భారతీయ గ్రామాల్లోని చిన్నారుల జీవితాలను మార్చేసిన మిషన్ ఫిన్‌లాండ్

హిప్పోకేంపస్ చేపట్టిన అద్వితీయ కార్యక్రమంగ్రామాల్లోని చిన్నారులకు ప్రీస్కూల్ శిక్షణఒకే సిలబస్‌ని చదివేవారికి ఒకేరకమైన పరిస్థితులు, అవకాశాలు లేవనే ఆవేదనదుర్భర పరిస్థితుల్లోనూ చదువుకుంటున్న చిన్నారులే ప్రేరణ

భారతీయ గ్రామాల్లోని చిన్నారుల జీవితాలను మార్చేసిన మిషన్ ఫిన్‌లాండ్

Monday May 18, 2015,

4 min Read

మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో నిర్లక్ష్యం, ఉదాసీనతే హిప్పోకేంపస్ లెర్నింగ్ సెంటర్ ప్రారంభానికి మూలకారణం. ప్రస్తుతం హిప్పోకేంపస్‌కు 150 ప్రీస్కూల్ సెంటర్లుండగా వాటిలో 5,200 మంది విద్యార్ధులు, 350మంది టీచర్లున్నారు. ఈ స్థాయికి చేరడానికి ఆ సంస్థ చాలా సుదూర ప్రయాణం చేయాల్సి వచ్చింది. దానికోసం పడ్డ పాట్లను వ్యవస్థాపకుడు ఉమేష్ మల్హోత్రా మాత్రమే చెప్పగలరు. 2020నాటికి వీలైనంత ఎక్కువమందికి, కనీసం ఫిన్‌లాండ్ దేశ జనాభా స్థాయికైనా... ఈ హిప్పోకేంపస్‌ విధానాన్ని అందించాలన్నది ఆయన లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ఆయన పెట్టుకున్న పేరే మిషన్ ఫిన్‌లాండ్

image


హిప్పోకేంపస్ లైబ్రరీలో రోహిణి నీలేకనితో మాట్లాడుతున్న సమయంలో అక్షర ఫౌండేషన్ గురించి తెలుసుకున్నారు ఉమేష్. ఆమెతో కలిసి ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించినపుడు.. అక్కడి తీరుతెన్నులను చూసి షాక్ తిన్నానంటారాయన. ఒక స్లమ్ ఏరియాకి వెళ్లడం ఉమేష్‌కు అదే మొదటిసారి. “ అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయిలో అప్పటివరకూ సంతృప్తికరంగానే జీవించాను నేను. దుర్భర పరిస్థితుల్లోనూ ప్రతీ రోజూ స్కూల్ పంపుతున్న వాతావరణం చూసి నేను ఆశ్చర్యపోయానం”టారు ఉమేష్.

వెలుతురు లేని క్లాస్ రూమ్స్, గది బయటే పారే ఓపెన్ డ్రైనేజీ, స్కూల్ టీచర్ల నిర్లక్ష్య వైఖరి మొత్తం ఉమేష్ మనసులో నాటుకుపోయాయి. “కొత్త కారో, బైకో కొన్నపుడు.. ఆర్‌టీఓ దగ్గరికి వెళ్లడం చాలా కష్టమన పని అనుకుంటున్నారా? అయితే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. అప్పుడు అసలు బాధేంటో!” అంటారు ఉమేష్.

దుర్భర పరిస్థితులు, నిర్లక్ష్యపూరిత ధోరణి, జీవితం ఏ ఆశ కల్పించలేని వాతావరణం... అయినా సరే ప్రతీ రోజూ పిల్లలను స్కూల్‌కి పంపే తల్లిదండ్రులు. ఇవీ ఉమేష్ చూసిన వాస్తవాలు. “మనుషులు ఎంత ఆశావహ దృక్పథంతో బతుకుతారో అప్పుడే అర్ధమైంది నాకు. ఆ ఆశే లేకపోతే... స్కూళ్లలో చేరేవారి సంఖ్య 97శాతం పడిపోయేది” అంటారు ఉమేష్.

ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దగలనే భావనతో... ఓ వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకున్నారు ఉమేష్. ఇదంతా జరగాలంటే మనుషుల ఆలోచనా ధోరణిలో కూడా చాలా మార్పులు రావాల్సి ఉందని ఆయనకు అర్ధమైంది. “ ఐటీ రంగంలో చాలా చేస్తున్నాం, అందుకు తగినట్లుగానే ప్రతిఫలం కూడా పొందుతున్నాం. కానీ సమాజంలో మార్పులు తేవాలంటే ఏం చేయాలో మనకు ఇప్పటివరకూ తెలీదు. నేను దీన్ని కొన్నేళ్లలో సరిదిద్దగలననే ఉద్దేశ్యంతోనే ఇందులో అడుగుపెట్టాను. కానీ నేను పరాజయం పొందాన"ని ఒప్పుకున్నారు ఉమేష్.

image


హిప్పోకేంపస్ లైబ్రరీలో ఇప్పటికే ఉమేష్ విజయం సాధించారు. అయినా అదే విధానాన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అవలంబించడంలో మాత్రం విఫలం కాక తప్పలేదు. “స్కూల్ ఎలాంటి వాతావరణంలో ఉన్నా, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కున్నా.. పిల్లలకు పుస్తకాలతో అనుబంధం ఏర్పడితే వారి జీవితంలో ఎంతో మార్పొస్తుందని మనం నమ్ముతాం. కనీసం వారానికొక గంట చదవగలిగినా అంతో ఇంతో మార్పు వస్తుందని భావిస్తాం”- ఉమేష్

కానీ ఇదేమీ అనుకున్నంత సులభం కాదు. పిల్లలు చదవలేరు, టీచర్లు పట్టించుకోరు, అందుబాటులో పుస్తకాలుండవు, లైబ్రరీల నిర్వహణ వృధా అనుకుంటారు హెడ్‌మాస్టర్లు, కనీసం పేరెంట్స్ నుంచి పిల్లలకు సహాయం అందే అవకాశముండదు. “ఇలాంటి పరిస్థితులు మేం రూపొందించుకున్న కార్యాచరణ ఇంకా కష్టంగా మారింది. మా విధానాలకు అనుగుణంగా ప్రాథమిక స్థాయి నుంచి ట్రైనర్లకూ శిక్షణ ఇవ్వాల్సి వచ్చింది. ఇది మూడేళ్లపాటు భయానక అనుభవం. ఆశావహ దృక్పథం గల కొందరు తల్లిదండ్రులు సహకరించడమే... మాకు అతి పెద్ద బలం”


2007లో "చదువుతో, చదువుతూ ఎదగడం" అనే లైబ్రరీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో కొన్ని కష్టాలను అధిమించడగలిగారు. చదివే అలవాట్లను బట్టి ఆ పుస్తకాలు 6 కేటగిరీలుగా ఏర్పాటు చేశారు. ప్రతీ లెవెల్‌కు ఒక్కో రంగు చొప్పున... గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్, బ్లూ, ఎల్లో కలర్స్ ఇచ్చారు. ప్రతీ విద్యార్ధి చదివే స్థాయిని బట్టి రంగును అసైన్ చేస్తారు. “మూడేళ్ల పరాజయం తర్వాత మాకు ఈ ఆలోచన వచ్చింది. లైబ్రరీలోని పుస్తకాలు రంగుల ప్రకారం మార్క్ చేసి ఉంటాయి. విద్యార్ధులందరికీ దీని ప్రకారమే మెంబర్‌షిప్ కార్డులిస్తారు. దీంతో ఆయా విద్యార్ధులు వారికి కావాల్సిన పుస్తకాలను, తేలిగ్గా ఎంచుకోగలుగుతారు" అని చెప్పారు ఉమేష్.

చదివే అలవాటును ప్రోత్సహించడం కోసం... కలరింగ్ వంటి అనేక ఇతర కార్యకలాపాలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో గ్రంథాలయాలకి వచ్చే పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది. “పిల్లలు రంగులు వేసేందుకు ఉత్సాహంగా వస్తారు. అప్పుడు కనీసం రెండు బుక్స్ చదవితేనే వీటినిస్తాం అని చెబుతాం. దీంతో ఆ చిన్నారులు మరింత ఉత్సాహంగా చదవడం మొదలుపెడతారు. 2009నాటికి 50మందికి పైగా విద్యార్ధులను ఈ కార్యక్రమంలో భాగం చేయగలిగాం. హిందీ, ఉర్దూ, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్ పుస్తకాలు వాళ్లకు అందుబాటులో ఉండేవం”టారు ఉమేష్.

