. కొన్నిసార్లు లైసెన్స్ లేకుండా ఫైర్ వర్క్స్ అమ్మకాలు కూడా సాగుతుంటాయి. అలాంటపుడు వాటి క్వాలిటీని నమ్మలేము. చివరి నిమిషంలో ఇలాంటి సమస్యలనుంచి బయటపడడానికి ఒక సొల్యూషన్ తో ముందుకు వచ్చారు స్టాండర్డ్ ఫైర్ వర్క్స్. 1942 లో ఎన్ ఆర్ కె రాజారత్నం ప్రారంభించిన స్టాండర్డ్ ఫైర్ వర్క్స్, ఇపుడు ఫటాకెతో కలిసి ఎలాంటి సమస్యలు లేని హైపర్ లోకల్ బాట పట్టింది.

image


ఏంటీ ఫటాకే ?

ఫటాకే ఒక మొబైల్, వెబ్ యాప్. ఇది మార్కెట్లో అందుబాటులో లేని ఎన్నో రకాల వెరైటీ క్రాకర్స్‌ను కొనుగోలుదారుల కోసం ఒక వేదిక ద్వారా అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరులో ఇటీవలే ప్రారంభించిన ఫటాకె, ఆర్డర్ ఇచ్చిన మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటల కల్లా డెలివరి చేస్తోంది. ఇందుకోసం ఈ సంస్థ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. స్టాండర్డ్ ఫైర్ వర్క్స్‌కు దేశవ్యాప్తంగా 40 ఫ్యాక్టరీలున్నాయి. తండ్రీ-కొడుకులైన శంకర్, నిఖిల్ గుప్త ఈ వెంచర్ నడుపుతున్నారు. వీరికి రసియ పేరుతో గ్రానైట్ మైనింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో కూడా ఉన్నారు. 21 ఏళ్ల నిఖిల్ ప్రస్తుతం సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ స్టడీస్ కు చెందిన జైన్ యూనివర్సిటీలో బిబిఎం ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

ఇక ఫటాకెలో ఉన్న 8 మంది టీం మెంబర్లు ప్యా కేజింగ్, సేల్స్, మార్కెటింగ్ వ్యవహారాల్ని చూసుకుంటున్నారు. ఫటాకె ఇప్పటికే అర్బన్ పైపర్‌తో పాటుగా, టెక్నాలజీ, లాజిస్టిక్స్ చూసే మరో థర్డ్ పార్టీతో టై అప్ చేసుకున్నారు. అర్బన్ పైపర్ ను సౌరభ్ గుప్త స్థాపించారు. ఇది SME B2C . దీనికి హైపర్ లోకల్ గా మల్టిపుల్ డెలివరీ హబ్స్ ఉన్నాయి. చాయ్ పాయింట్, కాంతి స్వేట్స్, కాలిఫోర్నియ బర్రిటొ, బిగ్ బాస్కెట్ క్లైంట్స్ గా ఉన్నాయి.

ఫటాకే ఏర్పాటు

బిజినెస్‌కు సంబంధించిన అన్ని వ్యవహారాల్నీ పూర్తిచేసుకోవడానికి ఫటాకేకు రెండు నెలల సమయం పట్టింది. భారత్‌లో ఫైర్ వర్క్స్‌ను ఇంటి దగ్గరకే పంపిచడానికి లాజిస్టిక్స్ ప్రొవైడర్లకు అవసరమైన లైసెన్స్ లేని విషయం తొందరగానే అర్థం అయింది. అందుకు పర్మిషన్లు తెచ్చుకున్న ఫటాకే, మంటల్ని ఆపే పరికరాలతో పాటుగా ఇతర సేఫ్టీ ఎక్విప్మెంట్‌తో ట్రక్కుల్లో ఫైర్ క్రాకర్స్‌ను అందిస్తోంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఒకసారి 100 కేజీల సరుకును మాత్రమే రవాణా చేస్తోంది.

ఆఫ్ లైన్ స్టోర్స్‌లో అందుబాటులో ఉన్నదాని కంటే కూడా ఎక్కువ వెరైటీలతో, MRPపై 80% డిస్కౌంట్‌తో, మొబైల్, వెబ్ సైట్ ల ద్వారా టపాసులను అందిస్తుంది. "ఈ సంవత్సరం లో ప్రాఫిట్ మార్జిన్‌తో టపాసులను అమ్మాలని నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో మెయిన్ స్ట్రీం ఆన్‌లైన్ క్రాకర్స్ బిజినెస్ పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం" అంటున్నారు నిఖిల్.

ఇక ప్యాకేజింగ్, డెలివరి విషయానికి వస్తే, డెలివరి ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రి-ఆర్డర్స్ చేసిన వారి కోసం రూట్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారు. సేఫ్టీ, అథెంటిసిటీ కోసం వాక్యూం ప్యాక్డ్ కంటెయినర్స్‌ను వాడుతున్నారు. సౌత్ బెంగళూరులోని జెపి నగర్, జయనగర్, బనేర్‌గట్ట- సెంట్రల్ బెంగళూరులోని కోరమంగల, ఇందిరానగర్ కోసం ఫటాకె రెండు డెలివరి హబ్స్‌ను ఆపరేట్ చేస్తోంది. కస్టమర్లు, వారి డిమాండ్లను బట్టి బెంగళూరులో మరిన్ని హబ్స్ సెటప్ చేయాలని భావిస్తున్నారు. క్యాష్ ఆన్ డెలివరి పద్ధతి అనుసరిస్తున్న ఫటాకె, తన మొబైల్, వెబ్ యాప్ యూజర్ల కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానల్స్‌ను ట్రాఫిక్, ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించుకుంటోంది.

