ఆడవాళ్ల షాపింగ్ సీక్రెట్ ఇదా..?!

0

మగవాళ్ల కంటే మహిళలు ఎక్కువగా ఎందుకు షాపింగ్ చేస్తారు?

అవును... మేము షాపింగ్ పేరెత్తితే చాలు ఎగిరి గంతేస్తాం. షాప్ హాలిక్స్ అని బిరుదు కూడా ఇచ్చారు. ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్. షాప్స్ ఎక్కుడున్నాయన్న పట్టింపేమీ మాకు లేదు. షాపింగ్ లో మునిగామంటే మమ్మల్ని అందుకోలేరు. మాపై సోషల్ మీడియాలో ఎన్నెన్నో జోకులు చదివాం. నవ్వాం. విసుక్కున్నాం. మాకు బ్రౌజింగ్ అంటే ఇష్టం. కొత్తవి తీసుకోవడం.. ట్రై చేయడం ఇష్టం. మేం కొనాలనుకున్న వస్తువులను కళ్లప్పగించి చూస్తాం (ఇది చూసి విండో షాపింగ్ లో మేం లీనపై పోయామని మగాళ్లు అనుకుంటారు). క్యాష్ కౌంటర్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు మా చేతిలో ఉండే ప్రియమైన వస్తువులను కళ్లప్పగించి చూస్తుంటాం. ఎందుకంటే మేం వాటితో ప్రేమలో పడిపోతాం. కానీ మగాళ్లు ఈ సందర్భాలను ఉదాహరణలుగా చూపించి మాకు షాపింగ్ ను కంట్రోల్ చేసుకునే శక్తి లేదని స్టేట్ మెంట్లు ఇచ్చే స్తుంటారు. దీనికే మమ్మల్ని షాప్ హాలిక్స్ అని ముద్రవేస్తారు. అంతెందుకు... ఈ పేరుతోనే ఓ బెస్ట్ సెల్లింగ్ మూవీ కూడా ఉంది. తొమ్మిది బుక్ సిరీస్ లు వచ్చాయి. మా బాయ్ ఫ్రెండ్స్, భర్తలు, సోదరులు, తండ్రులు... మా షాపింగ్ అడిక్షన్ బియేవియర్ పై కామెంట్స్ చేస్తుంటారు. 

ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చేసిన తర్వాత ఇలాంటి షాపింగ్ మారథాన్ల నుంచి వారిని కాపాడాయి. మాకు ఏది బాగుంటుందో చెప్పనవసరం లేదు కానీ... మంచివి కొనండి అని ఒక్క మాట చెప్తే అదే మాకు చాలా ఆనందం. మమ్మల్ని చూసి షాపింగ్ యాత్రలు చేస్తున్నాం అనుకోవచ్చు. నిజమే, పురుషుల కంటే మహిళలు ఎక్కువగా షాపింగ్ చేస్తారు. కానీ... ఎందుకిలా అని ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మేము కొనే చీరలు, నగలు చూసి కాదు... ఆ పరిధి దాటి మాకు షాపింగ్ అంటే ఎందుకంత ఇష్టం పెంచుకున్నామని సమాధానం తెలుసుకోండి.

అమెజాన్ ఇండియా స్పాన్సర్ చేసిన కథనం ఇది. ఈ వీడియో చూడండి.