image


ఎ రూమ్ టు రీడ్ అనే లాభాపేక్షరహిత సంస్థ హిప్పోకేంపస్‌ను సంప్రదించింది. దీంతో ఇప్పుడీ కార్యక్రమం దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లోనూ, మొత్తం పది దేశాలకు విస్తరించింది. 2008 తర్వాత అనేక సామాజికవేత్తలతో కలిసి, గ్రామాలను సందర్శించారు ఉమేష్. హిప్పోకేంపస్ ఏర్పాటుకు సంబంధించిన ప్రారంభ ఉద్దేశాన్ని పంచుకున్నారు. “చిత్రదుర్గ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నాన్నేను. అక్కడ ప్రీస్కూల్ లాంటివి ఏవీ లేవు. చిన్నారులు నేరుగా రాష్ట్రవ్యాప్తంగా ఉండే స్టేట్ బోర్డ్ సిలబస్ ప్రకారం... మొదటి తరగతిలో జాయిన్ అవ్వాల్సిందే. నగరాల్లో ఉండే పిల్లలకు బేసిక్ ఇంగ్లీష్, మాధ్స్ వంటివి నేర్చుకునే అవకాశం ఉండేది. గ్రామాల్లో ఈ ఛాన్స్ లేదు. అందుకే పల్లెల్లోని పిల్లలే ఎక్కువగా డ్రాపవుట్స్‌గా మారుతుంటారు. అంటే ఒకే సిలబస్‌ని చదివే ఒక రాష్ట్రంలోని పిల్లలకు సమాన అవకాశాలు లేవని స్పష్టమవుతోందం”టారు ఉమేష్.

గ్రామాల్లోని విద్యార్ధులే ప్రధాన లక్ష్యంగా హిప్పోకేంపస్ ప్రీస్కూల్స్ ప్రారంభించాం. దీనికి పెట్టుబడిదారుగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వ్యవహరించింది. “ పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని నిర్ణయించుకున్నాం. అట్టడుగు వర్గాలుగా మిగిలిపోయిన 50 కోట్ల మందికి సాయం చేయాలని భావించామంటారు ఉమేష్. హిప్పోకేంపస్‌లో ఒక్కో విద్యార్ధికి ఏడాది ఫీజు ₹3,000. ఒకేసారి అయినా కట్టొచ్చు, నెలవారీగా అయినా చెల్లించొచ్చు. “ రేషన్ స్టోర్ లాంటి ఆలోచననే మేం అమల్లో పెట్టాం. అతి తక్కువ రేటుకే అత్యంత నాణ్యమైన అందిస్తామంటోంది హిప్పోకేంపస్.

దీనికి వేధింపులు కూడా తప్పలేదంటారు ఉమేష్. కొన్ని ప్రాంతాల్లో వ్యక్తిగత బెదిరింపులు, ప్రభుత్వ విభాగాల నుంచి ఒత్తిడి ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రధానంగా అంగన్‌వాడీ స్కూల్స్ నుంచి సమస్యలు ఎక్కువయ్యాయి. అయితే తల్లిదండ్రుల మద్దతివ్వడమే మా అభ్యున్నతికి అసలు కారణంగా చెప్తారు ఉమేష్.

“ చిన్నారుల సామర్ధ్యం పెరగడంతో ప్రస్తుతం మా లెర్నింగ్ సెంటర్లలోని టీచర్లు ఉత్సాహంగా ఉన్నారు. మా టీచర్లందరినీ భర్తీ చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. రాత పరీక్ష, వారిచ్చిన రిఫరెన్సులను పరీక్షించడం, క్లాస్ రూమ్ ఒత్తిడిని ఎదుర్కోగలరో లేదో తెలుకున్నాకే ఉద్యోగమిచ్చాం. వారి యదార్ధ సామర్ధ్యాలను తెలుసుకున్నాక ఇంటర్వ్యూలు చేసి, కొంత ట్రైనింగ్ కూడా ఇచ్చాం. ఒక వ్యక్తి క్లాస్ రూమ్ మొత్తాన్ని నడిపించగలరో లేదో పరీక్షించాం. మేం చాలా మంది టీచర్లకు ఇంగ్లీష్‌లో మాట్లాడ్డం విషయంలో ట్రైనింగ్ ఇచ్చా”మని చెప్పారు ఉమేష్.

ఇప్పుడు హిప్పోకేంపస్‌లలోని పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. ఆ స్కూల్స్‌కి వెళ్లి చూస్తే.. చాలా ఆనందంగా ఉంటుందంటారు ఉమేష్. నేర్చుకోవడంలో ఉన్న ఆనందం తెలియడంతో పిల్లలు కూడా ఆకర్షితులవుతున్నారు. టీచర్లకూ రోజురోజుకూ పట్టుదల, కార్యదీక్ష పెరుగుతోండడం విశేషం. ఇవన్నీ చూస్తే నాకు మరిన్ని అడుగులు వేసేందుకు ఆసక్తి కలుగుతోందని చెబ్తున్నారు ఉమేష్.