వీళ్లది కంటెంట్ తో కొట్టే స్టార్టప్

మీడియాకు కంటెంట్ అందించే ఫ్లాట్ ఫామ్ లో రాణిస్తున్న మాజీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు

వీళ్లది కంటెంట్ తో కొట్టే స్టార్టప్

Friday April 29, 2016,

4 min Read


భారత్ లో కొన్ని వేల వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, వీక్లీలు, మంత్లీలు ఉన్నాయి. అయితే, అన్నింటికి కంటెంటే పెద్ద ప్రాబ్లం. న్యూస్ కోసం ఎజెన్సీలు ఉన్నా... మిగతా కంటెంట్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రత్యేకంగా వీటి కోసం రచయితల్ని ఏర్పాటు చేసుకోవడం ఎంత పెద్ద సంస్థకైనా కష్టమే. అందుకే ఎక్కువగా ఇలాంటివి ఫ్రీలాన్సర్ల కోసం చూస్తూంటాయి. కానీ ఇలాంటి వారిని... ప్రతిభావంతుల్ని వెదికిపట్టుకోవడమే పెద్ద కష్టం. ఈ సమస్యను పరిష్కరించి.. అటు రచయితలకు, ఇటు మీడియా సంస్థలకు వారధిగా నిలిచే కంటెంట్ ఫ్లాట్ ఫామ్ స్టార్టప్ "కాలగీ".

రచయితల స్టార్టప్

రాఘవ్ శర్మ ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కానీ తనకు రచనలంటే చాలా ఇష్టం. తనకిష్టమైన టాపిక్ కనబడితే దానపై ఏదో ఆర్టికల్ రాయనిదే నిద్రపట్టేది కాదు. ఒక్కోసారి ఆఫీసును సైతం మర్చిపోయి అలా రచనా వ్యాసంగంలో గడిపేవాడు. రెండేళ్లు ఉద్యోగం చేసిన తర్వాత తనకు ఆ ఫీల్డ్ సరిపడదని డిసైడయ్యారు. రచనల కోసం పూర్తి సమయాన్ని కేటాయించేందుకు జాబ్ ను వదిలేశాడు. "ద వుండెడ్ టైగర్" పేరుతో ప్లిప్ బుక్ మ్యాగజైన్ ను ప్రారంభించాడు. అయితే తన రచనలపైనే దృష్టి కేంద్రీకరించడం.. మిగతా కంటెంట్ విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో ఇది టార్గెట్ ఆడియన్స్ ను రీచ్ కాలేకపోయింది. ఫలితంగా ఎంత త్వరగా ప్రారంభమయిందో.. అంత త్వరగా ముగిసిపోయింది.

అయితే ఈ వైఫల్యం రాఘవ్ శర్మను నైరాశ్యంలోకి నెట్టలేదు. తర్వాత వెంచర్ కు ఈ అనుభవమే పెద్దపెట్టుబడిగా భావించాడు. కొంత పరిశోధన తర్వాత 2015 ఫిబ్రవరిలో కాలగీ పేరుతో కొత్త స్టార్టప్ ప్రారంభించారు. ఇన్ఫోసిస్ లో తన సహచరుడు రవి పిప్లాని, NIT గ్రాడ్యూయేట్ హిమాన్షు అగర్వాల్ ను ఈ సారి తనతో కలుపుకున్నారు. మీడియా సంస్థలకు కంటెంట్ సోర్సింగ్ అందిస్తుంది కాళగి.

మీడియా సంస్థలకు రచయితలకు మధ్య వారథి "కాలగి"

పబ్లికేషన్, మీడియా సంస్థలకు కంటెంట్ సమకూర్చిపెట్టే ఫ్లాట్ ఫామ్ లో కాలగిది విభిన్నమైన స్థానం. పబ్లిషర్స్, రచయితలను ఒకే వేదికపైకి తెచ్చి ఎవరి అవసరాలను వారు చర్చించుకునే సౌకర్యం కాలగి కల్పిస్తోంది. ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపించే అంశాల్లో రచనల కోసం వార్తపత్రికలు, మ్యాగజైన్లు తీవ్రంగా శ్రమిస్తూంటాయి. చాలా ఖర్చు చేస్తూంటాయి. అయినప్పటికీ.. సంతృప్తికర కథనాలు అందించడం క్లిష్టమైనపనే. సమయంతో పాటు చాలా ప్రాసెస్ వీటి కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా రచయితలకు తగిన గుర్తింపు కూడా దక్కడం కష్టమే.

