పాతనోట్ల మీద బీభత్సమైన సెటైర్లు..  

0

రూ. 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ఇలా ప్రకటించారో లేదో వెంటనే సోషల్ మీడియాలో భీకరమైన జోకులు, సెటైర్లు సర్క్యులేట్ అయ్యాయి. ఐదొందల నోటును చుట్టచుట్టి అందులో పల్లీ బఠానీ వేసి పోస్టు చేశారు. అమెరికాలో ఓట్ల కౌంటింగ్ ఇండియాలో నోట్ల కౌంటింగ్ అని చమత్కరించారు. ఇంకొందరైతే రెస్ట్ ఇన్ పీస్ (ఆర్ఐపీ) అని పెట్టి దండేసి దండం పెట్టి నివాళి అర్పించారు. తట్టలో నోట్ల కట్టలేసి మేకకు ఆహారంగా పెట్టి పోస్ట్ చేశారు.

ఏం వర్రీ అవకండి.. కేజీకి 12 రూపాయల చొప్పున ఐదువందలు, వెయ్యి నోట్ల కట్టలను కొంటామని మరో జోక్ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయింది. అన్ని న్యూస్ ఛానల్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసమని ప్రిపేర్ అవుతుంటే మోదీ వచ్చి సిలబస్ మార్చేశారని నవ్వించారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఆపితే వెంటనే వెయ్యి రూపాయల నోటు ఇచ్చేయమని మరికొందరు సెటైర్లు వేశారు. ఈ దెబ్బతో ఇంట్లో ఆడవాళ్లు తమ బ్లాక్ మనీని బయట పెడతారని వ్యంగ్యంగా కామెంట్ చేశారు.

ఏం కంగారు పడకండి ఉన్న డబ్బంతా తిరుపతి హుండీలో వేసుకోండి బోలెడంత పుణ్యం అని మరికొందరు ఉచిత సలహా ఇచ్చారు. వైట్ మనీగా మార్చుకోవడానికి చాలా మంది హాస్పిటల్ లో చేరిపోతున్నారట. ఎందుకంటే అన్ని ఆస్పత్రులు పాత నోట్లు తీసుకుంటాయి... అందుకే ఐసీయూలు నిండిపోతున్నాయని జోకులు పేలాయి .

రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ కాబట్టి దాన్ని అచానక్ చుట్టీ యోజన అనే కొత్త పథకం అన్నారు. మోదీ ప్లేడ్ ది ట్రంప్ కార్డు... ఔర్ పూరీ ఇండియా హిల్లరీ హై అంటూ సెటైర్లు గిరగిరా తిరిగాయి.

అంతెందుకు గూగల్ లో, ఇంటా, బయటా ఇదే చర్చ. అమెరికా ఎలక్షన్లు గాలికి కొట్టుకుపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా కరెన్సీ మీదనే చర్చ సాగింది. ట్విటర్ ట్రెండ్స్ మొత్తం ఇదే. 9/11 అటాక్స్ అని కూడా కామెంట్ చేశారు.