స్టార్టప్ ఇండియాను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

స్టార్టప్ ఇండియాను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ

Saturday January 16, 2016,

1 min Read

యువతరం స్టార్టప్ ల వైపు అడుగులేస్తున్నది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10వేల వరకు స్టార్టప్స్ ఉండగా... 2020 నాటికి ఆ సంఖ్య లక్షకు చేరుతుందని అంచనా. అయితే సరైన గైడెన్స్, ప్రోత్సహం లేక చాలా స్టార్టప్స్ మూతపడుతున్నాయి. అంతేకాదు టాలెంట్ ఉన్నా నిధులు లేక ఆలోచనలు పక్కన పెట్టి ఏదో ఒక జాబ్ లో అడ్జస్ట్ అయిపోతున్నవారూ లేకపోలేదు.

image


ఇలాంటి వారికి చేయూత ఇవ్వడంతో పాటు యువతలో దాగిన సృజనాత్మకతను వెలికి తీసి, ప్రోత్సహించేందుకు ప్రధాని ఇచ్చిన నినాదమే స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా. ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఆవిష్కరించారు.

ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. ప్రపంచ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్ ఓనో రుహి ఓపెనింగ్ సెరిమనీలో పాల్గొన్నారు. తర్వాత సాఫ్ట్ బ్యాంక్ సీఈవో, ఫౌండర్ మసయోషి సన్ తో ఇంటరాక్షన్ సెషన్ జరిగింది.

యువర్ స్టోరీ తో పాటు దేశంలోని దాదాపు 1500 టాప్ స్టార్టప్స్ ఫౌండర్లు, సీఈఓలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈవెంట్ ముగింపులో మోడీ స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ ను ప్రకటించారు. దేశంలో స్టార్టప్ ల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేయనున్నపథకాల గురించి అందులో ప్రస్తావించారు.

డే-లాంగ్ జరిగిన ప్రోగ్రాం

image


ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిపార్ట్ మెంట్... స్టార్టప్ లను ప్రోత్సహిస్తున్న ఐ స్పిరిట్, యువర్ స్టోరీ, నాస్ కాం, షీ ది పీపుల్ డాట్ టీవీ, కైరోస్ సొసైటీ, ఫిక్కీ, సీఐఐ యూత్ వింగ్ తో కలిసి ఈ ప్రోగ్రాంను ఆర్గనైజ్ చేశాయి.