పబ్లిషర్స్ కు, రచయితలకు మధ్య ఉండే ఇలాంటి గ్యాప్ ను తగ్గించడానికి కాలగి ప్రయత్నిస్తోంది. రచయితలు తమ రచనలను కాలగిలోకి అప్ లోడ్ చేస్తే కావాల్సిన వాటిని పబ్లిషర్స్ ఎంపిక చేసుకునేలా ఈ వ్యవస్థ ఉంటుంది.అప్పుడు రచయితలు మంచి అవుట్ పుట్ ఇవ్వడానికి.. అలాగే పబ్లిషర్స్ తమకు అవసరమైనవాటిలో అత్యుత్తమైనవాటిని ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.

"కంటెంట్ అప్ లోడింగ్ దే ఇప్పుడు రాజ్యం. కొన్ని మిలియన్ల మంది తమ కంటెంట్ ను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. అందుకే మేం కంటెంట్ అప్ లోడ్ ఫ్లాట్ ఫామ్ ను అది కూడా పబ్లిషింగ్ కోసం మేగజైన్స్, న్యూస్ పేపర్స్ ఎంచుకునేలా చేసేలా రూపొందించాలనుకున్నాం. దీని వల్ల ఇంకా ఎక్కువ మందికి ఆ రచన చేరుతుంది" రాఘవ్, కాలగి ఫౌండర్

కాళగి బృందం <br>

కాళగి బృందం


కటౌట్ లేదు కానీ.. కంటెంట్ ఉంది..!

పబ్లికేషన్ సంస్థలు కంటెంట్ కోసం కాలగి ఫ్లాట్ ఫామ్ లో రిజిస్టర్ చేసుకుని "టాస్ ఏ టాపిక్" ఫీచర్ ద్వారా కంటెంట్ కోసం రిక్వెస్ట్ పంపించవచ్చు. వారికి ఎలాంటి ఫీచర్ ఆర్టికల్ కావాలో.. ఎలాంటి రచన కావాలో పబ్లికేషన్ సంస్థలు స్పష్టంగా పేర్కొంటాయి. దానికి తగ్గట్లుగా కాలగిలో రిజిస్టరైన రచయితులు.. యూజర్లు తమ రచనలను అప్ లోడ్ చేస్తారు. వాటిని పబ్లికేషన్ సంస్థలు రివ్యూ చేసుకుంటాయి. పనికొస్తే పబ్లిష్ చేసుకుంటాయి. లేకపోతే లేదు. ప్రస్తుతం ఈ విధానం ద్వారా కంటెట్ ను ఎక్కువగా వీక్లీ, మంత్లీ మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ సండే సప్లిమెంట్లతో వాడుకుంటున్నాయి. మరో విధానం ద్వారా తమ రచనలను.. రైటర్స్ నేరుగా అప్ లోడ్ చేయవచ్చు. ఇది చదివేందుకు అందరికీ అందుబాటులో ఉంటుంది. దీని వల్ల రచయిత ప్రతిభ నచ్చిన సంస్థలు అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి.

వర్డ్ ప్రెస్ తో పాటు ఇలాంటి ఏ ఇతర ప్లాట్ పామ్ కూడా కాలగి ఉపయోగించడం లేదు. రవి సొంతంగా ఓ ఫ్లాట్ ఫామ్ ను సిద్దం చేశారు. దీని ద్వారా కాలగికి రచనలు సులువుగా అప్ లోడ్ చేయవచ్చు. వర్డ్, గూగుల్ డాక్స్ కన్నా సులువుగా ఉండేలా ఈ ఫ్లాట్ ఫామ్ ను రవి రెడీ చేశారు. ఎడిటింగ్, రివ్యూయింగ్ ఫీచర్సన్నీ దీనికి ఉన్నాయి.

