అంగరంగ వైభవంగా మొదలైన ‘భాషా’ పండుగ

0


అమ్మతో మమకారాన్ని పంచుకోవడమే మన భాష. మనతో మనం మాట్లాడుకునే మాట అనలే మన భాష యువర్ స్టోరీ చీఫ్ ఎడిటర్ శ్రద్ధ శర్మ అన్నారు. ఢిల్లీలో కనుల పండువగా భాష ఫెస్టివల్ ప్రారంభమైంది. కల్చరల్ డిపార్ట్ మెంట్ తో పాటు రివేరి ల్యాంగ్వేజ్ లతో కలసి యువర్ స్టోరీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికి శ్రద్ధా శర్మ ప్రారంభోపన్యాయం చేశారు. భారత దేశంలో ఉన్న ఒక్కో భాషకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో భాషకు ఒక్కోభావం ఉందని అన్నారామె.

అమ్మ మాటలు గుర్తొచ్చాయి

తాను స్కూల్ చదువుకునే రోజుల్లో ఐదో తరగతిలో పేరెంట్స్ డే అయిందట. అప్పుడు శ్రద్ధ వాళ్ల అమ్మ ఆమెతో పాటు వచ్చారట.

“అమ్మ ఇంగ్లీషులో మాట్లాడలేక పోవడం నాకు నచ్చలేదు.” శ్రద్ధ

అమ్మను మాట్లాడొద్దని చెప్పాను. టీచర్లు ఇతర పేరెంట్స్ ఇంగ్లీషులో మాట్లాడటం.. వాళ్ల అమ్మ మాట్లాడలేకపోవడం చులకనగా అనిపించిందని అన్నారు శ్రద్ధ. కొన్నాళ్లయ్యాక తాను టెన్త్ లో ఉన్నప్పుడు అమ్మ మరోసారి వచ్చారట. అప్పుడు అమ్మ చక్కగా హిందీలో మాట్లాడారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పుకాదుకానీ, మన భాషను మర్చిపోవడమంటే మనల్ని మనం మర్చిపోవడం అని ఆరోజు అమ్మ చెప్పిన మాటలు తనకి ఇప్పటికీ గుర్తున్నాయని శ్రద్ధ అన్నారు. అప్పటి నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడటం తోపాటు హిందీలో కూడా అవసరం అయిన చోట మాట్లాడే దాన్ని అని చెప్పుకొచ్చారామె.

‘భాష’ మొదలు పెట్టడానికి ఇదే మూలం

భాష మొదలు పెట్టాలని గతేడాదే అనుకున్నాను.. అయితే మొదలుకాడానికి ఏడాది పట్టింది. ఆలోచనలు చాలా ఉన్నాయి.. వాటిని మాట్లాడుకోడానికి ఓ వేదిక కావాలి. అది ‘భాష’ కావాలి అని అన్నారు శ్రద్ధ.

“మనం ఎక్కడి నుంచి వచ్చామో, అక్కడి భాష ను మరవొద్దు,” శ్రద్ధ

కొన్ని భావాలు మన భాషలో చెబితేనే అది అవతలి వారికి సరిగా కన్వే అవుతుంది. మదర్ టంగ్ అంటే అమ్మ నేర్పిన భాష. అమ్మ చెప్పిన మాటలతో మనం మాట్లాడటం నేర్చుకున్నాం. అదే ఇప్పుడు మనం ఈ స్థితిలో ఉండటానికి కారణం. దీన్ని మరవొద్దని శ్రద్ధ పిలుపునిచ్చారు. యువర్ స్టోరీ 12 భాషల్లో కధలు చెబుతోంది. ప్రాంతీయ భాషల్లో భారతదేశంలోనే అతిపెద్ద మీడియా ప్లాట్ ఫాం ఇది.

 ప్రారంభం మాత్రమే, భవిష్యత్ లో మరిన్ని భాషా ఉత్సవాలు చేపడతాం- శ్రద్ధ”
ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది. దాన్ని వినే ,చెప్పే అర్హత ఉంది. నాకు చెప్పండి! ashok@yourstory.com

Related Stories