డిజిటల్ కంపెనీలు కోల్పోతున్న మార్కెట్ ఏంటి..?  

వీ మాక్స్ సీఈవో ఆసక్తికరణ విశ్లేషణ

0

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ అందరి దగ్గరా ఉంది. అది చిన్నదా పెద్దదా అన్నది మేటర్ కాదు. కానీ తయారు చేసే యాప్స్ ఎంతమందికి చేరువవుతున్నాయి..? యాప్ డెవలపర్స్, డిజిటల్ కంపెనీలు ఎవరిని దృష్టిలో పెట్టుకుని యాప్స్ తయారు చేస్తున్నాయి..? వారు కోల్పోతున్న మార్కెట్ సెగ్మెంట్ ఏంటి? యువర్ స్టోరీ నిర్వహించిన మొబైల్ స్పార్క్స్ వేదికగా వీ మాక్స్ సీఈవో దీపక్ ఖురానా చేసిన ఆసక్తికరణ విశ్లేషణ చదవండి.

గత ఆర్నెల్లుగా నేను ఒక ఆంట్రప్రెన్యూర్ గా నేను చాలామంది వ్యాపారులను, సంస్థల అధినేతలను, స్టార్టప్ కంపెనీలను కలిశాను. వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను గమనించాను. ఆ సమస్యను ఒక్కమాటలో చెప్పాలంటే వాళ్లు కోట్లాదిమంది వినియోగదారులను పూర్తిస్థాయిలో అర్ధం చేసుకోలేదు.

రెండేళ్లుగా గమనిస్తే ఒకటి క్లియర్. మొబైల్, టెక్నాలజీ అనే ఈ రెండు అంశాలు ప్రపంచ గమనాన్ని అత్యంత వేగంగా మారుస్తున్నాయి. వీటిని సరిగ్గా డీల్ చేయగలిగితే వినియోగదారుడితో ఎలాంటి సమస్యా రాదంటాడు దీపక్ ఖురానా.

ఇండియాను మూడు సెగ్మెంట్లు విభజిస్తే..

ఇండియా3- దేశంలో 55శాతం అంటే 650 మిలియన్ల జనాభా నెలసరి ఆదాయం రూ.1,500.

ఇండియా2- దేశంలో 30శాతం అంటే 450 మిలియన్ల జనాభా నెలసరి ఆదాయం రూ.8,000.

ఇండయా1- మిగిలిన 15 శాతం మాత్రమే ఈ సెగ్మెంట్లో ఉన్నారు.

భారత ప్రస్తుతం మార్కెట్ చాలా దిగువన ఉంది. అంటే పైన చెప్పుకున్న సెగ్మెంట్ 3లో ఉందన్నమాట. అయినప్పటికీ చాలామటుకు డిజిటల్ కంపెనీలు సెగ్మెంట్ 1 మార్కెట్ మీదనే ఫోకస్ చేశాయి. దీన్నిబట్టి అర్ధం చేసుకునేదేంటంటే కంపెనీలన్నీ సెగ్మెంట్ 3 మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే డిమాండ్ ఈక్వల్ అవుతుంది.

ఒకసారి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ సెగ్మెంట్ చూసుకున్నట్టయితే మార్కెట్లో దానిదే అగ్రతాంబూలం. ఉదాహరణకు షాంపో సాచెట్స్ తీసుకుంటే.. అదొక విస్తారమైన మార్కెట్. సేల్స్ విపరీతంగా ఉంటాయి. అదేవిధంగా మొబైల్ గురించి చెప్పాలంటే.. మార్కెట్లో చోటా రీచార్జ్ కూపన్లు. అవి కూడా హాట్ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. అయినప్పటికీ డిజిటల్ కంపెనీలన్నీ సెగ్మెంట్ వన్ మీదనే ఎందుకు ఫోకస్ చేశాయి.

ఇకపోతే దేశంలో 55 శాతం మంది మాత్రమే స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. సెగ్మెంట్ 2 లో ఉన్న జనాభా 15వేల కంటే తక్కువ ఖరీదైన ఫోన్లు యూజ్ చేస్తున్నారు. సెగ్మెంట్ వన్ కేటగిరీలో ఉన్నవాళ్లంతా 15వేలు, ఆపైన విలువైన మొబైల్స్ వాడుతున్నారు. అయినాగానీ, యాప్స్ అన్నీ సెగ్మెంట్ 1 కేటగిరీ ప్రజలను దృష్టిలో పెట్టుకునే తయారు చేస్తున్నారు. ఇలాంటి ఆలోచనా ధోరణి మారాలి అంటారు దీపక్.

ఆంట్రప్రెన్యూర్లు, యాప్ డెవలపర్లు ఒక్కసారి గీసుకున్న గిరి దాటి బయటకు వచ్చి చూడాలి. ఇండియా 3 మార్కెట్ ఎంత పెద్దగా ఉందో పరిశీలించాలి. ఏం కోల్పోతున్నారో తెలుసుకోవాలి. కస్టమర్ తో ఉండి అతనికి ఏం కావాలో లోతుగా ఆలోచించాలి- దీపక్

Related Stories