అంతర్జాతీయ ప్రమాణాలతో సంగారెడ్డిలో మెడికల్ డివైజెస్ పార్క్

అంతర్జాతీయ ప్రమాణాలతో సంగారెడ్డిలో మెడికల్ డివైజెస్ పార్క్

Saturday June 17, 2017,

1 min Read

మేకిన్ తెలంగాణలో భాగంగా ఇప్పటికే ఎన్నో పరిశ్రమల స్థాపిస్తున్న ప్రభుత్వం తాజాగా వైద్యరంగం అభివృద్ధికి బాటలు పరిచింది. సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో 250 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ డివైజెస్ పార్కుకు శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్న 14 కంపెనీలకు స్థలాల కేటాయింపు పత్రాలను అందజేశారు.

image


కేవలం వైద్య పరికరాల ఉత్పత్తి మాత్రమే కాకుండా రీసెర్చ్, డెవలప్ మెంట్ కూడా ఉండాలనే ఉద్దేశంతో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ రంగాలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ పార్క్ తో ప్రతక్ష్యంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది.

వైద్యానికి సామాన్యుడు పెట్టే ఖర్చు తగ్గించే విధంగా ఇన్నోవేషన్ కూడా ప్రోత్సహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. అందులో భాగంగానే ఇన్నోవేషన్, ప్రోటోటైప్, స్కేలింగ్, మ్యాన్సుఫ్యాక్చరింగ్ పేరుతో ఒక సమగ్ర ఇకో సిస్టమ్ రూపొందిస్తున్నామన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్, పోలో, మెట్రానిక్స్, జీఈ, సయాన్స్ వంటి కంపెనీలు ముందుకొచ్చాయని కేటీఆర్ తెలిపారు.

స్కిల్డ్, సెమి స్కిల్డ్ పొజిషన్ లో ఉపాధి స్థానికులకే సింహభాగం ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్కిల్డ్ పీపుల్ విషయంలోనూ నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. టాస్క్ ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అంతర్జాతీయ కంపెనీలైన చైనా మెడికల్ సిటీతో ఎంవోయూ చేసుకుంటామన్నారు. ఆల్రెడీ గాంగ్ వాన్ కొరియాతో కుదిరిన ఒప్పందంతో అక్కడి నాలెడ్జ్ ని ఇక్కడ ప్రవేశపెడతామన్నారు.

ఫార్మారంగంలో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇక వైద్య పరికరాల ఉత్పత్తి-పరిశోధన-అభివృద్ధిలోనూ దూసుకుపోతుందనడంలో సందేహం లేదు.