పేటీఎం యాప్ పాస్ వర్డ్ .. ఇక మీ వాలెట్ మరింత సేఫ్..  

మీ ఫోన్ పోయినా డబ్బుకు నో టెన్షన్

0

పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బాగా లాభపడ్డ డిజిటల్ పేమెంట్ వేదిక ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా పేటీఎం అని చెప్పొచ్చు. ఆ మధ్య అసౌకర్యం కలిగించి విమర్శల పాలైన మాట ఎలా వున్నా.. ట్రాన్సాక్షన్లో మాత్రం దూకుడు ఏమాత్రం తగ్గలేదన్నది వాస్తవం. కొత్తకొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ క్యాష్ లెస్ ఎకానమీ దిశగా సాగుతోంది. ఆ కోవలోకి వచ్చిందే కొత్తగా వచ్చిన యాప్ పాస్ వర్డ్ ఫీచర్. ఇటీవలే ఈ సౌకర్యాన్ని యాండ్రాయిడ్ ఫోన్లో ప్రవేశపెట్టింది పేటీఎం.

ఒకవేళ మీ ఫోన్ పోయినా, మీ పేటీఎం అకౌంట్ మాత్రం భద్రం. ఎలాగంటే.. యాప్ పాస్ వర్డ్ ఫీచర్ ద్వారా పిన్ గానీ, పాస్ వర్డ్ గానీ, ప్యాటర్నర్ గానీ లేదంటే ఫింగర్ ప్రింట్ గానీ భద్రంగా సెట్ చేసుకోవచ్చు. చేయాల్సిందల్లా ఒకటే. మెనూలో ఉన్న సెట్టింగ్స్ లోకి వెళ్లి సెక్యూరిటీ ఆప్షన్స్ ద్వారా పాస్ వర్డ్ సెట్ చేసుకోవడమే. అప్ డేటెడ్ పేటీఎం యాప్ మీద పే లేదా పాస్ బుక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే చాలు మీ ఆప్షనల్ ఫీచర్లను మీమీ సౌకర్యాన్ని బట్టి ఎంచుకోవచ్చు.

యాడ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేస్తే మీ ఫోన్ పాస్ వర్డ్ రికన్ఫమ్ చేయమని అడుగుతుంది. దాంతో మీరు నచ్చిన కొత్త పాస్ వర్డ్ ఎంచుకోవచ్చు. ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే సెక్యూరిటీ సెట్టింగ్స్ లోకి వెళ్లి మెకానిజాన్ని డిసేబుల్ చేసుకోవచ్చు.

“ఎందుకంటే మా కస్టమర్ డబ్బును కంటికి రెప్పలా కాపాడటమే మా మొదటి ప్రాధాన్యత. ఒకవేళ ఖాతాదారుడి ఫోన్ పోయినా అతడి సొమ్ము పోవద్దనే ఉద్దేశంతోనే ఈ సెక్యూరిటీ యాప్ యాడ్ చేశాం. ఇది కేవలం 164 మిలియన్ల యూజర్లను మైండ్లో పెట్టుకుని చేసింది కాదు.. మా సర్వీసు పట్ల కమిట్మెంట్ ను కూడా తెలియజేయాలని ఇలాంటి భద్రత ఇస్తున్నాం “-దీపక్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పేటీఎం.

ప్రస్తుతం పేటీఎంతో మిలియన్ యూజర్లకు పైగా ఆఫ్ లైన్ లావాదేవీలు జరుపుతున్నారు. ఇప్పుడిప్పుడే ఇండియా అంతా యాక్సెప్టెన్సీ వస్తోంది. టాక్సీలు, ఆటోలు, పెట్రోల్ పంపులు, గ్రాసరీ షాప్స్, రెస్టారెంట్స్, కాఫీ షాపులు, మల్టీ ప్లెక్సులు, పార్కింగ్, ఫార్మా, హాస్పిటల్స్, కిరాణా షాప్స్ తదితర చోట్ల పేటీఎంను వాడుతున్నారు. నోట్ల రద్దు తర్వాత ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో 5 మిలియన్ల లావాదేవీలు జరుగుతున్నాయి. అంటే ఎంత లేదన్నా డైలీ 24వేల కోట్ల రూపాలయ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయన్నమాట. ఇతర డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫాంలతో పోలిస్తే ఇది చాలా పెద్ద అమౌంట్. 

Related Stories