రెవిన్యూ కంటెంట్ ఘనం

పబ్లికేషన్ సంస్థలకు నెలవారీ మంత్లీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ తో కంటెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. బేసిక్, ప్రో, ప్లస్ అనే మూడు విభాగాల్లో అరవై, ఎనభై, వంద డాలర్లు ఛార్జ్ చేస్తున్నారు. సబ్ స్క్రిప్షన్ ప్లాన్.. పబ్లికేషన్ సంస్థ కు ఓ నెలలో కావాల్సిన కంటెంట్, వాటి విభాగాల ఆధారంగా నిర్ణయిస్తున్నారు. బేసిక్ ప్లాన్ లో ఉన్న వాళ్లు నెలకి నాలుగు కంటెంట్ ఆర్టికల్స్ ను పబ్లిష్ చేసుకోవచ్చు. నాలుగు నుంచి పది వరకు పబ్లిష్ చేసుకుంటే ప్లాన్ మారుతుంది.

ప్రస్తుతం కాలగికి మూడు వేల మంది రిజిస్టర్డ్ మెంబర్లున్నారు. వీరిలో పదిహేడు వందల మంది రచయితలు. కొంత మంది రీడర్స్. 45కుపైగా పబ్లికేషన్ సంస్థలు కంటెంట్ ను వాడుకుంటున్నాయి. నెలకు కనీసం వంద మంది యూజర్లు కొత్తగా కాలగిలో రిజిస్టర్ చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద మీడియా సంస్థలైన ద స్టేట్స్ మన్, హిందుస్థాన్ టైమ్స్ కూడా కాలగి కంటెంట్ ను వాడుకుంటున్న జాబితాలో ఉన్నాయి.

వచ్చే ఏడాది యాప్ ను ఆవిష్కరించి.. ఇంటర్నేషనల్ మార్కెట్లలోకి ప్రవేశించాలని కాలగి బృందం ప్రణాళికలు రచిస్తోంది. యూకే, కెనడాతో పాటు ఆఫ్రికా దేశాల్లోనూ అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఇటీవలి కాలంలోఆఫ్రికాలో పబ్లికేషన్ల సంఖ్య పెరగడంతో అక్కడ మార్కెట్ విస్త్రతమవుతోందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు హిందీ, ఇంగ్లిష్ లో మాత్రమే కాలగి సేవలు అందిస్తోంది. ఏ ఏడాది చివరి కల్లా తమిళ, బెంగాలీ, ఉర్దూ భాషల ఫ్లాట్ ఫామ్ ప్రారంభించనున్నారు. స్వాహిలీ లాంటి విదేశీ భాషలపైనా దృష్టి పెట్టారు. వీలైనంత ఎక్కువ మంది రచయితలుగా పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

"మనలో చాలా మంది రచనలను ఎంత విలువైనవో తెలిసినప్పటికీ సీరియస్ గా తీసుకోం. అయితే అవి పబ్లిషింగ్ అవడం ప్రారంభమైన తర్వాత ఆసక్తి ఏర్పడుతుంది. మరింత మంది నెట్ వర్క్ లో జాయినవుతారు. సీరియస్ గా రచనలు చేస్తారు "-రాఘవ్ 

image


స్థానిక భాషలదే రాజ్యం

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇంటర్నెట్ లో స్థానిక భాషల కంటెంట్ కు యూజర్ బేస్ 39శాతం చొప్పున పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పెరుగుదల రేటు 75శాతం. అర్బన్ ఇండియా ఈ పెరుగుదల శాతం 16శాతమే. గత ఏడాది హిందీ కంటెంట్ ఆదరణ ఏకంగా 94శాతం పెరిగింది.అదే సమయంలో ఇంగ్లిష్ కు పెరిగిన ఆదరణ 19శాతమే.

ప్రస్తుతం స్థానిక భాషల్లో కంటెంట్ అందించడానికి రెండు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. స్థానిక భాషల్లో రచనలను అందించేవారిని, అలాగే రచనలను పాపులరైజ్ చేయడం కొద్దిగా క్లిష్టమైన పని. అలాగే రెండోది... స్థానిక భాషల రచనలను డిజిటల్ కంటెంట్ గా మార్చడం కూడా అంత తేలికైన వ్యవహారం కాదు. ఈ రెండు సమస్యలను సంపూర్ణంగా అధిగమించేందుకు కాళగి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

ప్రస్తుతం భారతదేశంలో 80,000కుపైగా న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటన్నింటినీ కంటెట్ అవసరమే. కానీ ఉన్నదాంతోనే సరిపెట్టుకుంటున్నాయి. వాటి అవసరాలకు తగ్గట్లుగా కంటెంట్ ను వారి దగ్గరకు చేరిస్తే చేతికంతే మార్కెట్ ను అంచనా వేయలేము.