AWS సర్వర్ టెక్నాలజీని ఉపయోగించుకుని హెవీ లోడ్స్ కూడా డెలివరి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు అర్బన్ పైపర్‌కు చెందిన సౌరభ్. వేర్ హౌసెస్ మీద ఉన్న నియంత్రణలే ఫటాకెకు అతిపెద్ద సవాల్‌గా మారింది. "సిటీ లిమిట్స్‌లోని గోదాముల్లో టపాసులు నిల్వచేసేందుకు అనుమతి లేదు. అందుకే నగర శివారుల్లో ఉన్న గిడ్డంగుల్లో మాత్రమే వాటిని నిల్వ చేస్తున్నాం. ఈ-కామర్స్ ప్లేయర్స్ ఈ రంగంలో ప్రవేశించడానికి ఉన్న నిబంధనలే వృద్ధికి ఆటంకంగా మారింది" అంటున్నారు నిఖిల్.

image


ఎలా ఉందీ రంగం

దేశంలో వివిధ సందర్భాల కోసం టపాసుల కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నా, దివాలీకి మాత్రమే పెద్ద మొత్తంలో అమ్మకాలు ఉంటాయి. పండుగకు 15-20 రోజుల ముందే 90% అమ్మకాలు జరుగుతాయి. అవ్యవస్థీకృత రంగం అయినప్పటికీ దాదాపుగా 25,000 మంది ఉద్యోగులు ఇందులో పనిచేస్తున్నారు. వీటు, అజంతా ఫైర్ క్రాకర్స్ ఇందులో పేరున్న ఇతర బ్రాండ్స్. టపాసుల తయారీదార్లంతా చాలా మంది తమిళనాడులోని శివకాశికే పరిమితమయ్యారు.

టపాసులను డెలివర్ చేయడానికి మొబైల్ యాప్, వెబ్‌ను ఉపయోగిస్తున్నాది ఫటాకె మాత్రమే. దీంతోపాటే చెన్నై కేంద్రంగా క్రాకర్ బాస్కెట్, జుబిలంట్ క్రాకర్స్ తమిళనాడులో, ముంబై కేంద్రంగా లవంగి ఈ సెక్టార్లో ఉన్నాయి. ఇక దేశీయ మార్కెట్లోకి చైనా క్రాకర్స్ మానుఫాక్చరర్స్ ఈ ఏడాదికి వస్తారని పుకార్లు వినిపిస్తున్నా, మన దగ్గరున్న రెగ్యులేషన్స్ తో అది సాధ్యంకాకపోవచ్చని నిఖిల్ అంటున్నారు.

ఫ్యూచర్ ప్లాన్స్

బెంగళూరులో ఈ ఫెస్టివల్ సీజన్లో కంజ్యూమర్ మార్కెట్, సరళిని గమనించాలని ఫటాకె భావిస్తోంది. ఫైర్ క్రాకర్స్ కొనుగోళ్ల అనుభవంతో భవిష్యత్తులో మరిన్ని నగరాలు, పట్టణాలకు విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. బల్క్ ఆర్డర్ల కోసం ప్రత్యేకమైన ఫేర్ చార్ట్ రూపొందించారు. ఇక రెగ్యులర్ కస్టమర్ల కోసం మరిన్ని పర్సనలైజ్డ్ ఆప్షన్‌ను అందివ్వనున్నారు. "కస్టమర్ల సౌలభ్యం కోసం ఏజ్, జెండర్ బేస్డ్‌గా పర్సనలైజ్డ్ కాంబో ప్యాక్ లాంచ్ చేశాం. విభిన్నమైన ఆఫర్లుండడం వల్ల కంజ్యూమర్లు ఏది కొనాలో నిర్ణయించుకోలేకపోవచ్చు" అంటున్నారు నిఖిల్.

యువర్ స్టోరీ అభిప్రాయం

కస్టమర్లు ఎదుర్కొంటున్న చాలా సమస్యల్ని అర్థం చేసుకున్న ఫటాకె అందుకు తగ్గట్లుగానే తమ కార్యాచరణ రూపొందించుకుందని అనిపిస్తోంది. అయినప్పటికీ ఇంకా కొన్ని అంశాల్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. తమ కస్టమర్లు గిఫ్ట్ బాక్స్ రూపంలో బంధువులు, స్నేహితులకు ఫైర్ క్రాకర్స్ అందివ్వవచ్చు. అయితే, క్యాష్ ఆన్ డెలివరీ కావడంతో అదంత ఆకర్షణీయమైన ఫీచర్ కాకపోవచ్చు.

ఇక దీంతోపాటే కాంబో ప్యాక్‌లో పర్సనలైజేషన్ మోడల్ ప్రవేశపెడితే బాగుంటుంది. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన ఇష్టాలుంటాయి కాబట్టి, ఏజ్, జెండర్ కాటగిరీలుగా వాటిని రూపొందించుకోకపోవడమే మంచిది. మొబైల్ యాప్, వెబ్‌సైట్ చాలా సులువుగా ఉపయోగించుకునేలా ఉన్నాయి. ఇక హైపర్ లోకల్ సెక్టార్లో ఇతర క్లైంట్లతో పనిచేసిన అనుభవం ఉన్న అర్బన్ పైపర్, టెక్నాలజీ పరంగా ఫటాకె కు సహకరిస్తుంది.