ఆన్ లైన్ వినోదంలో ఖతర్నాక్.. చాయ్ బిస్కెట్

ఆన్ లైన్ వినోదంలో ఖతర్నాక్.. చాయ్ బిస్కెట్

Tuesday March 22, 2016,

3 min Read


అరే ఛోటూ దో చాయ్.. దో బిస్కెట్ దో..

బోర్ డమ్ నుంచి వదిలించడానికి ఇదొక తిరుగులేని కాంబినేషన్. 

బానే వుందికానీ..

ఇదంతా కావాలంటే సిస్టమ్ ఆఫ్ చేయాలి. 

చైర్ వదిలి క్యాంటీన్ లోకి రావాలి.

లేదంటే నాలుగు అడుగులేసి లిఫ్టు దిగి బయటకి పోవాలి..

టీ కొట్టు వాకబుల్ డిస్టెన్స్ లో లేకుంటే బండి బయటకి తీయాలి..

అబ్బో సాయంకాలం గరంగరం టీ తాగడానికి చానా కథుంది.

మరి అలాంటిదేం లేకుండా.. 

అచ్చం టీ తాగిన అనుభూతి రావాలంటే ఎలా..? 

వేడివేడి చాయ్ లో బిస్కెట్ ముంచుకున్న ఫీలింగ్ కలగాలంటే ఏం చేయాలి..?

అందుకోసమే వచ్చింది చాయ్ బిస్కెట్.కామ్ 

బిస్కెట్ విసరడం లేదు.. నిజం. 

గత ఏడాది జనం ముందుకు వచ్చిన చాయ్ బిస్కెట్ సైట్ ఓ రేంజిలో దూసుకు పోతోంది. లక్షల్లో ఫాలోవర్స్, మిలియన్లలో ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ సైట్ చేసే హల్చల్ అంతాఇంతా కాదు. ఎప్పటి కప్పుడు ట్రెండ్ సెట్ చేస్తూ కొత్త కబుర్లు మోసుకొచ్చే ఈ సైట్ మంచి టైం పాస్ అడ్డా. 

ఇది మొదలు

ఫస్ట్ షో అనే డిజిటల్ యాడ్ ఏజెన్సీ దీని పేరెంటింగ్ కంపెనీ. దాని ఫౌండర్లయిన ఓ ముగ్గురి బ్రెయిన్ చైల్డే ఈ చాయ్ బిస్కెట్. ఆన్ లైన్ లో స్వచ్ఛమైన ఎంటర్టయిన్మెంట్ కి కేరాఫ్ గా మారింది. అటు చాయ్, ఇటు బిస్కెట్ రెండు పక్కా హైదరాబాదీ పదాలు. అలా అందరికీ కనెక్ట్ అవుతుందనే ఈ పేరు పెట్టారు. పైగా మనోళ్లకు బోర్ కొడితే ఏం చేస్తారు. సాధారణంగా ముచ్చట్లు పెట్టుకుంటారు. దానికి అవకాశం లేకపోతే టీవీ, సినిమా. అదీ కుదరక పోతే ఆన్ లైన్. ఈ రోజుల్లో ఫేస్ బుక్ కూడా బోర్ కొట్టేస్తోంది. ఇలాంటి వారికోసం ఓ ఆన్ లైన్ ప్లాట్ ఫాం తీసుకు రావాలనుకున్నారు. అలా మొదలు పెట్టిందే చాయ్ బిస్కెట్. ఇప్పుడు ఖండాంతరాల్లో ఉన్న తెలుగు జనాలు ఫ్యాన్స్ గా మారుతున్నారు.

image


ఓ క్రియేటివ్ మీడియా ప్లాట్ ఫాం

ఎన్నో మీడియా ఫ్లాట్ ఫామ్స్ ఉన్నాయి, మరెన్నో యాప్స్ ఉన్నాయి. ఎంటర్టయిన్మెంట్ సెక్టార్ లో దుమ్ము రేపిన సైట్లకూ కొదవలేదు. అయితే వాటన్నింటి కంటే చాయ్ బిస్కెట్ డిఫరెంట్. “అందరూ అన్ని రకాల సొల్యూషన్ చూపిస్తున్నారు, కానీ కంటెంట్ అందించే వారు ఎవరూ లేరంటారు కో ఫౌండర్ శరత్.

