హెల్తీ యాప్స్... హ్యాపీ లైఫ్

అనారోగ్యం బారినపడే వరకు ఆరోగ్యం విలువ బోధపడదు.-థామస్ ఫల్లర్

హెల్తీ యాప్స్... హ్యాపీ లైఫ్

Wednesday May 06, 2015,

3 min Read

ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ వ్యక్తిగతంగా,వృత్తిగతంగా మన లక్ష్యాలను చేరుకునే పరుగులో ఆరోగ్యాన్ని లెక్క చేయం. అది దైనందిన జీవితానికే కాదు భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఉరుకులు,పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని పట్టించుకునే తీరిక,ఓపిక లేదు మనకు. శరీరం, మనసు ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ పని చేయాలి. అందుకు సరియైన పోషకాహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. ఆరోగ్యంగా ఉండాలంటే వర్కవుట్, జిమ్ చేయాలని అవగాహన ఉన్నా వాటి జోలికి పోం. అందుకు విచిత్రమైన సాకులెన్నో.

image


మన లక్ష్యాలను సాధించడానికి, జీవితాన్ని మరింత సరళతరం చేయడానికి సాంకేతిక పరిజ్ణానం ఎంతో ఉపకరిస్తుంది. మన శరీరం, క్యాలరీల గురించి సమాచారమిస్తుంది. దీంతో ఆరోగ్యానికి సంబంధించి తెలివైన, కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవగాహన కలుగుతుంది. ఇదిగో మన మేడిన్ ఇండియా ఫిట్ నెస్ అప్లికేషన్స్ అందుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ యాప్ స్మార్ట్ ఫోన్ తో పాటు క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా మన శరీరంలో జరిగే వివిధ ప్రక్రియలను విశ్లేషిస్తుంది. రన్నింగ్ లేదా వర్కవుట్ చేస్తున్నప్పుడు మన దేహంలో తిష్టవేసిన కొవ్వు గురించి సెన్సార్ లా పని చేస్తూ అనలైజ్ చేస్తుంది. మనం వేగంగా నడుస్తున్నప్పుడు దేహంలో వివిధ అంగాల పని తీరును విశ్లేషిస్తుంది. గాయాల గురించి ముందే ఊహించగలదు కూడా.

పరుగు తీస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు బాడీ గురించి సమాచారం సేకరిస్తుంది. రన్నర్ స్వరూపం, పరుగు తీసే శైలి, ఒత్తిడి కలిగించే అంశాలను అధ్యయనం చేస్తుంది. వీటన్నింటినీ విశ్లేషించి ఎలా పరుగులు తీయాలో రన్నర్ కు కచ్చితమైన రియల్ టైం సలహాలిస్తుంది. అంతేకాదు పాదాలు,మోకాళ్లపై పడే ఒత్తిడిని చూపిస్తుంది. పరుగంతా అయిపోయిన తర్వాత రన్నర్ స్వరూపం,వేగం,దూరం, రిథంతో పాటు పలు అంశాలపై పూర్తిగా విశ్లేషణ చేస్తుంది.... Stridalyzer యాప్.


Orobind. ఈ యాప్ వ్యక్తిగత ఫిట్ నెస్ కోచ్ లు, వారి ప్రాక్టీస్ సెషన్లను బుక్ చేసే...ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది. యూజర్లు తమ బరువు తగ్గే లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. గోల్స్ రీచ్ అయితే రివార్డ్స్ గెలుచుకునే ఛాన్సూ ఉంది. హౌస్ కోచ్ లు, మోటివేషన్ నిపుణులు, వ్యక్తిగత కోచ్ ల సాయంతో ఎప్పటికప్పుడు తమ టార్గెట్ల పురోగతి సమీక్షించుకోవచ్చు. కామన్ ఫ్లోర్ సహ వ్యవస్థాపకుడు లలిత్ మంగళ్, ISB హైదరాబాద్ లో చదువుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్త సమీర్ మెహతా, మైక్రోసాఫ్ట్, ట్రాన్స్ ఓషియన్ సీనియర్ ఇంజినీర్ల నుంచి ఈ స్టార్టప్ కు నిధులు సమకూరుతున్నాయి.


TechSparks TECH30 startup. పరిశోధన,అభివృద్ధి 2011లో ప్రారంభించింది... GetActive. 2013 జనవరిలో డివైజ్ లను లాంఛ్ చేసింది. మొదటి ఏడాదిలోనే దాదాపు 10 వేల డివైజ్ లను సేల్ చేసి రికార్డు సృష్టించింది. హెల్తీ లైఫ్ స్టైల్ ను కొనసాగించేందుకు తమ యూజర్ల కోసం మూడు డివైజ్ లను రన్ చేస్తోంది...ఈ స్టార్టప్. Rs 4,999, Rs 3,999, Rs 2,999 ధరల్లో లభిస్తున్నాయి...Tapp, Slim, eZ అనే డివైజ్ లు. సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో గేమిఫికేషన్, రివార్డ్ ప్రోగ్రామ్స్, పోటీలను భారీగా నిర్వహిస్తుంది... GetActive. Androi, iOS లలో పని చేసే ఈ డివైజ్ లు బాడీలో కరుగుతున్న కొవ్వు గురించి ఎప్పటికప్పుడు సమాచారమిస్తాయి.


