మందుకొట్టామని టెన్షన్ పడకండి! మీబండిని ఓకే బాయ్స్ నడిపిస్తుంది!!

మందుకొట్టామని టెన్షన్ పడకండి! మీబండిని ఓకే బాయ్స్ నడిపిస్తుంది!!

Monday July 10, 2017,

2 min Read

సరిగ్గా ఏడాది క్రితం మందుకొట్టి విచ్చలవిడిగా కారు నడిపి ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన ఇంకా నగరవాసుల కళ్లముందే ఉంది. డ్రంకెన్ డ్రైవ్ చేపట్టినా నిత్యం ఎక్కడోచోట ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి. దీనికి అడ్డుకట్ట పడాలంటే స్వీయనియంత్రణ తప్ప, మరోమార్గం లేదు. పోలీసుల డ్రైవ్ అన్ని చోట్ల ఉండలేదు కాబట్టి.. తనవంతుగా ఓ పరిష్కారాన్ని కనుగొన్నాడు. దానిపేరే ఓకే బాయ్స్.

image


తాగి బండి నడపడం ఎంతమాత్రమూ శ్రేయస్కరం కాదు. జరగరానిది జరిగితే మనల్ని నమ్ముకున్న ఇంటిల్లిపాదీ రోడ్డున పడుతుంది. డ్రంకెన్ డ్రైవ్ చేపట్టిన పోలీసుల నుంచి తప్పించుకుని, సందుగొందుల్లోంచి బండి నడపడం ఇంకా మంచిది కాదు. అలాంటి ప్రయాణం చాలా ప్రమాదం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రూపొందించిందే ఓకే బాయ్స్ యాప్.

ఇది ప్రధానంగా డ్రంకెన్ డ్రైవ్ రిలేటెడ్ యాప్. పార్టీలో పీకల్దాకా తాగినా ఉన్నా, గెట్ టు గెదర్ లో ఫుల్లుగా మందు కొట్టాల్సి వచ్చినా, బండిమీద ఇంటికి వెళ్లడానికి టెన్షన్ పడాల్సిన పనిలేదు. యాప్ ఓపెన్ చేసి సింగిల్ క్లిక్ ఇస్తే చాలు డ్రైవర్ మీ ముందు వాలుతాడు. మీ ఏరియా సెలెక్ట్ చేసుకున్న క్షణాల్లో ఐదు కిలోమీటర్ల లోపు ఉన్న డ్రైవర్లంతా కాంటాక్టులోకి వస్తారు. నిమిషాల వ్యవధిలోనే ఒక డ్రైవర్, అతని అసిస్టెంట్ టూవీలర్లో మీ దగ్గరికి చేరుకుంటారు. మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. ఫీజు పెద్దగా లేదు. డ్రైవర్ కు రూ. 250, అతని అసిస్టెంటుకు రూ. 100 ఇస్తే చాలు.

అర్ధరాత్రి బండి నడుపుతామని వచ్చిన వ్యక్తిని ఎలా నమ్మేది అనే ప్రశ్న తలెత్తొచ్చు. అందులో భయపడాల్సిన పనిలేదంటారు యాప్ సీఈవో రవి కుమార్. డ్రైవర్లను అన్ని రకాలుగా స్క్రూటినీ చేసిన తర్వాతనే నియమించుకున్నాం అంటున్నారు. అతని ఆధార్ కార్డు, ఇతర వివరాలన్నీ విచారించిన తర్వాతే డ్రైవర్ గా పెట్టుకున్నాం అని చెప్తున్నారు. ఈ యాప్ ని బిజినెస్ యాంగిల్లో కాకుండా సర్వీస్ ఓరియెంటెండ్ గానే రూపొందించాం అని తెలిపారు.

డ్రైవింగ్ సర్వీసులో కాంపిటీటర్స్ ఉన్నా గానీ, వాళ్ల ఉద్దేశం వేరు. ఈ యాప్ కాన్సెప్ట్ వేరు. దీన్ని మెయిన్ గా సోషల్ సర్వీస్ యాంగిల్లోనే డిజైన్ చేశారు. ఇకపై డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించాల్సిన పనిలేదు అని సర్కారు అనుకునేలా చేయడమే తమ లక్ష్యం అంటున్నారు సంస్థ నిర్వాహకులు. టూ, ఫోర్ వీలర్ డ్రైవింగ్ వచ్చిన నిరుద్యోగ యువకులు తమ సంస్థ ద్వారా పార్ట్, ఫుల్ టైం ఉద్యోగులుగా పనిచేయవచ్చని చెప్తున్నారు. భవిష్యత్తులో ఈ యాప్ సేవలను రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత పరచాలన్నదే తమ లక్ష్యం అని ఓకే బాయ్స్ ఫౌండర్లు అంటున్నారు.