కంటెంట్ అంటే మామూలు కంటెంట్ కాదు. క్రియేటివ్ కంటెంట్. ఫోటో ఎడిటింగ్ దగ్గరి నుంచి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒరిజినల్ కంటెంట్ క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని. అయినా దాన్నే మేం ఎంచుకున్నామంటారు శరత్. ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి, క్రియేటివిటీకి పదును పెట్టాలి, అదే మాకు పెద్ద చాలెంజ్ అంటారాయన.

సినిమా మాధ్యమంగా సామాజిక విషయాలను మిక్స్ చేసి సరదాగా మాట్లాడుకునే మాటలను కూర్చడమే చాయ్ బిస్కెట్ పని . సైట్ లో నెగెటివ్ ప్రాపగండ, పాలిటిక్స్ అనేవి కనపడవు. పైగా వాటికి దూరమని అంటున్నారు సైట్ నిర్వాహకులు. ఫాలోవర్స్ ఎప్పటి కప్పుడు రీచార్జ్ కావాలి.. ఇదే చాయ్ బిస్కెట్ బేసిక్ కాన్సెప్ట్ .

image


చాయ్ బిస్కెట్ టీం

చాయ్ బిస్కెట్ కు ముగ్గురు కో ఫౌండర్లున్నారు. మొదటి వ్యక్తి అనురాగ్ రెడ్డి. బెంగళూరులోని ఓ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీయే పూర్తి చేశారు. తర్వాత అడ్వర్టజింగ్ లో పనిచేశారు. శరత్, రోహిత్ ఈ సంస్థకు కో ఫౌండర్లు. వీరిద్దరూ కూడా సింబియాసిస్ నుంచి ఎంబీయే కంప్టీట్ చేశారు. ముగ్గురూ ఫస్ట్ షో అనే డిజిటల్ యాడ్ ఏజెన్సీ కోసం పనిచేశారు. వీరితో పాటు 12మంది టీం ఉన్నారు. దాదాపు 50 మంది దాకా ఫ్రీలాన్సర్ క్రియేటివ్ రైటర్లున్నారు. నెలకు రెండున్నర మిలియన్ల వ్యూస్ ఉంటాయి. సైట్ విజిట్ చేసేవాళ్లంతా చాయ్ బిస్కేట్ టీం మెంబర్స్ అంటున్నారు శరత్. 

చాయ్ బిస్కెట్ ముగ్గురు ఫౌండర్లు

చాయ్ బిస్కెట్ ముగ్గురు ఫౌండర్లు


సవాళ్లు, ఫ్యూచర్ ప్లాన్స్

చాయ్ బిస్కెట్ సైట్ అంటే జస్ట్ వినోదం మాత్రమే కాదు.. మోటివేషన్, ఇన్నో వేషన్ కు కేరాఫ్ గా మారాలంటారు ఫౌండర్లు. ఈ ఏడాది చివరికల్లా నెలకు ఐదు మిలియన్ల వ్యూస్ కి రీచ్ కావాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. టెక్ ప్లాట్ ఫాంలో ఉన్న యాప్ లు, సైట్ల లాగా కాకుండా.. ఓ కంటెంట్ సైట్ గా కొనసాగడం అత్యంత క్లిష్టమని శరత్ అంటున్నారు. .

చాయ్ బిస్కెట్ పూర్తి బూట్ స్ట్రాపుడ్ స్టార్టప్. సస్టెయినబుల్ రెవెన్యూ మోడల్ లో.. ఈ సంస్థ ఫండింగ్ కోసం చూస్తోంది. ఏంజిల్ రౌండ్ కి సిద్ధంగా ఉన్నట్లు శరత్ ప్రకటించారు. ఫండింగ్ వస్తే అన్ని ఫార్మాట్లలో సేవలను అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఫ్యాషన్, ఈవెంట్స్, వీడియో కంటెంట్ లాంటివి భవిష్యత్ ప్రణాళికలని శరత్ అంటున్నారు. ప్రస్తుతం వెబ్ సైట్ ద్వారా కంటెంట్ అందిస్తున్న చాయ్ బిస్కెట్.. తొందరలోనే యాప్ రూపంలో కూడా అందుబాటులోకి రానుందని ఆయన తెలిపారు.

“చాయ్ బిస్కెట్ అంటే తెలుగు కంటెట్ కి కేరాఫ్ గా మారాలి, ఓ టాలెంట్ హౌస్ గా చూడాలనుకుంటున్నామని ముగించారు శరత్”

website