ఆంట్రప్రెన్యూర్లకు అవసరమైన సాయం చేస్తాం- నిర్మలా సీతారామన్

ఆంట్రప్రెన్యూర్లకు అవసరమైన సాయం చేస్తాం- నిర్మలా సీతారామన్

Saturday January 16, 2016,

1 min Read

ప్రభుత్వంలోని వివిధ విభాగాల నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో ఎంట్రప్రెన్యూర్లు ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ భరోసా ఇచ్చారు. స్టార్టప్ ఇండియా ఓపెనింగ్ సెరిమనీలో ఆమె ఆంట్రప్రెన్యూర్లను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. 

image


స్టార్టప్ కంపెనీలకు మద్దతిచ్చే విషయంలో ప్రభుత్వంపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం నుంచి కావాల్సిన సాయం అందుతుందని అన్నారు. ఆంట్రప్రెన్యూర్లంతా ఐడియాలు, పనిమీద మాత్రమే దృష్టి పెట్టాలని సూచించారు. స్టార్టప్ లను ప్రోత్సహించడానికి సంబంధిత అన్ని వర్గాలను ఒక్క తాటిమీదికి తేవడానికి మంత్రిత్వ శాఖలన్నీ కృషి చేస్తున్నాయని ఆమె తెలిపారు. స్టార్టప్ ల సమూహ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచిద్దామన్నారు. స్టార్టప్స్ తో సంప్రదింపులు జరిపే సిస్టమ్ ఏర్పాటైందని చెప్పారు. ప్రభుత్వం దానికి గుర్తింపు కూడా ఇస్తుందన్నారు. క్లిష్టమైన ప్రభుత్వ పాలసీలు, అనుమతుల విషయంలో స్టార్టప్ లకు త్వరలోనే రిలీఫ్ దొరుకుతుందని శుభవార్త చెప్పారు. స్టార్టప్ సంఖ్య పెంచడానికి ప్రభుత్వం ఒక ఫెసిలిటేటర్ గా ఉంటుంది నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు.

జనం ఆంట్రప్రెన్యూర్ల వైపు చూసే విధానం ఇప్పుడు మారిందని నిర్మలా సీతారామన్ అభిప్రాయ పడ్డారు. ఆ పదానికి ఇప్పుడొక గౌరవం దొరుకుతోందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల వైపు ఆశగా చూసే యువత సంఖ్య బాగా తగ్గిందని చెప్పారు. జాబ్ సీకర్స్ గా కాకుండా జాబ్ గివర్స్ గా మారాలని నేటి యువత కలలు కంటోందని తెలిపారు. ఇండియన్ స్టార్టప్స్ ఐటీ రంగానికే పరిమితం కాకుండా అన్ని రంగాలకూ విస్తరించాలని పిలుపునిచ్చారు. ఖండాంతరాలకు కూడా విస్తరించాలని సూచించారు. సిలికాన్ వ్యాలీ నుంచి ఆంట్రప్రెన్యూర్లు ఇండియా తిరిగి రావడంతో భారత్ లో స్టార్టప్ బూమ్ పెరిగిందన్న నిర్మలా సీతారామన్ -గత ఏడాది ఇండియన్ స్టార్టప్స్ లో పెట్టుబడులు 50 శాతం పెరిగాయని తెలిపారు.