సర్వీస్ సెక్టార్ ను బిటుబి బాట పట్టించిన 'క్లిక్ 2 ఫిక్స్'

సర్వీస్ సెక్టార్ ను  బిటుబి బాట పట్టించిన 'క్లిక్ 2 ఫిక్స్'

Wednesday April 20, 2016,

3 min Read


స్టార్టప్ సొల్యూషన్ అనేది సర్వీస్ కావొచ్చు, ప్రాడక్ట్ బేస్డ్ కావొచ్చు. ఏదైనా కానీ సమస్యకి పరిష్కారం చూపించడం అనేది చాలా ప్రధానం. తెలుగు రాష్ట్రాల్లోనే సర్వీస్ ఇండస్ట్రీని మరింత ముందుకు తీసుకుపోడానికి బిటుబి సెగ్మెంట్ లోకి అడుగు పెట్టింది క్లిక్ 2ఫిక్స్ అనే హైదరాబాద్ స్టార్టప్.

క్వికర్ తోటై అప్

క్వికర్ గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. వాళ్లకు ఔట్ సొర్సింగ్ చేస్తోందీ క్లిక్ టు ఫిక్స్. క్వికర్ ఇప్పటి వరకూ క్లాసిఫైడ్స్ అందిస్తూ వచ్చింది. ఇటీవల యుటిలిటీ సెగ్మెంట్ ని మరింతగా విస్తరించింది. ఆ సర్వీసంతా హ్యాండిల్ చేస్తున్న సంస్థ క్లిక్ టు ఫిక్స్

“మరో 6 సంస్థలకు మేం ఔట్ సోర్స్ చేస్తున్నాం, తెలుగ రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో మా సేవలందుబాటులో ఉన్నాయి,” కెవిఎస్ ప్రకాశ్

ప్రకాశ్- ఈ సంస్థ ఫౌండర్. యుటిలిటీ సెక్టార్ లో క్లిక్ టు ఫిక్స్ మొదలై ఏడాది పూర్తయింది. ఇప్పుడీ సంస్థ తో టై అప్స్ కు చాలా కంపెనీలు ముందుకొస్తున్నాయి. కొన్ని ఇప్పటికే టై అప్స్ పెట్టుకున్నాయి కూడా. ఇందులో క్లాసిఫైడ్స్ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన క్వికర్ ఉండటం విశేషం. 150 మంది ప్రొఫెషనల్స్ ఈ సంస్థలో పని చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అన్ని పట్టణాల్లో ఈ సంస్థకు నెట్ వర్క్ ఉంది.

image


బిటుబి లో ఆన్ డిమాండ్ హోం సర్వీస్

చాలా సంస్థలకు కస్టమర్లు ఉంటారు కానీ సరైన సర్వీస్ అందించడం అన్నిటికీ సాధ్యం కాదు. అలాంటి వాళ్లు జత కలిస్తే ఆ బాధ్యత తామే చేపడతామని ప్రకాశ్ అంటున్నారు.

“నెలకి 3 వేల లీడ్స్ వస్తున్నాయి, 9రకాల సర్వీసులు అందిస్తున్నాం,” ప్రకాశ్

ఆన్ డిమాండ్ హోం సర్వీసులో చాలా కంపెనీలు ప్రవేశించాయి. కస్టమర్లను ఆకర్షించడానికి మొదట్లో సర్వీసు బాగానే నడుపుతుంటాయి. కస్టమర్లు పెరిగే కొద్దీ స్టాఫ్ కొరత వల్ల సర్వీసులను అంత ఎఫెక్టివ్ గా ఇవ్వలేక పోవచ్చు. దీంతో కస్టమర్లకు దూరం కావల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి వాళ్లు పరిష్కారం చూపిస్తామంటున్నారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, వైజాగ్, వరంగల్ లో ఆన్ డిమాండ్ హోం సర్వీసుల కోసం కంపెనీలు తమతో కలసి పని చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. నిజామాబాద్, తిరుపతి, రాజమండ్రి లలో సేవలను విస్తరిస్తామని అంటున్నారు.

క్లిక్ టు ఫిక్స్ టీం

టీం విషయానికొస్తే, ప్రకాశ్ దీని ఫౌండర్. బిటెక్ పూర్తి చేసిన ప్రకాశ్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేశారు. తర్వాత ఈ స్టార్టప్ పైనే పనిచేశారు. ఎన్నారై అయిన మహేష్ గార్లపాటి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ స్టార్టప్ కి సీడ్ ఫండింగ్ చేసింది ఆయనే. చంద్రవేద ప్రకాశ్ దీనికి మరో కో ఫౌండర్. 15 ఏళ్లపాటు పలు ఇండస్ట్రీల్లో పనిచేసిన చంద్ర- స్టార్టప్ సంబంధించిన ఫీల్డ్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. గిరిబాబు అనే మరో కో ఫౌండర్ ఉన్నారు. లెక్చరర్ గా పనిచేస్తూ ఈ స్టార్టప్ కోసం కూడా వర్క్ చేస్తున్నారు. వీరితో పాటు ఆన్ రోల్, ఆఫ్ రోల్ బేసిస్ లో వందల మంది పనిచేస్తున్నారు.

image


ప్రధాన సవాళ్లు

100 మిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న ఈ సెగ్మెంట్ లో ఢిల్లీ, బెంగళూరులో ఒకటి అరా తప్పితే పెద్దగా సక్సెస్ అయిన స్టార్టప్ లు లేవు. తక్కువ మంది కస్టమర్లు ఉన్నప్పుడు సర్వీసు అందించడం ఈజీయే. కస్టమర్లు పెరిగే కొద్దీ స్టార్టప్స్ డీలా పడిపోతుంటాయి. ఫండింగ్ తో కాకుండా సెల్ఫ్ సస్టెయినబుల్ మోడల్ లో రన్ కావడం కష్టమే. కానీ క్లిక్ టు ఫిక్స్ బిటుబి ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపగలనే ధీమాతో ఉంది. 

ఫండింగ్

ఎన్నారై మహేష్ గార్లపాటి దీనికి సీడ్ ఫండింగ్ అందించారు. గతేడాది ఆగస్ట్ ఫెస్ట్ లో అందరికంటే బెస్ట్ అనిపించుకున్న స్టార్టప్ లలో ఇది కూడా ఒకటి. సీరియల్ ఆంట్రప్రెన్యూర్ రమణ గోగుల దీనికి మెంటార్షిప్ చేస్తున్నారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పాయింట్ ను దాటేసిన క్లిక్ టు ఫిక్స్ ప్రస్తుతానికి లాభాల్లో పయనిస్తుంది. దేశంలో ఇతర నగరాలకు సేవలు వ్యాపించడానికి ఎవరైనా కలసి వస్తే సిరీస్ ఏ రౌండ్ ఫండింగ్ కు సిద్ధంగా ఉన్నట్లు ప్రకాశ్ ప్రకటించారు.

భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలు

బిటుబి సెగ్మెంట్ లో యుటిలిటీ, ఆన్ డిమాండ్ హోం సేవలను మరింత విస్తరించాలని చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా భారీ విస్తరణకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి కల్లా ఫండ్ రెయిజ్ అయితే మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నారు. 

website