HealthifyMe అనే యాప్ కూడా ఫిట్ నెస్ ప్రియులకు చక్కని నేస్తం. కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ల ద్వారా వెయిట్ లాస్ గోల్స్ తో ఫిట్ నెస్ పెంపొందించుకోవాలనుకునే యూజర్లను ప్రోత్సహిస్తుంది..ఈ యాప్. ఇది కచ్చితమైన ఫలితాలకు గ్యారంటినిస్తుంది. ఎందుకంటే ఈ యాప్ డాక్టర్లు, నూట్రిషనిస్టులు, ఫిట్ నెస్ ట్రైన్లర్లు రూపొందించారు..కాబట్టి. ఆహారం అలవాట్లు, వ్యాయామాలు పాటించాలి. కోచ్ ల సూచనలు ఫాలో అవ్వాలి.

భారతీయ శరీర నిర్మాణం, రకాలు, ఆహారపు అలవాట్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. అంతేకాదు భారతదేశంలో విస్తృతంగా ఉన్న వివిధ ఆహారపు అలవాటర్ల సమాచారం సేకరించారు. ఏయే ఆహారంలో ఎంతెంత క్యాలరీలుంటాయి...వాటిని ఎలా ఖర్చు చేయాలన్నదానిపై వారి యూజర్లకు విలువైన సలహాలు కూడా ఈ యాప్ ఇస్తుంది. అపోలో హాస్పిటల్స్, మేదాంత, మెడిసిటీ, మణిపాల్ హాస్పిటల్, యూనిలివర్ వంటి మెడికల్ సంస్థలు, కార్పొరేట్లతో భాగస్వామ్యం కలిగి ఉంది.


సీరియల్ ఎంట్రపెన్యూర్, ఏంజిల్ ఇన్వెస్టర్ విశాల్ గోండాల్ దీని వ్యవస్థాపకులు. ఆధునిక సాంకేతిక పరిజ్ణానం, నిపుణులైన కోచ్ లు, సామాజిక సేవా తత్పరతతో ముందుకెళుతూ, ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందేందుకు యూజర్లను ప్రోత్సహిస్తోంది. ముంబై, షెంజన్ లలో ఆఫీసులున్న ఈ కంపెనీ హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియాలో ఉంది. అయితే ప్రస్తుతం దీని ప్రధాన దృష్టి ఇండియాపైనే. గూగుల్ సీనియర్ వీపీ అమృత్ సింఘాల్, , Flextronics CEO మైక్ మెక్ నమరా వంటి ప్రామినెంట్ పర్సనాల్టీల నుంచి 2014 ఆగస్టు నుంచి నిధుల సమీకరించింది.

డివైజ్ లు, సర్వీసులు తమ యూజర్లకు అందిస్తోంది....GOQii యాప్. ఫుల్ టచ్ డిస్ ప్లేతో కూడిన టచ్ బ్యాండ్లు, వైబ్రేటింగ్ అలారం, ఆల్ట్రా లైట్ వెయిట్ వాటర్ రిసిస్టెంట్ స్కిన్ సెన్సిటివ్ మెటీరియల్స్, బ్లూటూత్ ఆటోమాటిక్ వైర్ లెస్ సింకింగ్ సదుపాయాలున్నాయి. భారతీయ నివాసులు ఈ డివైజ్ లు, సేవలు పొందాలంటే ఏడాదికి రూ.11,999, ఆరు నెలలకు రూ.6,999, మూడు నెలలకు రూ.3,999 లకు చెల్లించాలి. 


ఫిట్ హో. ఫిట్ నెస్ యాప్స్ లో తిరుగులేనిది. వివిధ ఫుడ్ కాంబినేషన్స్, ఎక్సర్ సైజ్ లు, జీవక్రియ, ఊబకాయం గురించి శాస్త్రీయమైన, ఆచరణీయమైన విశ్లేషణ చేస్తుంది. యూజర్ల శరీరస్థితికి అనుగుణమైన వ్యాయామ, డైట్ ప్రణాళికలు ఈ యాప్ నుంచి పొందవచ్చు. ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి వంటి సూచనలు చేస్తూ...ఆరోగ్యానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి యూజర్లకు సహకరిస్తుంది.

వెబ్ ఆధారంగా ఈ సర్వీసులు పొందొచ్చు. ఇప్పటికే 70 వేల మంది ప్రజలు వెబ్ ఆధారంగానే సర్వీసులు పొందారు. అంతేకాదు మరింత మందికి చేరువయ్యేందుకు వీరీమధ్య మొబైల్ యాప్ కూడా లాంఛ్ చేశారు.